“పుష్ప 2” సినిమా తెలుగులోనే కాదు, దేశమంతా ప్రజల దృష్టిని ఆకర్షించింది. సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా వివరీతమైన బజ్ ఏర్పడింది. ఈ సినిమా గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా నెట్టింట్లో ఇట్టే వైరల్ అవుతోంది తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్స్ లీకయ్యాయని అవి ఇవేనంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
పుష్ప పంచ్ డైలాగ్స్‌కి ప్యాన్ ఇండియా ఫాలోయింగ్
పుష్ప పార్ట్ 1లో “పుష్పరాజ్” పాత్రలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్, ఆయన ప్రత్యేకమైన మ్యానరిజమ్ ప్రేక్షకుల హృదయాలను దోచేశాయి. “తగ్గేదే లే” అనే డైలాగ్ యావత్ దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. ఇప్పుడు, “పుష్ప 2″లో సుకుమార్ మరింత పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నంలో ఉన్నారు.
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న “పుష్ప-2” పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేలా సుకుమార్ పక్కా ప్లాన్ చేస్తున్నారు. ఈ పార్ట్‌లో ప్రత్యేకంగా ఊర్వశి రౌతేలాతో స్పెషల్ ఐటెం సాంగ్ కూడా ప్లాన్ చేశారు.
రష్మిక మందన్న క్రేజ్
మొదటి భాగంలో “శ్రీవల్లి” పాత్రతో రష్మిక మందన్నకు భారీ క్రేజ్ వచ్చింది. “పుష్ప” సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ దక్కిన రష్మిక, పుష్ప 2లో తక్కువ స్క్రీన్ టైం ఉన్నప్పటికీ, అభిమానులను ఆకట్టుకునేలా ఆమె పాత్రను డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేశారంట. ఇటీవల విడుదలైన “సూసేకి అగ్గిరవ్వ” పాట కూడా సూపర్ హిట్ కావడంతో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.
ఫుల్ జోష్‌లో అభిమానులు
అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు, అయితే పుష్ప 2 ద్వారా పాన్ వరల్డ్ క్రేజ్ అందుకునేలా సుకుమార్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల్లో ఒకేసారి విడుదల కానుంది. మరోవైపు ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఇదే విషయాన్ని వెల్లడించారు. డిసెంబర్ 4 నుంచి యూఎస్‌లో లాంగ్ వీకెండ్ ఉన్నందున అక్కడ బుధవారం (డిసెంబర్ 4) రోజున ‘పుష్ప 2’ రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనికి అనుగుణంగా డిసెంబర్ 5న పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్, వీడియోను సైతం మేకర్స్ రిలీజ్ చేశారు. ‘పుష్ప 2’ని ఒక రోజు ముందే రిలీజ్ చేయడం వల్ల బాగా కలిసొస్తుందని నిర్మాతలు అభిప్రాయపడ్డారు.
నాన్ థియేట్రికల్ రికార్డు
పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లు దాటినట్లు జరుగుతోన్న ప్రచారంపైనా నిర్మాత రవిశంకర్ రియాక్ట్ అయ్యారు. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి అలా చెబుతున్నట్లు పేర్కొన్నారు. నాన్ థియేట్రికల్ మాత్రం ఇప్పటివరకూ ఏ సినిమా చేయని బిజినెస్ చేసిందని స్పష్టం చేశారు.
పుష్ప 2 ఐటెం సాంగ్ షూట్ నవంబర్ 4 నుంచి మెుదలవుతుందని నిర్మాత రవిశంకర్ స్పష్టం చేశారు. తుది దిశ చిత్రీకరణలో ఆ పాట మాత్రమే మిగిలి ఉందన్నారు. ఆ సాంగ్‌లో ఎవరు చేస్తారన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. రెండ్రోజుల్లో వివరాలు వెల్లడిస్తామన్నారు.
అల్లు అర్జున్ రెమ్మ్యూనరేషన్
ఈ సినిమాకి అల్లు అర్జున్ భారీగా రెమ్మ్యూనరేషన్ తీసుకుంటున్నారు, ప్రస్తుత సమాచారం ప్రకారం ఆయనకు ఏకంగా రూ. 125 కోట్లు అందినట్టు టాక్.
పుష్ప 2 నుంచి లీకైన డైలాగ్స్
ఇక పుష్ప 2 నుంచి కొన్ని డైలాగ్స్ లీకయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఓ సినిమా ప్రమోషన్‌లో అల్లు అర్జున్ అభిమానుల కోరిక మేరకు ఓ డైలాగ్ చెప్పాడు. అది పుష్ప 2లోనిదే అని కామెంట్ చేస్తున్నారు.
“జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతుంది, పుష్ప గాడి రూల్.”
ఈ డైలాగ్‌తో పాటు మరో రెండు డైలాగ్స్ కూడా లీకయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
“అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేసాయి అంటే? పులి వచ్చిందని అర్థం.
అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజ్ వచ్చాడని అర్థం.” అనే డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ డైలాగ్‌తో పాటు మరో డైలాగ్ కూడా సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది.
. “వాళ్లు గొర్రెల్ని కాయడానికి వచ్చారు. ఆ గొర్రెల్ని తినడానికి పులి వస్తే వేసేయడానికి నేను వచ్చాను” అనే ఈ డైలాగ్ అల్లు అర్జున్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.