ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా పుష్ప 2 (Pushpa 2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ (Sukumar) తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అటు ఓవర్సీస్‌లోనూ పుష్ప ప్రమోషన్స్ వినూత్నంగా నిర్వహించేందుకు థియేటర్స్ యజమానులు రెడీ అయ్యారు.
నెల రోజుల్లో పుష్పగాడి రాక
‘పుష్ప 2’ రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో మూవీ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సడెన్‌గా కొత్త పోస్టర్ రిలీజ్ చేసి పుష్ప టీమ్ అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజుల సమయం ఉండటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం (నవంబర్ 5) సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో పుష్పరాజ్ (అల్లు అర్జున్), భన్వర్‌సింగ్ షెకావత్ (ఫహద్ ఫాజిల్) ఎదురెదురుగా నిలబడి ఉన్నారు. అంతేకాదు, త్వరలోనే ట్రైలర్‌ను (pushpa 2 trailer) కూడా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.
గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్!
‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు’ అంటూ వచ్చిన పుష్ప ట్రైలర్ అప్పట్లో ఎంత ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతకుమించిన స్థాయిలో ట్రైలర్ కట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో వారం, పది రోజుల్లోనే ట్రైలర్‌ను తీసుకొచ్చేలా కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన పాట్నా, కొచ్చి, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లో ఓకేసారి ట్రైలర్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈనెల 15న ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. సినిమా విడుదలకు కనీసం రెండు వారాల ముందు ట్రైలర్ విడుదల చేస్తే ప్రేక్షకుల్లో మరింత హైప్‌ను క్రియేట్ చేయోచ్చని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది.
పాప్‌కార్న్ డబ్బాలతో ప్రమోషన్స్
‘పుష్ప2’ విడుదలకు సరిగ్గా 30 రోజులు మాత్రమే ఉండటంతో అటు విదేశాల్లోనూ ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా అమెరికాలోని థియేటర్స్‌లో వినూత్న ప్రచారాన్ని మొదలు పెట్టారు. పుష్ప బ్రాండ్ పాప్‌కార్న్ టబ్స్, కూల్ డ్రింక్ బాటిల్స్‌ను యూఎస్‌లోని అన్ని థియేటర్స్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నవంబరు 13న విడుదలయ్యే ‘కంగువా’ ప్రీమియర్స్‌తో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకూ ఏ ఇండియన్ సినిమా ఇలాంటి ప్రత్యేక ప్రమోషన్ చేయలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పుష్ప 2 టీమ్ వీటికి సంబంధించిన ఫొటోలను ఎక్స్‌లో పంచుకోవడం విశేషం.
ఈనెల 6 నుంచి ఐటెం సాంగ్ షూట్!
‘పుష్ప’ మూవీ పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ అనే ఐటెం సాంగ్ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్ చేసింది. బన్నీ-సామ్ కలిసి వేసిన స్టెప్స్ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్ల పేర్లు బయటకు రాగా ఫైనల్‌గా యంగ్ బ్యూటీ శ్రీలీలను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 6 నుంచి సాంగ్ షూట్ కూడా మెుదలు కానున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే శ్రీలీల డ్యాన్స్‌కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. గుంటూరుకారం సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేసిన ఐటెం సాంగ్ ఎంత ప్రజాదారణ పొందిందో అందరికి తెలిసిందే. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన బన్నీ, ఈ కుర్ర హీరోయిన్‌తో ఏ స్థాయిలో స్టెప్పులు ఇరగదీస్తాడోనని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు.
‘పుష్ప 3’ పక్కా
‘పుష్ప 2’కి కొనసాగింపుగా మూడో పార్ట్ కూడా ఉంటుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ సైతం మూడో పార్ట్ గురించి పలుమార్లు హింట్స్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత రవి శంకర్ ‘పుష్ప 3’ కచ్చితంగా ఉంటుందని అధికారిక ప్రకటన చేశారు. పార్ట్ 3 కి సంబంధించి సాలిడ్ లీడ్ తమకు దొరికిందని, కాబట్టి కచ్చితంగా ‘పుష్ప 3’ ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. అయితే పార్ట్ 3ని ఎప్పుడు పట్టాలెక్కిస్తారన్న అంశంపై మాత్రం నిర్మాత రవిశంకర్ స్పష్టమైన కామెంట్స్ చేయలేదు. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్‌తో కలిసి బన్నీ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నాడు. అటు సుకుమార్ సైతం రామ్‌చరణ్‌తో సినిమాను అనౌన్స్ చేశారు. ఆ ప్రాజెక్ట్‌లు పూర్తైన తర్వాత ‘పుష్ప 3’ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!