• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pushpa 2: ‘పుష్ప 2’ పాన్ ఇండియా ప్రమోషన్స్‌లో సరికొత్త ట్రెండ్‌.. రంగంలోకి స్టార్‌ క్రికెటర్లు!

    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2)పై దేశవ్యాప్తంగా బజ్‌ ఉంది. డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ‘పుష్ప 2’ సంబంధించి రోజుకో అప్‌డేట్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. మూవీ ప్రమోషన్ ఈవెంట్స్‌ ప్లాన్ లీక్ అంటూ కొన్ని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో జరిగే ‘పుష్ప 2’ ఈవెంట్స్‌కు స్టార్‌ క్రికెటర్లు హాజరవుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్లేయర్లు, వారు పాల్గొనే ఈవెంట్‌ వేదికలు సైతం ఫిక్సయ్యాయని అంటున్నారు. 

    ప్రమోషన్స్‌కు టీమిండియా!

    ‘పుష్ప 2’ (Pushpa 2) రిలీజ్‌కు నెల రోజులు కూడా లేకపోవడంతో ప్రమోషన్స్‌పై చిత్ర బృందం ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. నార్త్‌ ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈవెంట్స్‌ను ప్లాన్‌ చేస్తున్నారట. పాట్నాలో జరిగే ఈవెంట్‌లో ట్రైలర్‌ లాంచ్ చేయాలని రూట్‌ మ్యాప్‌ను సైతం సిద్ధం చేసినట్లు సమాచారం. అంతేకాదు నార్త్‌ ఇండియాలో జరిగే ఈవెంట్స్‌కు టీమిండియా స్టార్‌ క్రికెటర్స్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, రింకు సింగ్‌, అర్షదీప్‌ సింగ్‌ సహా పలువురు క్రికెటర్స్‌ను ఆహ్వానించనున్నట్లు సమాచారం. దీనిపై నెక్స్ట్‌వీక్‌లో అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు చెబుతున్నారు. ఇదే నిజమైతే ‘పుష్ప 2’ కొత్త ట్రెండ్‌ను సృష్టించనున్నాయి. ఇప్పటివరకూ మూవీ ప్రమోషన్స్‌లో క్రికెటర్లు పాల్గొన్న సందర్భాలు లేవు. ‘పుష్ప 2’ ప్రమోషన్స్‌లో వారు గనుక భాగం అయితే ఇండియన్‌ మూవీ హిస్టరీలో ఇదొక కొత్త అధ్యాయం కానుంది. 

    వేదికను బట్టి ఆహ్వానం!

    నార్త్‌ ఇండియాలో వివిధ రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ ప్రమోషన్స్ జరగనున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్‌ అప్‌డేట్‌ ప్రకారం పంజాబ్‌లో జరిగే ఈవెంట్‌కు శిఖర్ ధావన్, గుజరాత్‌లోని గాంధీనగర్‌ ఈవెంట్‌కు హార్దిక్ పాండ్యా, ముంబయి ఈవెంట్‌కు అజింక్య రహానేను వస్తారని అంటున్నారు. అలాగే అమెరికాలోనూ ఓ ఈవెంట్‌ను పుష్ప టీమ్ ప్లాన్‌ చేస్తోందట. దానికి గెస్ట్‌గా వెస్టిండిస్‌ ప్లేయర్ క్రిస్‌గేల్‌ను ఆహ్వానించాలని అనుకుంటోందట. ఇక ఆస్ట్రేలియాలో జరిగే ఈవెంట్‌కు మ్యాక్స్‌వెల్‌, డేవిడ్‌ వార్నర్‌ వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇలా వివిధ ప్రాంతాల్లో జరిగే ఈవెంట్స్‌లో ఈ స్టార్ క్రికెటర్లు సందడి చేస్తారని నెట్టింట విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవమెంతో తెలీదు గానీ బన్నీ ఫ్యాన్స్ మాత్రం తెగ ఖుషీ అవుతున్నారు. 

    ట్రైలర్ అప్‌డేట్‌!

    ‘పుష్ప 2’ ట్రైలర్‌ను నవంబర్‌ 15న రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ట్రైలర్‌ కట్‌ 3 నిమిషాల 45 సెకన్లు ఉన్నట్లు లేటెస్ట్‌గా సమాచారం అందుతోంది. గూస్‌బంప్స్‌ వచ్చేలా ట్రైలర్‌ను కట్‌చేస్తున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కసారి ట్రైలర్ రిలీజైతే సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరడం పక్కా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సినిమా విడుదలకు కనీసం రెండు వారాల ముందు ట్రైలర్‌ విడుదల చేస్తే ప్రేక్షకుల్లో మరింత హైప్‌ను క్రియేట్‌ చేయోచ్చని మేకర్స్‌ భావిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే పుష్ప ట్రైలర్‌ ఎంత పెద్ద సక్సెస్‌ ‌అయ్యిందో అందరికీ తెలిసిందే. ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైరు’ అంటూ వచ్చిన పార్ట్‌ 1 ట్రైలర్‌ అప్పట్లో ట్రెండ్‌ క్రియేట్‌ చేసింది. పార్ట్‌ 2 ట్రైలర్‌ కూడా ఆ స్థాయిలోనే ఉండాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. 

    ‘పుష్ప 2’ టీమ్‌లోకి థమన్‌!

    ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రానికి స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad) సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. తొలి పార్ట్‌కు అతడు ఇచ్చిన మ్యూజిక్‌ నేషనల్‌ వైడ్‌గా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అంతేకాదు ‘పుష్ప 2’కు సంబంధించి ఇటీవల రిలీజైన రెండు పాటలు సైతం యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అటువంటి దేవిశ్రీని పుష్ప టీమ్‌ పక్కన పెట్టినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం దేవిశ్రీని కాదని థమన్‌కు ఈ సినిమా నేపథ్య సంగీతం బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అలాగే కాంతార ఫేమ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్ అజనీష్‌ లోక్‌నాథ్‌ను కూడా పుష్ప 2 కోసం సంప్రదించినట్లు సమాచారం. తొలి పార్ట్‌కు థమన్‌, సెకండాఫ్‌కు అజనీష్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇస్తారని అంటున్నారు. దేవిశ్రీ ఇచ్చిన బీజీఎం సరిగా లేకపోవడం, మూవీ విడుదలకు తక్కువ సమయమే ఉండటంతో సుకుమార్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

     

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv