నేడు ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ ఫీవర్ పట్టుకుంది. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఉదయం హైదరాబాద్ భ్రమరాంభ థియేటర్‌లో రామ్ చరణ్, రాజమౌళి కుటుంబసభ్యులతో కలిసి మూవీ చూశారు. చరణ్, ఉపాసనతో పాటు ఫ్రెండ్స్‌తో కలిసి సినిమా చూశాడు..రాజమౌళి ఫ్యామిలీ, కీరవాణి ఫ్యామిలీ అందరూ చిత్రాన్ని వీక్షించారు.
ఈ సందర్భంగా థియేటర్ వద్ద ఫ్యాన్స్‌ను నియంత్రించడం సెక్యూరిటీ వల్ల కాలేదు. ఒక్కసారిగా అందరూ దూసుకొచ్చారు. ఏ థియేటర్ వద్ద చూసినా చరణ్, తారక్ అభిమానుల కోలాహలం కనిపిస్తుంది. భారీ కటౌట్లతో పాలాభిషేకాలు చేస్తున్నారు. థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తున్నారు. మరోవైపు ఎన్‌టీఆర్ ఏఎంబీ సినిమాస్‌లో ఫ్యామిలీతో కలిసి ప్రత్యేక షో చూశాడు. ప్రపంచ వ్యాప్తంగా సినిమాకు మంచి టాక్ వస్తుంది. ఇప్పటికే యూఎస్‌లో 3 మిలియన్ డాలర్లు వసూలైనట్లు తెలుస్తుంది. అక్కడ మార్చి 24 నుంచి ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం