• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Rama Banam Review: రామబాణం గురి కుదిరిందా? ఫ్యామిలీ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అయింది?

    నటీనటులు: గోపిచంద్‌, డింపుల్‌ హయాతి, ఖుష్బు, నాజర్‌, వెన్నెల కిషోర్, అలీ, సప్తగిరి, సత్య, గెటప్‌ శ్రీను

    దర్శకత్వం: శ్రీవాస్‌

    సంగీతం: మిక్కి జే. మేయర్

    సినిమాటోగ్రఫీ: వెట్రి పళని స్వామి

    నిర్మాతలు: T.G విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల

    గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో రామబాణం చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే గోపిచంద్‌, శ్రీవాస్‌ కాంబోలో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు మంచి హిట్‌ సాధించడంతో ఈ రామబాణంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఈ సినిమాలో జగపతిబాబు, ఖుష్బూ, నాజర్‌ వంటి దిగ్గజ నటులతో పాటు, అలీ, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, గెటప్‌ శ్రీను వంటి కామెడీ స్టార్లు నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇందుకు తగ్గట్లే మేకర్స్‌ రిలీజ్‌ చేసిన పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో రామబాణం చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో గోపిచంద్‌ హిట్‌ కొట్టినట్టేనా? డైరెక్టర్‌ శ్రీవాస్‌తో హ్యాట్రిక్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడా?. పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. 

    కథేంటి:

    విలువలు, నియమాలతో కూడుకున్న అందమైన ఉమ్మడి కుటుంబం. ఆ కుటుంబంపై కార్పొరేట్ మాఫియా కన్నుపడుతుంది. వారిని ఇబ్బందులకు గురిచేస్తుంది. తన పవర్‌ ఉపయోగించుకొని కష్టాలు పెడుతుంది. ఆ ఫ్యామిలీలో ఒకడైన హీరో (గోపిచంద్‌) శత్రువుల నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు. ఆ సమయంలో ఆ హీరో ఎదుర్కొనే అడ్డంకులు, చివరికి వారిని ఎలా కాపాడుతాడు అనేది అసలు కథ. ‌హీరో కుటుంబానికి కార్పోరేట్‌ మాఫియాకు వైరం ఎందుకు వస్తుంది?. జగపతి బాబు, గోపిచంద్‌కు ఉన్న రిలేషన్ ఏంటీ? తెలియాలంటే రామబాణం చూడాల్సిందే.

    ఎవరేలా చేశారంటే:

    ఎప్పటిలాగే రామబాణంలో కూడా గోపిచంద్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో కూడా తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. కామెడీ, యాక్షన్‌, డ్యాన్స్‌ ఇలా అన్ని కోణాల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాల్లో గోపిచంద్‌ నటన సినిమాకే హైలెట్‌ అని చెప్పొచ్చు. అటు హీరోయిన్‌ డింపుల్‌ హయతి ఎంతో గ్లామర్‌గా కనిపించింది. జగపతి బాబు పాత్ర కూడా సినిమాకు చాలా కీలకం. ఆ పాత్రను తన ‌అద్బుతమైన నటనతో జగపతిబాబు నిలబెట్టాడు. ఇక సప్తగిరి, వెన్నెల కిషోర్‌, అలీ, గెటప్‌ శ్రీను, సత్య కామెడీ బాగుంది. 

    సాంకేతికంగా:

    టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ శ్రీవాసు ఈ సినిమాకు మంచి కథే తీసుకున్నప్పటికీ..  సినిమా స్టార్టింగ్ నుంచి ఎక్కడో చూసిన కథలా సినిమా అనిపిస్తుంది.  రామబాణం  ఫ్యామిలీ కథ అయినప్పటికీ కొత్తనం లేకపోవడం మైనస్. రోటీన్‌గా ముందుకు సాగుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఫస్టాఫ్ సీన్లు డీసెంట్‌గా ఉన్నప్పటికీ… సెకండాఫ్‌లో స్టోరీ నెమ్మదించింది.  అయితే  కామెడీ, యాక్షన్‌ డ్రామాలతో ప్రేక్షకులకు బోర్‌ కొట్టకుండా డైరెక్టర్‌ చేశాడు. సెంటిమెంట్‌ సీన్లు బాగా పండాయి. ఇక మిక్కీ జే. మేయర్‌ అందించిన  BGM యాక్షన్‌  సీన్లను బాగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. మిగిలిన టెక్నికల్ విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.

    ప్లస్‌ పాయింట్స్‌

    • గోపీచంద్ నటన
    • యాక్షన్, కామెడీ సీన్స్
    • నేపథ్య సంగీతం

    మైనస్ పాయింట్స్‌

    • రొటిన్‌ స్టోరీ
    • సాగదీత సీన్స్
    • సెకండాఫ్‌లో బోరింగ్ సీన్స్

    రేటింగ్‌: 2.75/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv