రియల్ మీ 11 ప్రో 5G(Realme 11 Pro Series) సిరీస్ ఫోన్లు భారత మార్కెట్లలో విడుదలయ్యాయి. గత నెలలో చైనాలో ఈ మొబైల్ తొలుత లాంఛ్ అయింది. రియల్ మీ 11 ప్రో 5G, రియల్ మీ ప్రో ప్లస్ 5G మోడళ్లు ఇందులో ఉన్నాయి. వివిధ రంగుల్లో ఈ ఫోన్లు లభిస్తున్నాయి. జూన్ 16 నుంచి మార్కెట్లలో విడుదల కానున్నాయి. ఆసక్తి కలిగిన వారు అమెజాన్, రియల్‌మీ వెబ్‌సైట్ల నుంచి ఫోన్‌ని ఆర్డర్ చేసుకోవచ్చు. మరి, ఈ మోడళ్ల ఫీచర్లేంటో చూసేద్దామా.
డిస్‌ప్లే
6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ(1,080*2,412 పిక్సెల్స్) డిస్‌ప్లేని కలిగి ఉన్నాయి. 360 Hz టచ్ సాంప్లింగ్ రేట్‌తో వస్తున్నాయి.
స్టోరేజీ
రియల్ మీ ప్రో మూడు స్టోరేజీ వేరియంట్లలో లభిస్తోంది. బేస్ వేరియంట్ 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తోంది. దీంతో పాటు 8GB RAM + 256GB, 12GB + 256GB వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రో ప్లస్ మోడల్ రెండు స్టోరేజీ వేరియంట్లలో లభిస్తోంది. 8GB + 256GBతో బేస్ వేరియంట్, 12GB + 256GB హై ఎండ్ మోడల్ వస్తోంది.
కెమెరా
కెమెరా పరంగా రియల్ మీ 11 ప్రో 5G సిరీస్ మోడళ్లు ఎక్సలెంట్‌గా ఉన్నాయి. 11 ప్రో 5G బేస్ వేరియంట్‌లో డ్యుయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫెసిలిటీతో 100 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ని కలిగి ఉంది. 2మెగా పిక్సెల్ క్లారిటీతో రెండో కెమెరా ఉంది. ఇక సెల్పీ కెమెరా 16 మెగాపిక్సెల్ క్లారిటీతో రానుంది.
11 ప్రో ప్లస్ 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్(200MP+8MP+2MP) ఉంది. 200 మెగాపిక్సెల్ గల సామ్‌సంగ్ హెచ్‌పీ3 ప్రైమరీ సెన్సార్, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్‌తో మాక్రో సెన్సార్ వస్తోంది. 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
బ్యాటరీ
11 ప్రో, 11 ప్రో ప్లస్ మోడళ్లలో ఒకే సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంది. 5,000mAh కెపాసిటీతో బ్యాటరీ వస్తోంది. దీంతో పాటు 11 ప్రో 5G మోడల్ ఫోన్లకు 67వాట్స్ సూపర్వాక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 11 ప్రో ప్లస్ 5G ఫోన్లకు 100వాట్స్ సూపర్వాక్ ఫాస్ట్ ఛార్జర్ వస్తోంది.
కలర్స్
రెండు మోడళ్లు మూడు రంగుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఆస్ట్రల్ గ్లాస్, ఓయాసిస్ బీగ్, సన్‌రైజ్ బీగ్ రంగుల్లో ఫోన్లు తయారయ్యాయి.
సిస్టం
మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీఎస్ చిప్‌సెట్‌తో 6nm ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో రియల్ మీ ప్రో రెండు మోడళ్లు డిజైన్ అయ్యాయి. Mali-G68 GPUతో జత కూడి వస్తోంది.
ధర
రియల్ మీ 11 ప్రో 5G మోడల్‌లోని 8GB + 128GB వేరియంట్ ధర రూ. 23,999గా ఉంది. 8GB + 256GB వేరియంట్ ధర రూ.24,999, 12GB + 256GB ధర 27,999గా వస్తోంది.
రియల్ మీ 11 ప్రో ప్లస్ 5G మోడల్‌లో బేస్ వేరియంట్ అయిన 8GB + 256GB ఫోన్ ధర రూ.27,999గా ఉంది. మరోవైపు. హై ఎండ్ ఫోన్ 12GB + 256GB ధర రూ.29,999గా వస్తోంది.
కొనుగోలు ఇలా..
అమెజాన్, రియల్ మీ వెబ్‌సైట్లు, ఎంపిక చేసిన స్టోర్ల నుంచి రియల్ మీ 11 ప్రో 5జీ సిరీస్ మోడళ్లను కొనుగోలు చేయవచ్చు. జూన్ 15 నుంచి రియల్ మీ ప్రో ప్లస్ అందుబాటులోకి రానున్నాయి. జూన్ 16న రియల్ మీ ప్రో మోడళ్లు మార్కెట్లో ఉంటాయి. నేడు(జూన్ 8) బుక్ చేసుకున్న వారికి రూ.2 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!