iPhone 14 Pro, Pro Max వంటి హై ఎండ్ ఫోన్లలో యాపిల్ తీసుకొచ్చిన ‘డైనమిక్ ఐల్యాండ్’ (Dynamic Island) ఫీచర్‌తో వచ్చిన Realme C55 ఇండోనేసియాలో విడుదలైనపుడే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఫోన్ డిస్‌ప్లే భాగంలో చిన్న క్యాప్సూల్ తరహాలో ఉండే ఈ డిజైన్ నోటిఫికేషన్లను చాలా అందంగా చూపెడుతుంది. ఇండియాలో మాత్రం ఈ ఫోన్‌పై ఆసక్తి పెరగడానికి మరో కారణం దాని ధర. కేవలం రూ.10,999కే ప్రారంభమయ్యే ఈ ఫోన్‌పై జనంలో ఆసక్తి పెరగడంలో తప్పు లేదు. మరి ఆ ధరలో ఉన్న ఇతర ఫోన్ల కంటే Realme C55 మెరుగ్గా ఉందా? అంచనాలను అందుకోగలిగిందా? రివ్యూలో చూద్దాం.
స్పెసిఫికేషన్లు
నెట్‌వర్క్ | GSM/HSPA/LTE( 5జీ లేదు) |
బాడీ | డైమెన్షన్స్ : 165.6 x 75.9 x 7.9 mmబరువు : 189.5 gమెటీరియల్ : ప్లాస్టిక్ ఫ్రేమ్, గ్లాస్ ఫ్రంట్‌సిమ్ : డ్యూయల్ సిిమ్( నానో) |
డిస్‌ప్లే | 6.72 ఇంచులు, IPS LCD, 90Hz రిఫ్రెష్ రేట్, 680 nits బ్రైట్‌నెస్, 1080 x 2400 pixels రిజల్యూషన్ |
సాఫ్ట్‌వేర్ | Mediatek Helio G88 చిప్‌సెట్, Android 13, Realme UI 4.0 ఇంటర్‌ఫేస్ |
బ్యాటరీ | 5000 mAh |
మెమోరీ | 64GB+4GB RAM, 64GB+6GB RAM, 128GB+8GB RAM, |
కెమెరా | బ్యాక్ కెమెరా: 64MP+2MPసెల్ఫీ కెమెరా: 8MP |
డిజైన్
డిజైన్ పరంగా ఫోన్ చాలా బాగుంది. డ్యూయల్ టోన్ కలర్ ఫినిష్ ఆకర్షణీయంగా అనిపిస్తుంది. మూలలు, సైడ్ డిజైన్ యాపిల్ లాగా అనిపిస్తుంది. కెమెరాలు కూడా చూడటానికి స్టైలిష్‌గా కనిపిస్తాయి. ఈ బడ్జెట్‌లో ఫోన్ స్టైలిష్‌గానే ఉందని చెప్పాలి.
కెమెరా
64+2MP బ్యాక్ కెమెరా పనితీరు పరవాలేదు. బ్యాక్ కెమెరా వెలుతురులో బాగానే పనిచేస్తోంది. రాత్రి వేళల్లో కాస్త నాయిస్ ఎక్కువగా వస్తోంది. క్లోస్ షాట్స్ చాలా బాగా వస్తున్నాయి. కానీ కాస్త లాంగ్ షాట్స్ తీసినపుడు నాయిస్ ఉంటోంది. సెల్ఫీ కెమెరా కూడా బాగానే ఉంది. కాకపోతే పోట్రెయిట్ ఫోటోస్ తీస్తున్నపుడు అంతగా ఎడ్జెస్‌ను అంత కచ్చితత్వంతో గుర్తించడం లేదు. ఈ బడ్జెట్‌లో కెమెరా పనితీరు ఓకే అని చెప్పొచ్చు కానీ ఇదే బడ్జెట్‌లో Poco,IQoo లో ఉన్న ఫోన్లు కెమెరా పరంగా కాస్త మెరుగ్గా ఉన్నాయి. వీడియోలు ఓకే. ఇమేజ్ స్టబిలైజేషన్ లేదు కాబట్టి షేక్ అవుతూ వస్తాయి.
డిస్‌ప్లే
6.72 ఇంచుల ఫుల్ HD డిస్‌ప్లే చాలా బాగుంది. కంటెంట్ చూడడానికి చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. బయటికి వెళ్లినపుడు ఎండలో కూడా కంటెంట్ చక్కగా చూడొచ్చు.
పనితీరు
Realme C55 పెర్ఫార్మెన్స్ అయితే అంతగా ఆకట్టుకోలేదు. 3-4 యాప్‌లు ఓపెన్ అయి ఉన్నాయంటే లాగ్ అవుతుంది. ఒక యాప్ నుంచి ఇంకో యాప్‌కు స్విచ్ అవుతున్నపుడు కూడా ఫోన్ ఇబ్బంది పడుతోంది. ఈ బడ్జెట్ ఫోన్‌లో గేమింగ్ ఆశించడం అంత కరెక్ట్ కాదు. అలాగే ఈ ఫోన్ గేమింగ్ విషయంలో చాలా వెనకబడి ఉందనే చెప్పాలి. భారీ గేమ్స్ ఇందులో ఆడాలనుకుంటే మాత్రం అస్సలు కుదరదు.
బ్యాటరీ
5,000mAh బ్యాటరీ ఉన్నా యావరేజ్ యూజర్‌కు ఈ ఫోన్ నుంచి ఒక రోజుకు మించి చార్జింగ్ ఉండదు. చార్జింగ్ టైం పరంగా ఓకే అని చెప్పొచ్చు. 33W ఫాస్ట్ చార్జర్‌తో దాదాపు ఒక గంటలో బ్యాటరీ సున్నా నుంచి 100కు చార్జ్ అవుతుంది.
చివరిగా..
ఈ బడ్జెట్‌లో డిజైన్ పరంగా ఈ ఫోన్ చాలా బాగుంది. అయితే కెమెరాల పనితీరు యావరేజ్. అలాగే పెర్ఫార్మెన్స్ కూడా సాధారణం. 5G లేకపోవడం మరో పెద్ద మైనస్. బ్యాటరీ అంచనాలను అందుకోలేకపోయినా చార్జింగ్ స్పీడ్ బాగుంది.
ధర
64GB+4GB RAM వేరియంట్ రూ.10,999
64GB+6GB RAM వేరియంట్ రూ.11,999
128GB+8GB RAM వేరియంట్ రూ.13,999
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..