టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్‌కు స్టార్ హీరోయిన్ సమంత బర్త్‌డే విషెస్ చెప్పింది. ‘‘హ్యాపీ బర్త్‌డే అఖిల్. ఏజెంట్ మూవీ 28న రాబోతోంది. చూస్తుంటే ఫైర్‌లా ఉంది. లాట్స్ ఆఫ్ లవ్.’’ అంటూ హార్ట్ ఎమోజీని జత చేస్తూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సామ్ షేర్ చేసిన పోస్ట్‌కు అఖిల్ రిప్లై ఇస్తాడా.. ఇవ్వడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కాగా అక్కినేని నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకున్నా.. అక్కినేని కుటీంబీకులతో మంచి రిలేషన్ కొనసాగిస్తోంది.
రిప్లే ఇచ్చిన అఖిల్
గతేడాది అఖిల్ బర్త్‌డే రోజున సామ్ స్పెషల్ పోస్ట్ చేస్తూ విషెస్ చెప్పినా అఖిల్ మాత్రం రిప్లే ఇవ్వలేదు. దీంతో ఈసారైనా అఖిల్ సమంతకు రిప్లై ఇస్తాడా అని చాలామంది నెటిజన్లు ఎదురుచూశారు. గతేడాది లాగే ఈసారి కూడా అఖిల్ సమాధానం ఇవ్వడని కామెంట్ చేశారు.
కానీ వాళ్లందరికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు అఖిల్. సమంతకు థ్యాంక్స్ చెబుతూ ఇన్‌స్టాలో షేర్ చేసుకున్నాడు. ‘థ్యాంక్యూ సో మచ్ సామ్.. నీ అంచనాలను అందుకుంటానని అనుకుంటున్నా’ అంటూ హార్ట్ ఎమోజీని జతచేశాడు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!