స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నటించిన మోస్ట్ వాంటెడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ (Citadel: Honey Bunny) తాజాగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ నటించినప్పటికీ ఈ అమ్మడి పేరే ప్రధానంగా నెట్టింట వినిపిస్తోంది. ఆమె నటన, యాక్షన్స్ సీక్వెన్స్‌లో విరోచిత పోరాటం ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. క్రేజ్ పరంగా సామ్ మరో మెట్టు ఎక్కేసిందంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌లో సామ్ పలు లిప్‌లాక్ సీన్స్‌లో నటించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట ఒక్కసారిగా వైరల్‌గా మారాయి. #SamanthaRuthPrabhu హ్యాష్‌ట్యాగ్‌తో వాటిని ట్రెండింగ్ చేస్తున్నారు.
ఘాటు లిప్‌లాక్ సీన్స్
స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్‌సిరీస్‌లో నటి సమంత (Samantha) యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు రొమాంటిక్‌గాను ఓటీటీ ప్రేక్షకులను అలరించింది. ఘాటు ముద్దు సీన్లలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో ‘ఫ్యామిలీ మ్యాన్’ (Family Man) సిరీస్‌లో ఓ ఇంటిమేట్ సీన్‌లో నటించి సమంత అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. ఇప్పుడు ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్‌లోనూ ఆ స్థాయిలోనే ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. హీరో వరుణ్ ధావన్‌తో కలిసి సామ్ లిప్‌లాక్ సీన్స్‌లో నటించింది. వీరిద్దరి మధ్య రెండు ఘాటైన ముద్దు సీన్లు ఉన్నాయి. అంతేకాకుండా సామ్ వేసుకున్న డ్రెస్ బటన్స్‌ను వరుణ్ ధావన్ సడెన్‌గా విప్పుతాడు. అలాగే ఓ సీన్‌లో బ్రాలో కనిపించి సామ్ సర్‌ప్రైజ్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
నెటిజన్ల భిన్నభిపాయాలు
గతంలో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో చేసిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌లోనూ సమంత (Samantha) ఓ హాట్ సీన్ చేసింది. దానికి సంబంధించిన వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. దాని కారణంగానే అప్పట్లో అక్కినేని నాగ చైతన్య, సమంత మధ్య విభేదాలు వచ్చాయని రూమర్లు వచ్చాయి. అది విడాకుల వరకూ దారితీసిందని ప్రచారం జరిగింది. ఇప్పుడు మరోమారు సామ్ ఆ తరహా ఘాటు సీన్స్‌లో నటించడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సామ్ ఇలాంటి ముద్దు సీన్లలో నటిస్తూ పోతే తనను ఇష్టపడే ఫ్యామిలీ ఆడియన్స్ దూరమవుతారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు నెటిజన్లు సమంతకు గట్టిగా మద్దతు తెలుపుతున్నారు. ఎవరి ఇష్టం వాళ్లదని గట్టి కౌంటర్ ఇస్తున్నారు.
ఆ క్యూట్ సమంత మిస్సింగ్!
ఒకప్పుడు సమంత (Samantha) అనగానే పక్కింటి అమ్మాయిలా, సూపర్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో చేసిన ట్రెడిషనల్ పాత్రలే గుర్తుకు వచ్చేవి. అయితే ఈ మధ్య కాలంలో ఆ సామ్ నుంచి ఆ తరహా ప్రదర్శన కనిపించడం లేదు. తన ఫస్ట్ ఫిల్మ్ ‘ఏ మాయ చేశావే’ సినిమాలో చేసిన జెస్సీ పాత్ర ఎప్పటికీ ఫ్యాన్స్‌కు ఎవర్‌గ్రీన్ అనిచెప్పవచ్చు. అలాగే పలు చిత్రాల్లో సామ్ చేసిన అల్లరి, ఆకతాయి తనం రీసెంట్ చిత్రాలు, సిరీస్‌లలో అస్సలు కనిపించడం లేదు. దీనికితోడు గత కొంతకాలంగా లిప్‌లాక్, ఇంటిమేట్ సీన్స్‌లో సామ్ నటిస్తుండటంతో ఒకప్పటి సమంతను మిస్సైన ఫీలింగ్ కలుగుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తిరిగి ఓ క్యూట్ లవ్‌స్టోరీతో తమ ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రానాకు సామ్ వార్నింగ్!
ఇటీవల ‘ఐఫా ఉత్సవం – 2024’ (IIFA Utsavam 2024) గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. నటి సమంత (Samantha) ‘ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును సైతం అందుకుంది. ఈ సందర్భంగా సమంత మాట్లాడగా హోస్ట్‌గా చేసిన రానా, తేజ సజ్జ ఆమెపై కొన్ని జోక్స్ వేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రానా-సమంత మధ్య ఓ ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘సమంత టాలీవుడ్ నుంచి ఇప్పుడు హాలీవుడ్ వరకు వెళ్లింది. ఒకప్పుడు నాకు మరదలుగా ఉన్న ఆమె చెల్లి వరకూ వెళ్లింది’ అని రానా అంటాడు. దానికి సామ్ గట్టిగా నవ్వి సెల్ఫ్ ట్రోలింగ్ కూడా చేస్తున్నావా అంటూ స్పందించింది. జోక్స్ వద్దు అంటూ రానాకు స్వీట్ వార్నింగ్ సైతం ఇచ్చింది. ఇదిలా ఉంటే సమంత మాజీ భర్త నాగచైతన్య రానాకు మేనత్త కొడుకు అవుతాడు. ఈ నేపథ్యంలోనే రానా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ