అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), స్టార్ హీరోయిన్ సమంత (Samantha) 2017లో పెళ్లి చేసుకొని మనస్పర్థల కారణంగా 2021లో విడిపోయిన సంగతి తెలిసిందే. మూడేళ్ల గ్యాప్ తర్వాత నటి శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala)ను రెండో వివాహం చేసుకునేందుకు నాగచైతన్య రెడీ అయ్యాడు. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ఘటనలతో పాటు ప్రస్తుత పరిణామాలను ముడివేస్తూ నటి సమంత పట్ల నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. దిగ్గజ నటి సావిత్రి జీవితంతో సామ్ లైఫ్‌ను ముడిపెడుతూ పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఆ పోస్టులలోని సారాంశం ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సావిత్రి జీవితంతో సామ్‌కు లింకేంటి?
2021లో నాగ చైతన్యతో డివోర్స్ సందర్భంగా అందరూ సమంతనే ఎక్కువగా టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే తాజాగా చైతూ రెండో పెళ్లికి సిద్ధమైన నేపథ్యంలో పెద్ద ఎత్తున నెటిజన్లు సమంతపై సానుభూతి చూపిస్తున్నారు. దిగ్గజ నటిగా ఓ వెలుగు వెలిగిన మహా నటి సావిత్రి జీవితంతో సమంత లైఫ్‌ను కంపేర్ చేస్తున్నారు. సినిమా కెరీర్లో ఉన్నత స్థితిలో ఉన్న సమయంలో సావిత్రి జీవితంలోకి అప్పటికే పెళ్లైన నటుడు జెమినీ గణేశన్ ప్రవేశించారు. ఆ సమయానికి సావిత్రితో పోలిస్తే జెమినీ గణేశన్ సినిమా జీవితం అంతంతమాత్రంగానే ఉంది. ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్న జెమినీ గణేశన్‌ను గెస్ట్ హౌస్‌లో మరో మహిళతో సన్నిహితంగా ఉండటం చూసి సావిత్రి తట్టుకోలేకపోయింది. డిప్రెషన్లోకి వెళ్లి మద్యానికి బానిసగా మారింది. ఆపై పలు అనారోగ్య సమస్యల బారిన పడి కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించింది. అయితే సమంత విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగి ఉండొచ్చని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. నాగ చైతన్యను మరొకరితో చూసి సమంత డిప్రెషన్లోకి వెళ్లి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయని అంటున్నారు. ఈ బాధలన్నీ తట్టుకోలేకనే చైతూకి సామ్ విడాకులు ఇచ్చిందని నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
‘అంతలా శోభితలో ఏముంది’
శోభిత ధూళిపాళతో ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పటి నుంచి సమంత ఫ్యాన్స్ నాగచైతన్యను ఏకిపారేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు శోభితాలో ఏముందని ప్రశ్నిస్తున్నారు. హీరోయిన్గా ఆమె ఫెయిల్ అయ్యిందని అంటున్నారు. విడాకులు తీసుకున్న వెంటనే చైతూ మరొకరితో ప్రేయాయణం మెుదలుపెట్టారని విమర్శిస్తున్నారు. దీన్ని బట్టి చై-సమంతలతో ఎవరి ప్రేమ స్వచ్ఛమైందో గుర్తించాలని సూచిస్తున్నారు. మరోవైపు సమంత ఫ్యాన్స్ సంధిస్తున్న ప్రశ్నలకు చైతు, శోభిత ఫ్యాన్స్ గట్టిగానే బదులు ఇస్తున్నారు. పెళ్లి పెటాకులు అయినంత మాత్రాన జీవితాలు అక్కడే ఆగిపోవాలా? అంటూ నిలదీస్తున్నారు.
సామ్ చేస్తే తప్పు.. శోభిత చేస్తే ఒప్పా!
సమంత బోల్డ్‌గా నటించడమే విడాకులకు కారణమని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్న శోభిత స్క్రీన్ ప్రజెన్స్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమంత కంటే ఎక్కువగా బోల్డ్ సీన్స్‌లో శోభిత నటించిందని కొందరు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ‘మేడ్ ఇన్ హెవెన్’ అనే బోల్డ్ వెబ్ సిరీస్‌లో హాట్ షోతో శోభితా ధూళిపాళ్ల రెచ్చిపోయిందని చెబుతున్నారు. అందులో ఇంటిమేట్ సీన్లలో శోభిత నటించిందని పేర్కొంటున్నారు. అలాగే ‘ది నైట్ మేనెజర్’ వెబ్ సిరీస్‌లో కూడా బికినీతోపాటు ఘాటు శృంగార సీన్లలో శోభిత యాక్ట్ చేసింది. ఇటీవల రిలీజైన ‘ది మంకీ మ్యాన్’ సినిమాలో సైతం శోభితా హాట్ షో చేసింది. ఎక్స్పోజింగ్, బోల్డ్ సీన్స్ కారణంగా సమంతకు డివోర్స్ ఇచ్చిన నాగ చైతన్య ఆెమె కంటే బోల్డ్ హీరోయిన్ అయిన శోభితాను ఎలా పెళ్లి చేసుకోబోతున్నారు? అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
శోభితా గురించి ఈ విషయాలు తెలుసా!
శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో జన్మించింది. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచింది. బాలీవుడ్లో 2016లో విడుదలైన రామన్ రాఘవన్ 2.0 చిత్రం ద్వారా శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చి గూఢచారి చిత్రం ద్వారా శోభితా టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్ ఆడియన్స్‌ను ఆకర్షించింది. ఆ తర్వాత మేజర్, పొన్నియన్ సెల్వన్ 1 & 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల ‘మంకీ మాన్’ అనే అమెరికన్ ఫిల్మ్‌లోనూ శోభితా నటించింది. ప్రస్తుతం హిందీలో ‘సితారా’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇక నాగచైతన్య ‘తండేల్’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.
నాగచైతన్య రియాక్షన్ ఇదే!
శోభితతో నిశ్చితార్థంపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్న క్రమంలో తమ బంధం గురించి నాగ చైతన్య స్పందించారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా శోభిత పెట్టిన ఎంగేజ్మెంట్ ఫొటోలు, ఆసక్తికరమైన క్యాప్షన్‌ను రీట్వీట్ చేస్తూ తన అభిప్రాయం కూడా ఇదే అంటూ రీపోస్టు చేశారు. ‘నా తల్లి నీకేమవుతుంది? నా తండ్రి నీకు ఎలాంటి బంధువు? మనం ఎలా కలిస్తేనేం. మన హృదయాలు ఎర్రని భూమిలా వర్షిస్తోంది. విడిపోలేనంతగా అవి కలిసిపోయాయి’ అంటూ తమిళ కవి కురుంతోగై రాసిన పద్యం నుంచి పదాలను తీసుకుని క్యాప్షన్‌గా పెట్టారు. ఈ పోస్టును అక్కినేని సమర్థిస్తుండగా సామ్ అభిమానులు మాత్రం పెదవి విరుస్తున్నారు.