నాగచైతన్య (Naga Chaitanya) – శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) నిశ్చితార్థం తర్వాత తన ప్రమేయం లేకుండానే సమంత (Samantha) వార్తల్లో నిలిచింది. ఈ వ్యవహారంపై సమంత ఎలా స్పందిస్తుందా అని అంతా తెగ ఎదురుచూశారు. అంతేకాదు తన మాజీ భర్త ఇంకో పెళ్లికి సిద్ధమైన నేపథ్యంలో సమంత ఫ్యూచర్ గురించి కూాడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆమె కూడా విడాకుల గాయం నుంచి కోలుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని సామ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ వార్త హల్చల్ చేస్తోంది. సామ్ ఓ వ్యక్తితో ప్రేమలో పడినట్లు సోషల్ మీడియాలో స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
డేటింగ్లో సమంత?
స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘సిటాడెల్ : హనీ బన్నీ’ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్న రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో సమంత డేటింగ్ చేస్తున్నట్లు నెట్టింట ప్రచారం మెుదలైంది. రాజ్ తెరకెక్కిస్తున్న ప్రస్తుత సిరీస్‌తో పాటు గతంలో రూపొందించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్‌సిరీస్‌లోనూ సామ్ నటించింది. ఆ సిరీస్ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని ప్రచారం జరుగుతోంది, సిటాడెల్ సిరీస్‌కు వచ్చే సరికి అది కాస్త ప్రేమగా మారిందంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీనిపై సమంత నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇందులో నిజా నిజాలు ఎలా ఉన్న తాజా గాసిప్‌ను చూసి నాగ చైతన్య ఫ్యాన్స్ షాకవుతున్నారు. నాగ చైతన్య నిశ్చితార్థం జరిగిన నేపథ్యంలోనే సమంత డేటింగ్ అంశం తెరపైకి రావడంపై గుర్రుగా ఉన్నారు.
రాజ్ ప్రోత్సాహంతో ఓటీటీలోకి!
సినిమాల్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించిన సమంత గతేడాది ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ ద్వారా తొలిసారి ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ సిరీస్‌కు దర్శకత్వం వహించిన రాజ్ నిడిమోరు ప్రోత్సాహంతోనే సామ్ స్ట్రీమింగ్ రంగంలోకి వచ్చిటన్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ సిరీస్‌లో చాలా బోల్డ్‌గా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం అతడి డైరెక్షన్లో రూపొందుతున్న ‘సిటాడెల్ : హనీ బన్నీ’ హిందీ సిరీస్‌లోనూ సామ్ ఫీమేల్ లీడ్‌గా నటిస్తోంది. ఈ సిరీస్ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది. తన బ్యాక్ టూ బ్యాక్ సిరీస్‌లలో సమంతకు అవకాశం ఇవ్వడం వెనుక రాజ్ నిడిమోరుతో ఆమెకున్న రిలేషన్ కూడా కారణం కావొచ్చన్న పుకార్లు వినిపిస్తున్నాయి. కాగా, రాజ్‌కు ఇదివరకే పెళ్లి కావడం గమనార్హం.
సిటాడెల్ కోసం ప్రత్యేక సన్నద్ధత
‘సిటాడెల్ : హనీ బన్నీ’ (Citadel: Honey Bunny) సిరీస్‌లో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్, సమంత జంటగా చేశారు. ఈ యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ కోసం సమంత ప్రత్యేకంగా సిద్ధమైంది. మార్షల్ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. ముఖ్యంగా వరుణ్, సామ్ కలిసి చేసే యాక్షన్ సన్నివేశాలు అలరిస్తాయని టాక్. 1990ల నేపథ్యంలో ఈ సిరీస్ సాగనున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి డూప్ లేకుంగా సామ్ స్వయంగా యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. రాజ్‌తో పాటు డీకే కూడా ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. రుస్సో బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ సిరీస్ పలు దేశాల్లో వివిధ భాషల్లో రూపొందుతోంది. సిటాడెల్ మాతృకలో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ నటించారు.
నాగచైతన్యతో విడాకులు
స్టార్ హీరోయిన్ సమంత (Samantha)ను గతంలో నాగ చైతన్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఏం మాయ చేశావే’ (Ye Maaya Chesave) సినిమాతో చైతు-సమంతకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. 2017లో వివాహ బంధం ద్వారా వారిద్దరు ఒక్కటయ్యారు. బెస్ట్ కపుల్ అంటూ ప్రసంశలు కూడా అందుకున్నారు. అటువంటిది నాలుగేళ్ల తర్వాత వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అభిమానులకు షాకిస్తూ 2021లో నాగ చైతన్య, సమంత విడిపోయారు. ప్రస్తుతం ఎవరి దారి వారిది అన్నట్లుగా జీవిస్తున్నారు. మూడేళ్ల తర్వాత చైతు మరో పెళ్లికి రెడీ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్