స్మార్ట్ ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్ మరోసారి మార్కెట్‌ను షేక్ చేసేందుకు వచ్చింది. తక్కువ బడ్జెట్‌లో 5జీ ఫోన్‌ను తీసుకువచ్చింది. కేవలం రూ. 13,490కే వినియోగదారులకు అందిస్తుంది. ఈ నెల 21నుంచి సేల్ మొదలైంది. ఈ మెుబైల్. ఇంత తక్కువ ధరకు 5జీ ఫోన్‌ను దాదాపు ఎవ్వరూ తీసుకురాలేదు. ఒకవేళ వచ్చినా ఇలాంటి స్పెసికేషన్స్ లేవు. ఈ మెుబైల్ గురించి పూర్తిగా తెలుసుకోండి.
శామ్‌సంగ్ M14 5G
M సిరీస్‌లో మరో ఫోన్‌ను లాంఛ్ చేసింది శామ్ సంగ్. ఈ సారి 5జీలో అదిరిపోయే ఫీచర్స్‌ను తీసుకువచ్చింది. 5జీ సపోర్ట్‌తో 4జీబీ RAM + 128 జీబీతో పాటు 6జీబీ + 128 జీబీ వేరియంట్లలో మోడల్స్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేశారు.
కెమెరా
ఇందులో వెనకాల 50MP మెయిన్ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 13MP ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. దీనితో స్పెషల్ మూమెంట్స్‌ను కవర్ చేయవచ్చు. ఒకవేళ తక్కువ లైటింగ్ ఉన్నప్పటికీ F 1.8 లెన్స్‌ను ఉపయోగించి క్లారిటీగా ఫొటోలు తీసుకోవచ్చు.
బ్యాటరీ
శామ్‌సంగ్‌లో ప్రస్తుతం రిలీజ్ చేస్తున్న అన్ని మోడల్స్ 6000mAh బ్యాటరీతో వస్తున్నాయి. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నారు. బ్రౌజింగ్ నాన్‌స్టాప్‌గా చేసినా 2 రోజులు బ్యాటరీ ఉంటుందని సంస్థ చెబుతోంది.. ఆడియో ప్లేబాక్ 155 గంటలు, టాక్ టైమ్ 58 గంటలు, ఇంటర్నెట్‌లో 27 గంటలు, 25 గంటల పాటు వీడియోలు చూడవచ్చని పేర్కొంది.
ప్రాసెసర్
ఇందులో సరికొత్త ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 5nm ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. పర్‌ఫార్మెన్స్ అదిరిపోతుందని సంస్థ పేర్కొంది. ఏ పనినైనా ఒకేసారి చేసుకోవచ్చంటూ వెల్లడించింది.
డిస్ ప్లే
M 14లో 16.72 సెంటీ మీటర్ల ఫుల్ HD డిస్‌ప్లే అందుబాటులో ఉంది. దీంతో పాటు గొరిల్లా గ్లాస్‌లో తీసుకువచ్చారు. ఇది వీడియో, పిక్చర్ క్వాలిటీని సూపర్‌గా ప్రజెంట్ చేస్తుంది.
5జీ సపోర్ట్
సరసమైన ధరల్లో 5జీ సపోర్ట్‌ను అందించారు. అంతేకాదు, సుమారు 13 బ్యాండ్స్ సపోర్ట్ అయ్యేలా M 14ను రూపొందించడం జరిగింది.
రంగులు
మూడు రంగుల్లో ఫోన్‌ను అందిస్తున్నారు. బెర్రీ బ్లూ, స్మోకీ టీల్, ఐసీ సిల్వర్ కలర్స్‌లో వచ్చింది. లుక్ చూడటానికి స్టైలిష్‌గా ఉంది.
మరికొన్ని
ఆండ్రాయిడ్ 13 one UI Core 5.1 సాఫ్ట్‌వేర్ ఉంది. రెండు జనరేషన్ల వరకు సాఫ్ట్‌వేర్ అప్డేట్‌లతో పాటు నాలుగేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ ఇచ్చారు. అంతేకాదు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
సేల్ ఎక్కడంటే
ఈ ఫోన్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ప్రారంభ ధర 4జీబీ+ 128జీబీ రూ. 13,490గా ఉంది. కానీ, ప్రాంతాన్ని బట్టి రేట్లు మారతాయి. అంతేకాదు కలర్స్, RAMను బట్టి మార్పులు ఉంటాయి.
Buy Now
సక్సెస్ అవుతుందా
శామ్‌సంగ్ నుంచి గతంలో M సిరీస్‌లో ఫోన్లు విడుదలయ్యాయి. అప్పటి మార్కెట్‌కు తగ్గట్లుగా 4జీలో తక్కువ ధరలకే M 11, M12 వంటి మోడల్స్ తెచ్చారు. మార్కెట్‌లోకి వచ్చిన కొద్ది రోజులు అమ్మకాలు జోరుగా సాగినా తర్వాత ఫోన్ సరిగా లేదనే రివ్యూలు వచ్చాయి. ఫలితంగా పెద్దగా విజయవంతం కాలేదు. అనంతరం A సిరీస్‌తో తెచ్చిన ఫోన్స్ బాగానే పర్‌ఫార్మ్ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మరోసారి M సిరీస్‌లో ఫోన్ విడుదల చేశారు. ఇది ఎలా ఉంటుందో చూడాలి.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..