సంక్రాంతి సందర్భంగా ఏ డ్రెస్ వేసుకోవాలని చాలా మంది అమ్మాయిలు సతమతమవుతుంటారు. కొత్త ఏడాదిలో వచ్చే అతిపెద్ద పండగ కావడంతో కుటుంబ సభ్యుల దృష్టిని ఆకర్షించేలా మేకోవర్ కావాలని ఆరాటపడుతుంటారు. అయితే ఎలా రెడీ అవ్వాలి? ఎటువంటి ట్రెడిషనల్ డ్రెస్ ధరించాలి? అనేది తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అటువంటి వారికోసమే YouSay ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. అచ్చమైన తెలుగుమ్మాయిలా మిమ్మల్ని మార్చే డ్రెస్ ఆప్షన్స్‌ను మీ ముందు ఉంచింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
బ్లూ కలర్ హాఫ్ శారీ
హాఫ్ శారీ లుక్‌ను ఇష్టపడే వారు దీన్ని ట్రై చేయవచ్చు. బ్లూ కలర్ పైట, గోల్డెన్ రంగు అంచుతో ఉన్న దీనిని ధరిస్తే మీరు అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తారు. నటి ఆషిక రంగనాథ్‌లా మ్యాచింగ్ ఆభరణాలు, చెవులకు చమ్కీలు, గాజులు ధరిస్తే ఇక మీకు తిరుగుండదు.
రెడ్-వైట్ హాఫ్ శారీ
శ్వేత వర్ణం హాఫ్ శారీలో ఈ సంక్రాంతికి మెరిసిపోవాలని కోరుకుంటే దీన్ని పరిశీలించవచ్చు. ఈ హాఫ్ శారీలో రెడ్ బ్లౌజ్ హైలేట్ అని చెప్పవచ్చు. డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే హెయిర్ స్టైల్, ఆభరణాలు, గాజులు ధరిస్తే మీ లుక్ అదిరిపోతుంది.
పసుపు రంగు లంగా ఓణీతో
లంగా ఓణీలు తెలుగుదనాన్ని ఉట్టిపడేలా చేస్తాయి. ఈ సంక్రాంతికి మంచి ట్రెడిషనల్ లుక్‌ను కోరుకునే అమ్మాయిలు.. లంగా ఓణీలను ట్రై చేయవచ్చు. యంగ్ హీరోయిన్ శ్రీలీలలాగా మీరు కూడా పసుపు రంగు, ఆరెంజ్ అంచు కలిగిన లంగా ఓణీని దరిస్తే అందరి దృష్టిని ఆకర్షించవచ్చు.
సెమీ స్టిచ్‌డ్ లెహంగా
గోల్డ్ కలర్ బ్లౌజ్, గ్రీన్ కలర్ పైటతో వచ్చే ఈ లెహంగా మీ అందాన్ని అమాంతం పెంచుతుంది. గాజులు, చెవులకు జుంకాలు, హెయిర్ స్టైల్‌ను ధరిస్తే ఈ సంక్రాంతికి మీరే హైలెట్‌గా నిలుస్తారు. రష్మిక లాగా హీరోయిన్‌లా కనిపిస్తారు.
రెడ్ – డార్క్ గ్రీన్
డార్క్ రెడ్, గ్రీన్ కాంబినేషన్ చాలా పాపులర్. ఈ హాఫ్‌శారీని ధరించినప్పుడు వడ్డాణం, జుంకా, పాపడి బిల్లలు పెట్టుకుంటే మరింత అందంగా కనిపిస్తారు.
రెడ్ కలర్ డిజైనర్ శారీ
మహిళలకు చీరతో వచ్చే అందం మరే డ్రెస్ వల్ల రాదు అంటారు. కాబట్టి ఈ సంక్రాంతికి సంప్రదాయంగా కనిపించేందుకు అందమైన శారీని కట్టండి. యంగ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ ధరించిన రెడ్ కలర్ డిజైనర్ శారీ మీకు మంచి లుక్‌ను తీసుకురావడమే కాకుండా అందరూ మిమ్మల్నే చూసేలా చేస్తుంది.
గ్రీన్ – గోల్డెన్ అంచు శారీ
రష్మిక కట్టిన గ్రీన్ కలర్ గోల్డెన్ అంచు చీర.. ఈ సంక్రాంతికి మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. శారీకి తగ్గ ఆభరణాలు, హెయిర్‌స్టైల్‌ను మెయిన్‌టెన్ చేస్తే ఇక మీరు పొగడ్తలలో మునిగి తేలాల్సిందే.
పింక్ కలర్ డిజైనర్ శారీ
ఈ సంక్రాంతికి పింక్ కలర్ డిజైనర్ శారీని ధరించాలని కోరుకునే వారు దీనిని ట్రై చేయవచ్చు. ఇది మీకు చూడ చక్కని రూపును తీసుకొస్తుంది. చీరకు తగ్గ ఆభరణాలు, చెవులకు చెమ్కీలు ధరిస్తే మీరూ మృణాల్ ఠాకూర్ లాగా ఎంతో అందంగా కనిపించవచ్చు.
గోధుమ రంగు శారీ
సాయి పల్లవి లాగా మీరు అచ్చతెలుగు అమ్మాయిలా కనిపించడానికి ఈ శారీ చక్కని ఎంపిక. ఈ గోధుమ రంగు చీరకు తగ్గట్టు గాజులు, లూజ్ హెయిర్, చెవి బుట్టలు ధరిస్తే ఇక అందరి దృష్టి మీపైన ఉండాల్సిందే.
లెహంగా చోలీ
లంగా ఓణీలు, చీరలకు భిన్నంగా లెహంగా చోలీ కూడా ఈ పండక్కి ధరించవచ్చు. ఇది మిమ్మల్ని ట్రెడిషనల్‌గా, స్టైలిష్‌గా ఉంచుతుంది. కీర్తి సురేష్ లాగా మీరు ఎంతో అందంగా బంధువుల ముందు కనిపిస్తారు.
ప్లెయిన్ డిజైనర్ శారీ
కొందరు అమ్మాయిలు ప్లెయిన్ డిజైనర్ చీరలను ఇష్టపడుతుంటారు. అటువంటి వారు నటి ప్రియాంక మోహన్ ధరించిన టైపు శారీలను ట్రై చేయవచ్చు. ఇది ట్రెడిషనల్ లుక్‌తో పాటు అందరిలో మిమ్మల్ని ప్రత్యేకంగా ఉంచుతుంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం