• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Sanya Malhotra: దంగల్‌ బ్యూటీ సన్యా మల్హోత్రా హాట్‌ షో.. ఓ లుక్కేయండి!

    బాలీవుడ్‌ బ్యూటీ సన్యా మల్హోత్రా (Sanya Malhotra) మరోమారు స్టన్నింగ్‌ సెల్ఫీతో సోషల్‌ మీడియాను తన వైపునకు తిప్పుకుంది. 

    కర్లీ హెయిర్‌తో ఎద అందాలను చూపిస్తూ నెటిజన్లకు హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. టైట్‌ ఫిట్‌ జాకెట్‌తో చూపు తిప్పుకోనికుండా చేసింది. 

    ఫిబ్రవరి 24, 1992లో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించిన సన్యా.. ఢిల్లీలో డ్యాన్సర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. 

    డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ అనే రియాలిటీ షోలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. తన అద్భుతమైన నృత్యంతో న్యాయ నిర్ణేతల ప్రశంసలు అందుకుంది. 

    ఆ తర్వాత ఢిల్లీ నుంచి ముంబయికి మకాం మార్చిన ఈ బ్యూటీ (Sanya Malhotra).. సినిమా అవకాశాల కోసం ఆడిషన్స్‌కు వెళ్లింది. 

    ఆడిషన్స్‌లో పాల్గొన్న ప్రతీసారి సన్యా (Sanya Malhotra)కు నిరాశే ఎదురైంది. కానీ, పట్టుదలతో అమీర్‌ఖాన్‌ (Amir Khan) పక్కన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. 

    అమీర్‌ ఖాన్ బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘దంగల్‌’ (Dangal)తో అరంగేట్రం చేసి నటిగా అందరి దృష్టిని ఆకర్షించింది. 

    ఆ తర్వాత సన్యాకు బాలీవుడ్‌లో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌ (Secret Superstar), పటాకా (Pataakha), బదాయి హో (Badhaai Ho) సినిమాల్లో నటించింది. 

    ఫొటోగ్రాఫ్‌ (Photograph), శకుంతలా దేవి (Shakuntala Devi), లూడో (Ludo), పగ్‌లైట్‌ (Pagglait), మీనాక్షి సుందరేశ్వర్‌ (Meenakshi Sundareshwar) చిత్రాల్లోనూ నటించి బాలీవుడ్‌లో స్థిరపడింది. 

    తెలుగు చిత్రం హిట్‌కు రీమేక్‌గా వచ్చిన బాలీవుడ్‌ మూవీలో ఈ భామ (Sanya Malhotra) హీరోయిన్‌గా ఛాన్స్‌ దక్కించుకుంది. 

    రాజ్‌కుమార్‌ రావు హీరోగా చేసిన ఈ మూవీకి శైలేష్‌ కొలను దర్శకత్వం వహించారు. ‘HIT: The First Case’ పేరుతో ఈ సినిమా విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. 

    షారుక్‌ ఖాన్‌ నటించిన ‘జవాన్‌’ (Jawan) సినిమాలోనూ సన్యా మల్హోత్రా (Sanya Malhotra) నటించింది. డా. ఈరమ్‌ పాత్రలో నటించి అందర్నీ ఆకట్టుకుంది. 

    హిందీలో బయోగ్రఫికల్‌ వార్‌ డ్రామాగా వచ్చిన ‘శామ్ బహదూర్‌’ మూవీలోనూ ఈ భామ చేసింది. ఇందులో చక్కటి నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 

    ప్రస్తుతం సన్యా చేతిలో రెండు బాలీవుడ్‌ చిత్రాలు ఉన్నాయి. ఒకటి ‘బేబీ జాన్’ కాగా రెండోదానికి ఇంకా టైటిల్‌ ఫిక్స్ చేయలేదు. 

    ఓవైపు వరుస సినిమాల్లో నటిస్తూనే ఈ బ్యూటీ (Sanya Malhotra) సోషల్‌ మీడియాలో చురుగ్గా వ్యవహరిస్తోంది. తన హాట్‌ ఫొటోలతో నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv