మిడిల్ క్లాస్ లైఫ్ నేఫథ్యంలో వచ్చిన ‘షరతులు వర్తిస్తాయి’(Sharathulu Varthisthai OTT) సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా విడుదలైన రెండు నెలల తర్వాత ఇప్పుడు స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఈ చిత్రంలో 30 వెడ్స్ 21 యూట్యూబ్ సిరీస్ ఫేమ్ చైతన్యరావు, భూమి శెట్టి ప్రధాన పాత్రలో నటించారు. వీరితో పాటు వెంకీ మంకీ, సంతోష్ యాదవ్. దేవరాజ్ తదితరులు నటించారు.
30 వెడ్స్ 21 యూట్యూబ్ సిరీస్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న చైతన్యరావు టాలీవుడ్‌లో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో కీడాకోలా చిత్రంలో అలరించారు. ఇప్పుడు ‘షరతులు వర్తిస్తాయి’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రం మార్చి 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను కుమార స్వామి డైరెక్ట్ చేశారు. అరుణ్ చిలువేరు సంగీతం అందించారు. ఈ సినిమాను స్టార్ లైట్స్ బ్యానర్‌పై నాగర్జున సాముల ప్రొడ్యూస్ చేశారు.
ఈ సినిమా థియేటర్లలో యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. మరి ఓటీటీలో(Sharathulu Varthisthai OTT) ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాల్సి ఉంది.
స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
షరతులు వర్తిస్తాయి సినిమా స్ట్రీమింగ్ హక్కులను ఆహా దక్కించుకుంది. ఈ సినిమా మే 18న స్ట్రీమింగ్‌కు రానున్నట్లు ఆహా తన అధికారిక ట్విట్టర్( ఎక్స్) ద్వారా కొద్ది సేపటి క్రితం(మే14న) పోస్ట్ చేసింది.
సినిమా స్టోరీ ఇదే
చిరంజీవి, విజయ మధ్య తరగతి భార్య భర్తలు. చైన్ సిస్టమ్ బిజినెస్ వారి జీవితాలను తలకిందులు చేస్తుంది. ఇంతకీ ఆ బోగస్ కంపెనీ ఎవరిది? తన డబ్బులు పోయాయని తెలిసిన చిరంజీవి ఏం చేశాడు? ఈ మోసానికి కార్పోరేషన్ ఎన్నికలకు సంబంధం ఏంటి? అన్నది కథ.
సినిమా ఎలా ఉందంటే?
ఇక సినిమాలో నటీనటుల విషయానికొస్తే.. చైతన్యరావు మిడిల్ క్లాస్ వ్యక్తిలాగా బాగా యాక్ట్ చేశాడు. చిరంజీవి అనే క్యారెక్టర్‌లో జీవించేశాడు. సినిమాలో పలు సందర్భాల్లో ఆయన చెప్పిన డైలాగులు మధ్యతరగతి కుటుంబాలకు బాగా కనెక్ట్ అవుతాయి. ఇక భూమి శెట్టికి ఈ సినిమా ద్వారా మంచి పాత్ర దొరికిందని చెప్పవచ్చు. తన న్యాచురల్ యాక్టింగ్‌తో ప్రధాన సన్నివేశాలను రక్తి కట్టించింది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో నటన పరంగా ఆమె మంచి సన్నివేశాలు ఉన్నాయి అని చెప్పవచ్చు. ఈ చిత్రం ప్రధానంగా మల్టీ లెవల్ మార్కెటింగ్ వ్యవస్థ.. మిడిల్ క్లాస్ వారి ఆశలతో ఎలా ఆడుకుంటుంది. వారి ఆశలను తమ పెట్టుబడిగా ఎలా మార్చుకుంటుంది అనే అంశాలపై సినిమా కథనం సాగుతుంది. ఈ సినిమా ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. దానికి తగిన కథనం ఇంకాస్త బలంగా ఉండాల్సింది. స్క్రీన్ ప్లే స్లోగా ఉంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాలు అంతగా ఆప్టెడ్ అనిపించవు.ఫస్టాప్‌లో బాగుంటుంది. సెకండాఫ్‌లో కొన్ని చొట్ల బోర్ ఫీలింగ్ కలుగుతుంది. సాంకేతికంగా నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా ఉంటుంది.
సినిమా చూడొచ్చా?
ఇక మొత్తానికి ‘షరతులు వర్తిస్తాయి’ సినిమా ఓసారి చూడదగిన చిత్రంగా చెప్పవచ్చు. సెకండాఫ్ కాస్త గందరగోళపరిచినా… ఆర్థిక మోసాలపై చెప్పే పాయింట్ ఆకట్టుకుంటుంది.
ఆహాలో నేరుగా మరో సినిమా
ఆహాలో నేరుగా ‘విద్యా వాసుల అహం’ విడుదల కానుంది. ఈ చిత్రం మే 17వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. కొత్తగా పెళ్లయిన ఓ జంట ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని ఈగోలతో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో శివానీ రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!