బాలీవుడ్ బ్యూటీ సౌందర్య శర్మ (Soundarya Sharma) సెగలు పుట్టించే అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
తాజాగా బ్లాక్ లెహంగాలో కనిపించిన ఈ భామ.. ఎద, నడుము అందాలు చూపిస్తూ కుర్రకారును ఉర్రూతలూగించింది.
సంప్రదాయ దుస్తుల్లోనూ తన హాట్ హాట్ అందాలను చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సౌందర్యనే స్వయంగా షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.
సెప్టెంబర్ 20, 1994న ఢిల్లీలో జన్మించిన సౌందర్య శర్మ.. తన విద్యాభ్యాసాన్ని అంతా అక్కడే కొనసాగించింది. ఆ తర్వాత మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.
2017లో ‘రాంచీ డైరీస్’ (Ranchi Diaries) అనే బాలీవుడ్ చిత్రంలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఈ సినిమాకు గాను జార్ఖండ్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ అరంగేట్ర నటిగా అవార్డు అందుకుంది.
అదే విధంగా జీ సినీ అవార్డ్స్ (Zee Cine Awards), స్టార్ స్క్రీన్ అవార్డ్స్ (Star Screen Awards)ను సైతం ఆమె సొంతం చేసుకొని బాలీవుడ్ వర్గాల దృష్టిలో పడింది.
ఆ తర్వాత హిందీ బిగ్‌బాస్ సీజన్ 16లో హౌస్‌మేట్‌గా వెళ్లింది. సౌందర్య శర్మ ఫేమ్ మరింత పెరిగేందుకు ఈ రియాలిటీ షో ఎంతగానో ఉపయోగపడింది.
అజయ్ దేవ్‌గన్, సిద్దార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించిన థ్యాంక్ గాడ్ (Thank God) చిత్రంలో అతిథి పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరించింది.
రక్తాచల్ 2 (Raktanchal 2), కర్మ్ యుద్ధ్ (Karm Yuddh) అనే సిరీస్‌లలోనూ సౌందర్య శర్మ ముఖ్యపాత్రలు పోషించింది.
అలాగే పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ ఈ బ్యూటీ హల్‌చల్ చేసింది. ‘మస్త్ బర్సాత్’, ‘బాంబ్ హై’, ‘బడే దిన్ సే’, ‘కుబ్‌సూరత్’ మ్యూజిక్ వీడియోస్‌లో ఆమె కనిపించింది.
ప్రస్తుతం సౌందర్య శర్మ చేతిలో ఎలాంటి చిత్రాలు లేవు. దీంతో సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఈ బ్యూటీ తన ఫ్యాన్స్‌ను పలకరిస్తోంది.
ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్, నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ప్రస్తుతం సౌందర్య ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 7.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్