నటసింహం నందమూరి బాలకృష్ణ, టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ‘ఎన్‌బీకే 108’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలకృష్ణ కూతురుగా యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. ఈ క్రమంలో తాజాగా శ్రీలీల ‘ఎన్‌బీకే 108’ సెట్‌లోకి అడుగుపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోను మూవీ టీం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా ఈ మూవీలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.