భారతీయ చిత్ర పరిశ్రమను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli). ‘బాహుబలి’తో దేశంలోనే టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంతో వరల్డ్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ సైతం సాధించి దేశం నలుమూలల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబుతో ‘SSMB29’ ప్రపంచస్థాయి చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఇదిలాంటే దర్శకుడు రాజమౌళి గురించి క్రేజీ వార్త బయటకొచ్చింది. ఆయన గతంలో కోలీవుడ్ స్టార్స్ సూర్య, ఆయన సోదరుడు కార్తీతో సినిమా తీయాలని భావించినట్లు తెలిసింది. అది కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
‘కథ చెప్పారు.. వర్కౌట్ కాలేదు’
తమిళ స్టార్ హీరో కార్తీ తాజాగా ఓ ఇంటర్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నెక్స్ట్ సినిమా ‘సత్యం సుందరం’ ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ గౌతమ్ మీనన్‌తో కార్తీ ఇంటర్యూ చేశారు. ఇందులో సూర్య, కార్తీ కలిసి నటించడంపై గౌతమ్ మీనన్ ప్రశ్నించగా గతంలో జరిగిన ఆసక్తికర విషయాన్ని కార్తీ పంచుకున్నాడు. ‘నేను కార్తిక్ కలిసి నటిస్తాం. అందుకు తగ్గ స్క్రిప్ట్ రావాలి. గతంలో రాజమౌళి సర్ మాకు ఒక కథ వినిపించారు. అది బాగానే ఉంది కానీ ఆ సినిమా వర్కౌట్ కాలేదు’ అని తెలిపాడు. ఇది విన్న సినీ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు. రాజమౌళి కథ చెబితే ఎలా వదులుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ సినిమా పట్టాలెక్కి ఉంటే సూర్య, కార్తీ రేంజ్ మరోలా ఉండేదని అంచనా వేస్తున్నారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ స్టోరీనా!
సూర్య, కార్తీలతో కలిసి రాజమౌళి చేయాలని భావించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ అయి ఉండొచ్చని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్, తారక్ పాత్రల్లో తొలుత సూర్య, కార్తీలను రాజమౌళి ఊహించుకొని ఉంటారని అంచనా వేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ కార్తీ, సూర్య ‘ఆర్‌ఆర్‌ఆర్’ చేసి ఉంటే ఈ స్థాయి సక్సెస్ వచ్చేది కాదని తెలుగు ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’లో యాక్షన్, డ్రామాతో పాటు డ్యాన్స్ కూడా హైలెట్‌గా నిలిచాయని గుర్తుచేస్తున్నారు. చరణ్, తారక్‌తో పోలిస్తే సూర్య, కార్తీ డ్యాన్స్ పరంగా కాస్త వెనుకంజలోనే ఉంటారని అంటున్నారు.
తారక్‌కు పోటీగా కార్తీ!
కార్తీ లేటెస్ట్ చిత్రం సత్యం సుందరి రిలీజ్‌కు సిద్ధమైంది. ఇందులో కార్తీతో పాటు ప్రముఖ నటుడు అరవింద స్వామి ముఖ్య పాత్రలో నటించాడు. ’96’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన ప్రేమ్ కుమార్.సీ (Prem Kumar C) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘దేవర’కు పోటీగా సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజవ్వగా అది ఆకట్టుకుంటోంది. ఇక కార్తీ తన నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్‌ను కూడా తాజాగా అనౌన్స్ చేశాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌లో ‘Karthi 29’ చిత్రం ఉంటుందని ఆయన ప్రకటించారు. త్వరలోనే ఇతర తారాగాణం, టెక్నికల్ టీమ్ వివరాలు బయటకు రానున్నాయి.
డిసెంబర్‌లో ‘SSMB 29’ షూటింగ్!
మహేష్ బాబు హీరోగా రాజమౌళి సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని ప్రతీ ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా SSMB29కి సంబంధించిన అధికారిక అప్‌డేట్ ఉంటుందని సమాచారం. డిసెంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మెుదలవుతుందని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. మెుదటి షెడ్యూల్ జర్మనీలో స్టార్ట్ అవుతుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. 18వ శతాబ్దం బ్యాక్‌డ్రాప్‌లో అరుదైన గిరిజన తెగల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఉండనున్నట్లు తెలుస్తోంది.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?