రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే అంచనాలు ఏ స్థాయికి వెళ్లిపోతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో జక్కన్న సినిమా తీయనుండటంతో యావత్ దేశం దృష్టి దానిపై నెలకొంది. దీంతో ఈ క్రేజీ కాంబో సెట్స్ పైకి వెళ్లే రోజు కోసం అంతా ఎదుచూస్తున్నారు. ఇక సినిమా కోసం మహేష్ అదిరిపోయేలా మేకోవర్ అవుతున్నాడు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మహేష్ దంపతులు కలవగా అతడి లుక్స్ వైరల్ అయ్యాయి. లాంగ్ హెయిర్, బియర్డ్ లుక్‌తో మహేష్ పిక్స్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. దీంతో SSMB29లో మహేష్ లుక్ ఇదేనంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడే బిగ్ ట్విస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
మహేష్ లుక్ అసలైంది కాదా?
సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ లుక్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. హాలీవుడ్ హీరోలా ఉన్నాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘SSMB29’ కోసం బాబు లుక్ సిద్ధమైనట్లేనని కామెంట్స్ కూడా చేశారు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం మహేష్ ఇదే లుక్‌లో సినిమాలో కనిపించడని తెలుస్తోంది. మరింత గడ్డం, జుట్టు పెంచాక విదేశాల నుంచి హెయిర్ స్టైలిస్ట్‌ను రాజమౌళి పిలిపించనున్నారట. ఆ తర్వాత తను అనుకుంటున్న నాలుగైదు లుక్స్‌లోకి మహేష్‌ను మారుస్తారట. అందులో ఏది బెస్ట్ అని జక్కన్నకు అనిపిస్తుందో అదే చివరికీ ఫైనల్ అవుతుందని సమాచారం. దీంతో ప్రస్తుత లుక్కే ఫైనల్ అని భ్రమపడిన మహేష్ ఫ్యాన్స్ అంతా నాలుక కరుచుకుంటున్నారు. జక్కన్న తమని భలే బురిడికొట్టించాడని అభిప్రాయపడుతున్నారు.
అందుకే మహేష్‌కు స్వేచ్ఛ!
తన సినిమాల్లోని హీరోల లుక్‌పై రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. సినిమాల్లోని లుక్ బయటకు లీక్ కాకుండా జాగ్రత్తపడుతుంటారు. ఈ మేరకు సదరు హీరోలకు సైతం ముందుగానే రాజమౌళి కండీషన్లు విధిస్తుంటారు. షూటింగ్ జరుగుతున్న కాలం లుక్ రివీల్ కాకుండా చూస్కోవాలని షరతు పెడుతుంటారు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాల సమయంలో ప్రభాస్, రామ్‌చరణ్, తారక్ ఇదే సూత్రాన్ని పాటించారు. అయితే ఇందుకు భిన్నంగా మహేష్ మాత్రం స్వేచ్ఛగా ఎక్కడంటే అక్కడ కెమెరాలకు ఫోజులు ఇచ్చేస్తున్నాడు. తన మేకోవర్‌ను ఏదోక రూపంలో పబ్లిక్‌కు రివీల్ చేస్తూనే వస్తున్నారు. అయితే మహేష్ ఇలా స్వేచ్ఛగా తిరగడానికి కారణం ఆ లుక్ అసలైనది కాకపోవడమే అని చెప్పవచ్చు. అసలైన లుక్ ఫైనల్ అయ్యాక మహేష్ బయటకి ఎక్స్‌పోజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకునే ఛాన్స్ ఉంది.
రాజమౌళి మాస్టర్ ప్లాన్!
మహేష్ బాబు హీరోగా రూపొందనున్న ‘SSMB29’ చిత్రం కోసం దర్శకధీరుడు రాజమౌళి సరికొత్త వ్యూహాంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. సాధారణంగా జక్కన్న మూవీస్‌లో వీఎఫ్ఎక్స్‌కు ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి షూటింగ్‌తో సమానంగా గ్రాఫిక్స్ వర్క్ కోసం రాజమౌళి సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు దర్శకధీరుడు మాస్టర్ ప్లాన్ వేశాడట. ముందుగానే వీఎఫ్ఎక్స్‌కు సంబంధించి షాట్స్‌ను షూట్ చేయాలని భావిస్తున్నారట. అందుకు తగ్గట్లే ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నట్లు సమాచారం. ‘SSMB29’లో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందుగానే ఆ సీన్స్ షూట్ చేసి సదరు వీఎఫ్‌ఎక్స్ కంపెనీలకు అప్పగిస్తారట. ఆ తర్వాత మిగిలిన షూటింగ్‌పై రాజమౌళి ఫోకస్ పెడతారట. దీనివల్ల ఏక కాలంలో వీఎఫ్‌ఎక్స్ పనులు, షూటింగ్ పూర్తవుతాయని జక్కన్న భావిస్తున్నట. దీని వల్ల సినిమాను త్వరగా కంప్లీట్ చేయవచ్చని మాస్టర్ ప్లాన్ వేశారట. దీంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
ఆ విమర్శలకు చెక్
దేశం గర్వించతగ్గ దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళి అగ్రస్థానంలో ఉంటారు. అయితే ఆయన్ను గత కొంతకాలంగా ఓ విమర్శ వెంటాడుతోంది. రాజమౌళి నుంచి సినిమా రావాలంటే కనీసం మూడు, నాలుగేళ్లు సమయం పడుతుందని అందరూ అంటుంటారు. ఈ నేపథ్యంలోనే జక్కన్న ఇండస్ట్రీలోకి వచ్చి 23 ఏళ్లు అవుతున్న ఆయన నుంచి వచ్చిన చిత్రాలు కేవలం 12 మాత్రమే. వీఎఫ్‌ఎక్స్ వర్క్ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఒక వ్యూహాత్మక అడుగు అని సినీ వర్గాలు అంటున్నాయి. దీని వల్ల ఒకట్రెండు సంవత్సరాల్లో సినిమా రిలీజ్ చేసే వీలు పడుతుందని అంటున్నారు. ‘SSMB 29’ చిత్రాన్ని వచ్చే ఏడాది పట్టాలెక్కించినా 2026 చివరి కల్లా రిలీజ్ చేసే వీలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?