వేసవికాలం వచ్చిదంటే అప్రమత్తంగా ఉండాల్సిందే. భానుడి భగభగలకు శరీరం తట్టుకోవాలి కదా. ఎండాకాలం ఎక్కడికి వెళ్లినా కొన్ని వస్తువులు మన వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అప్పుడే వేడి నుంచి మనకు రక్షణ కలగటంతో పాటు కాస్త ఉల్లాసంగా ఉంటుంది. ఆ వస్తువులు మీ వద్ద ఉన్నాయో లేదో ఓ సారి చూడండి.
కూలింగ్ గ్లాసెస్
వేసవిలో కూలింగ్ గ్లాసెస్ తప్పకుండా వాడాలి. కళ్లకు చల్లదనం ఉండటమే కాకుండా సూర్య కిరణాల నుంచి రక్షణ కలుగుతుంది. అంతేనా, రోడ్డుపై దుమ్ము, ధూళి వంటి కణాలు కళ్లలో పడకుండా ఎలాగో ఉపయోగపడుతుంది కదా. మీడియం బడ్జెట్‌లో బెస్ట్ కూలింగ్ గ్లాసెస్ కోసం కింద లింక్ చూడండి.
క్యాప్
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే నడినెత్తి మీద ఎండ పడిందంటే మాడు పగిలిపోతుంది. ఎండదెబ్బ తాకి దెబ్బకి ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి సమయాల్లోనే క్యాప్ పెట్టుకొని వెళితే ఉత్తమం. ఎండ మాట పక్కన పెడితే ఎలాగో స్టైల్‌గా ఉంటుంది కదా గురూ.
గొడుగు
వేసవిలో ఎండ నుంచి పూర్తి రక్షణ కలిగించాలంటే గొడుగు తీసుకెళ్లటం ఉత్తమం. తలకి ఎండ తగలకుండా ఉపయోగపడుతుంది. అమ్మాయిలైన, అబ్బాయిలైనా అలా బ్యాగ్‌లో వేసుకొని వెళితే ఉత్తమం. ఇదిగో కొద్ది రోజులు మాదిరిగా అకాల వర్షాలు పడితే కూడా ఉయోగించుకోవచ్చు.
కర్చిఫ్
ఎండాకాలం ఒక్క ఏసీలో తప్ప ఎక్కడున్నా చెమటలు కక్కాల్సిందే. అలాంటి సమయంలో చేతిలో కర్చిఫ్ లేకపోతే ఎలా. అందుకే నిత్యం కర్చిఫ్‌ను తీసుకెళ్లడం మర్చిపోకండి. ఇక ద్విచక్రవాహనదారులు హెల్మెట్ పెట్టుకున్నాం కదా అని అనుకుంటారేమో. దానివల్ల కూడా ఓ చిక్కు ఉంది. హెల్మెట్ గంటలతరబడి పెట్టుకోవటం వల్ల చెమట ఎక్కువగా వచ్చి జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు. కర్చిఫ్ కట్టుకొని తర్వాత హెల్మెట్ పెట్టుకుంటే ప్రయోజనం ఉంటుందని సలహా.
బుల్లి ఫ్యాన్
మాడుపగిలే ఎండల్లో ఎటైనా వెళ్లేటప్పుడు ఓ ఫ్యాన్ తీసుకెళ్లండి. అంతపెద్ద ఫ్యాన్ ఎవరైనా మోసుకెళ్తారా అనుకుంటున్నారేమో. కాదండీ.. ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో దొరకనివి అంటూ ఏమైనా ఉన్నాయా? ఎంచక్కా మీ బ్యాగులో పట్టే బుల్లి ఫ్యాన్‌లు ఆన్‌లైన్‌లో ఇట్టే దొరికేస్తాయి.
నెక్ కూలింగ్ టవల్
వేడిలో పనిచేసి లేదా ప్రయాణం చేసి అలిసిపోయినప్పుడు మెడకి చల్లగా ఏదైనా తాకితే ఎంత హాయిగా ఉంటుందో కదా. అందుకే మరి ఓ నెక్ కూలింగ్ టవల్ కొని పెట్టుకోండి. ఎక్కడికైనా వెళ్లేటప్పుడు తీసుకెళ్లండి సరిపోద్ది.
ఫిట్‌బిట్ యాక్టివిటీ ట్రాకర్
ప్రస్తుతం ఫిట్‌బిట్ యాక్టివిటీ ట్రాకర్ ఉపయోగించాల్సిన తరుణం. ఎండాకాలం శరీరం ఎప్పుడు ఎలా స్పందిస్తుందో తెలీదు. అందుకే, ఇది ధరించడం వల్ల మనం అప్రమత్తమయ్యే ఛాన్స్ ఉంటుంది.
వాటర్ బాటిల్
లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ వాటర్ బాటిల్. ఉన్నపలంగా చక్కెరచ్చి పడిపోతే కావాల్సింది నీళ్లు. పానం ఆగమాగం అయితే తాగాల్సింది నీళ్లే. అందుకే, ఎక్కడికి వెళ్లినా నీళ్లు తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
మినీ USB ఫ్రిడ్జ్
ఎండమండిపోతుంటే నాలుక చల్లదనం కోరుకుంటుంది. ఏదైనా బస్సులోనో, మెట్రోలోనో ఉన్నారనుకోండి అలా వెంటనే దొరకదు కదా. ఇప్పుడు మినీ USB ఫ్రిడ్జ్‌లు వస్తున్నాయి. ఒకటి కొని బ్యాగులో పడేస్తే అందులో ఓ కూల్ డ్రింక్ లేదా జ్యూస్ పెట్టుకుంటే సరి.
SUNBURN WRISTBAND
వేసవిలో యూవీ రేడియేషన్స్ ఎక్కువగా వస్తాయి. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ అయ్యి కళ్లు తిరిగి పడిపోతారు. వాటి నుంచి సన్‌బర్న్ వ్రిస్ట్‌బ్యాండ్ రక్షణ కల్పిస్తుంది. మార్కెట్‌లో మీడియం రేంజ్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.