• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఆందోళనాకారుల ఇళ్లపై బుల్డోజర్ ప్రయోగం

  హరియాణాలో అల్లర్లకు కారణమైన వారి ఇళ్లపై ప్రభుత్వం బుల్డోజర్లను ప్రయోగించింది. ఈ క్రమంలో నూహ్ జల్లాలో అక్రమంగా నిర్మించిన 250 గుడిసెలను తొలగించింది. వారు అక్రమ వలసలు వచ్చి ఇక్కడ మకాం వేసి అల్లర్లకు పాల్పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఆందోళనల్లో వీరు పాల్గొని రాళ్లదాడులు, దుకాణాల లూటీల్లో పాల్గొన్న సీసీటీవీ దృశ్వాలను పోలీసులు సేకరించారు. ఈ మేరకు దాడులు చేస్తున్న ఫోటోలను విడుదల చేశారు. UP model in Haryana ?? This is Bulldozer 'justice' Houses of 250 … Read more

  రైతులే దేశానికి బలం: రాహుల్

  రైతుల సమస్యలను అర్థం చేసుకుంటే దేశంలో సగం సమస్యలను పరిష్కరించినట్లేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రైతులే దేశానికి బలమని గుర్తు చేశారు. ఇటీవల హర్యానాలోని సోనీపత్ జిల్లాలో రైతులను కలిసి రాహుల్ వరినాట్లు వేశారు. ట్రాక్టర్ నడిపారు. ఈ వీడియోను తాజాగా షేర్ చేసుకుంటూ నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. రైతులు ఎంతో నిజాయితీపరులని, సున్నిత మనస్తత్వం కలిగిన వారని రాహుల్ చెప్పారు. धान की रोपाई, मंजी पर रोटी – किसान हैं भारत की ताकत ??? … Read more

  హోమంత్రి ఇంట్లోకి వరద నీరు

  ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు గజగజ వణికిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. హర్యానాలో వరదలు కాలనీలను ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర హోం మంత్రిని కూడా వరదలు వదల్లేదు. అంబాలాలో ఉంటున్న హోం మంత్రి అనిల్ విజ్‌ ఇంట్లోకి వరద నీరు చేరింది. దీంతో ఆయన బయటకు కదలలేకుండా లోపలే ఉండాల్సి వస్తోంది. మరోవైపు, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌లలోనూ వరదలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారాయి. హర్యానాలో బీజేపీ హోం మినిస్టర్ ఇంట్లోకి వరద నీరు అంబాలా – హర్యానాలో కురుస్తున్న భారీ … Read more

  MLA చెంప చెల్లుమనిపించిన మహిళ

  హరియాణాలో వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్లిన ఎమ్మెల్యేను ఓ మహిళ చెంపపై కొట్టింది. ‘మా ఊరంతా వరద నీటిలో మునిగిపోయిందని.. ఇప్పుడెందుకు వచ్చావ్‌’ అంటూ నిలదీసింది. భారీవర్షాలతో ఘులా ప్రాంతం పూర్తిగా నీటమునిగింది. ఈ క్రమంలో JJP ఎమ్మెల్యే ఈశ్వర్‌ సింగ్‌ ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లగా స్థానికులు ఆయన్ను చుట్టుముట్టారు. ఇక్కడేముందని చూడటానికి వచ్చావంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఓ మహిళ ఆయన్ను కొట్టడంతో అధికారులు ఖంగు తిన్నారు. #WATCH | Haryana: In a viral video, a flood … Read more

  లంచం నోట్లను నమిలిన ఎస్సై

  [VIDEO:](url) లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఓ ఎస్సై తప్పించుకోవడానికి నోట్లను నమిలి మింగేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన హర్యానాలోని ఫరిదాబాద్‌లో జరిగింది. ఓ గేదె చోరీ కేసుపై దర్యాప్తు చేపట్టేందుకు బాధితుడిని ఎస్సై రూ.10వేలు లంచం అడిగాడు. తొలుత రూ.6వేలు ఇచ్చిన బాధితుడు.. ఆ తర్వాత విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రెడ్ హ్యాండెడ్‌గా ఎస్సైని పట్టుకుని స్టేషనుకు తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో లంచం తీసుకున్న నోట్లు దొరకకుండా వాటిని నమిలేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ … Read more