• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • డబ్బులు లెక్కబెట్టలేకపోయాడని పెళ్లి క్యాన్సిల్

  ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో వరుడికి డబ్బులు లెక్కపెట్టడం రాదని ఓ యువతి పెళ్లికి నిరాకరించింది. పెళ్లి సమయంలో వరుడి బావమరిది అంటే వధువు సోదరుడు అతడికి డబ్బులు ఇచ్చాడు. నిరక్షరాస్యుడైన వరుడు వాటిని లెక్కించలేకపోయాడు. ఈ విషయం తెలియగానే వధువు అతడిని పెళ్లి చేసుకునేది లేదని తేల్చిచెప్పింది. పోలీసులు సయోద్య కుదిర్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.

  పెళ్లి చేసుకోమని నిలదీస్తే చితకబాదాడు!

  మధ్యప్రదేశ్‌లో అమానుషం చోటు చేసుకుంది. పెళ్లిచేసుకోమని కోరిన ప్రేయసిని చితకబాదాడో ఉన్మాద ప్రేమికుడు. పొదల్లోకి ఈడ్చుకెళ్లి విచక్షణా రహితంగా బాదాడు. అంతటితో ఆగకుండా రోడ్డుపైకి ఈడ్చుకొచ్చాడు. దీంతో ఆ యువతి అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. అటుగా వెళ్తున్న వారు ఈ సంగతిని గమనించి యువతిని ఆసుపత్రికి తరలించారు. ప్రియురాలిని దారుణంగా కొట్టిన యువకుడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, విషయం తెలుసుకున్న యువతి తల్లి నిందితుడిపై ఎలాంటి ఫిర్యాదు ఇవ్వకపోవడం గమనార్హం.

  యువతి కిడ్నాప్.. జంటగా ప్రత్యక్షం..!

  TS: సిరిసిల్ల యువతి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనను బలవంతంగా తీసుకెళ్లలేదని.. తనే ఫోన్ చేసి రమ్మన్నట్లు ఓ వీడియోలో తెలపింది. ప్రియుడు జానీతో వివాహం చేసుకున్న వీడియోను విడుదల చేసింది. అయితే, తీసుకెళ్లేటప్పుడు మాస్కు ఉండటంతో జానీని గుర్తపట్టలేదని తెలిపింది. ‘మా తల్లిదండ్రులు నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు. నాలుగేళ్లుగా మేం ప్రేమించుకుంటున్నాం. ఇష్ట పూర్వకంగానే జానీని పెళ్లి చేసుకున్నా. మా కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉంది’ అని షాలిని తెలిపింది. నిన్న నిశ్చితార్థం పూర్తయి.. నేడు … Read more

  కూతురి ప్రేమవివాహం; అల్లుడిని తెగ నరికిన మామ

  కూతురి ప్రేమ వివాహం నచ్చని ఓ తండ్రి అల్లుడిని తెగ నరికాడు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా హెచ్.మురవణిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఉసేని కూతురు సుకన్య.. అదే గ్రామానికి చెందిన వీరేష్‌ను పెళ్లి చేసుకుంది. ఈ వివాహం వారి తల్లిదండ్రులకు నచ్చకపో వడంతో ఎమ్మిగనూరులో కాపురం పెట్టారు. ఈ క్రమంలో వీరిద్దరూ బైక్‌పై వెళ్తుండగా ఉసేని, వారి బంధువులు వీరేష్‌పై దాడి చేసి, చనిపోయాడనుకుని వెళ్లారు. బాధితుడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

  నేను ఎవరితోనూ లేచిపోలేదు: శివానీ రాజశేఖర్‌

  ‘ఆహ నా పెళ్లంట’ వెబ్‌ సిిరీస్‌తో ఇటీవలే ప్రేక్షకును పలకరించిన నటి శివానీ రాజశేఖర్‌. ఈ సిరీస్‌ పాజిటివ్‌ టాక్‌తో మంచి వ్యూయర్‌షిప్‌ సంపాదించింది. దీనికి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా శివానీ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘ ఇటీవల చాలామంది నా పెళ్లి గురించి అడుగుతున్నారు. మా అమ్మా, నాన్న కూడా ఎప్పుడూ దీని గురించి ఇంతలా ఆలోచించలేదు. ఆ ప్రయత్నాలు కూడా చేయలేదు. అందరం బిజీగా గడుపుతున్నాం. కానీ కొంతమంది మాత్రం నేను ఎవరినో ప్రేమించి ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు పుకార్లు పుట్టించేశారు. … Read more

  ప్రేమించే పెళ్లి చేసుకుంటా; విశాల్

  పెద్దలు కుదిర్చిన వివాహం తనకు సెట్ కాదని, ఖచ్చితంగా ప్రేమ పెళ్లి చేసుకుంటానని హీరో విశాల్ అన్నారు. ప్రేమించిన అమ్మాయితోనే ఏడడుగులు వేస్తానని.. త్వరలోనే ఆ అమ్మాయిని పరిచయం చేస్తానని చెప్పారు. యాక్టర్స్ యూనియన్ బిల్డింగ్ కట్టిన తర్వాత తాను పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపారు. కాగా విశాల్ ఇంతకుముందు రీమాసేన్, వరలక్ష్మి శరత్‌కుమార్‌లతో ప్రేమాయణం నడిపాడు. ఆ తర్వాత ఓ వ్యాపారవేత్త కుమార్తెతో నిశ్చితార్థం జరిగింది. కానీ ఆ సంబంధం పెళ్లి వరకూ రాలేదు.

  యువతికి నిప్పంటించిన ఉన్మాది

  జార్ఖండ్‌లో దారుణం జరిగింది. పెళ్లికి నిరాకరించిందని యువతికి నిప్పంటించాడో ఉన్మాది. తనను పెళ్లి చేసుకోవాలని 19ఏళ్ల యువతిని రాజేశ్ రౌత్ రెండేళ్లుగా వేధిస్తున్నాడు. కుటుంబ సభ్యులు నిరాకరించడంతో పగ పెంచుకున్నాడు. ఇటీవల యువతికి వేరొకరితో వివాహమైంది. దీంతో రాజేశ్ వివాహితకు నిప్పంటించాడు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అయితే, వీరిద్దరికీ 2019నుంచే పరిచయం ఉన్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

  ఆది పినిశెట్టి, నిక్కీ గ‌ల్రానీ పెళ్లి వీడియో చూశారా?

  హీరో ఆది పినిశెట్టి, నిక్కీ గ‌ల్రానీ ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా రెండు త‌మిళ సినిమాల్లో క‌లిసి న‌టించిన వీళ్లు ప్రేమ‌లో ప‌డ్డారు. పెద్ద‌ల అంగీకారంతో మే నెల‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి మ‌న తెలుగు హీరోలు మంచు మ‌నోజ్, సందీప్ కిష‌న్, నాని త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. పెళ్లి వీడియోకు సంబంధించిన టీజ‌ర్‌ను తాజాగా విడుద‌ల చేశారు. త్వ‌ర‌లోనే పూర్తి వీడియోను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మా పెళ్లి నిన్న‌నే జ‌రిగిన‌ట్లు అనిపిస్తుంద‌ని చెప్పుకొచ్చారు ఈ జంట‌. పెళ్లిలో వాళ్లు … Read more

  హైదరాబాద్లో ఫారెన్ అమ్మాయి లవ్ మ్యారేజ్

  ఓ ఫారెన్ అమ్మయిని లవ్ చేసిన ఇండియన్ అబ్బాయి ఎట్టకేలకు హైదరాబాద్లో మ్యారేజ్ చేసుకున్నాడు. కొత్తగూడెం జిల్లాకు చెందిన అన్వేష్ బెంగళూరులో విజువల్ ఆర్ట్స్ నేర్చుకునే క్రమంలో ఫ్రాన్స్ అమ్మాయి కెరల్ పరిచయమైంది. అది కాస్తా క్రమంగా ప్రేమ వరకు వెళ్లింది. ఇక వారి కోర్సు పూర్తైన తర్వాత ఇద్దరికి ఫ్రాన్స్ లో ఉద్యోగాలొచ్చాయి. ఇక పెళ్లి చేసుకోవాలన్న ఆ ప్రేమజంట వారి పేరెంట్స్ కు చెప్పగా ఓకే అన్నారు. దీంతో హైదరాబాద్లో ఆదివారం హిందు సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.

  ప్రేమ వ్యసనమా? ఏంటీ లవ్ అడిక్షన్?

  ‘నా ప్రేమను చాపకింద పరిస్తే భూమి సరిపోదు. గాల్లో నింపితే ఈ విశ్వం బద్ధలవుతుంది. నీళ్లలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి.’ అంటాడు ఓ హీరో తన హీరోయిన్ తో. నిజంగా అంత ప్రేమ ఉంటుందా? హద్దులూ, అవధులూ లేని అనంతమైన భావననే ప్రేమా? మీలో చాలామంది అవుననే అంటారు. కానీ నిజానికి అంత ప్రేమ అసాధ్యమే కాదు అసహజం, అనర్థం కూడా. మోతాదుకు మించిన ప్రేమ…ప్రేమించే వ్యక్తితో పాటు ప్రేమను పొందేవారికీ మనశ్శాంతిని దూరం చేస్తుంది. దీనినే సైన్స్ పరిభాషలో ‘లవ్ అడిక్షన్’ లేదా … Read more