• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దారుణం: పోలీసు అధికారి కాల్చివేత

    మణిపుర్ మరో ఘోరం చోటుచేసుకుంది. దండకులు ఓ పోలీసు అధికారి తుపాకీతో కాల్చి చంపారు. హెలిపాడ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తోన్న సమయంలో చొరబాటుదారులు ఆయన్ను కాల్చివేశారు. గాయపడిన అసదరు పోలీస్ అధికారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఇళ్ల మధ్య నుంచి తుపాకీ దుంగులు కాల్పులు జరిపారు. అయితే ఈ హత్యకు పాల్పడినవారి కోసం పోలీసులు ఆపరేషన్‌ మొదలు పెట్టారు.

    మంత్రి ఇంటిపై బాంబు దాడి

    మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా ఇంఫాల్‌లో ఆ రాష్ట్ర మంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ ఇంటి బయట బాంబు పేలింది. శనివారం రాత్రి 10 గం.ల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చాడు. మంత్రి ఇంటిపై గ్రెనెేడ్‌ వంటి బాంబు విసిరాడు. అది పేలడంతో అక్కడ సెక్యూరిటీగా ఉన్న CRPF జవాన్, స్థానిక మహిళ గాయపడ్డారు. పేలుడు గురించి తెలుసుకున్న సీఎం బీరెన్ సింగ్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. మంత్రి భద్రత పెంచాలని ఆదేశించారు.

    MANIPUR: రూ.2500 టికెట్ రూ.25 వేలు!

    ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు, ఆందోళనలతో మారణహోమం జరుగుతోంది. ఈ క్రమంలో మణిపూర్‌లో నివసించే ఇతర ప్రాంతాలవారు స్వస్థలాలకు వచ్చేస్తున్నారు. దీంతో ఇంఫాల్ ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది. సాధారణంగా ఇంఫాల్-కోల్‌కతా విమాన టికెట్ ధర రూ.2500 ఉండేది. కానీ ప్రస్తుతం అది రూ.25 వేలకు పెరిగిపోయింది. జనం రద్దీతో ఇంఫాల్ విమానాశ్రయంలో విమానాల సంఖ్యను పెంచారు. Some hospitality at Imphal Airport from ground crew(?) distributing juice & cookies pic.twitter.com/yTT7bEiefq — Arkhay (@Rka_Zls) May … Read more

    మణిపూర్‌లో మారణహోమం: 54 మంది మృతి

    ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ ఆందోళనలతో అట్టుడుకుతోంది. హింసాత్మక ఘటనలతో రాష్ట్రం రావణకాష్టంలా తయారైంది. పోలీసులకు, భద్రతాదళాలకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఆందోళనల్లో రాష్ట్రవ్యాప్తంగా 54 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో 10000 మంది సైనికులు మోహరించారు. మోరే, గచురాచాంద్‌పూర్, కాంగ్‌పోక్పీ, కక్చింగ్ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. Vehicles being burnt by Christian Kuki's to stop the Hindu Meiteis fleeing, from their burning homes. #Manipur is … Read more

    బస్సు బోల్తా.. 15మంది మృతి

    మణిపూర్‌లో బస్సు బోల్తా పడి 15 మంది విద్యార్థులు మృతిచెందారు. నోనీ జిల్లాలో స్టడీ టూర్ కోసం వెళ్లిన విద్యార్థుల యాత్ర విషాదయాత్రగా మారింది. రెండు బస్సుల్లో విద్యార్థులు బయల్దేరారు. ఈ క్రమంలో అమ్మాయిలు ప్రయాణిస్తున్న బస్సు మూల మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడింది. దీంతో బస్సులో ఉన్న విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20మందికి గాయాలయ్యాయి. ప్రమాద స్థలానికి ఎస్డీఆర్ బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం బిరేన్‌సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. … Read more