• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉషా ఉతుప్ వెర్షన్‌లో ‘నాటునాటు’ సాంగ్‌

    RRR మూవీలోని ‘నాటునాటు’ సాంగ్‌ భారత్‌ లోనే కాదు, ప్రపంచదేశాల్లో కూడా మంచి ఆదరణ పొందింది. తాజాగా విభిన్న స్వరాలతో సంగీత ప్రియులను అరించే గాయని ఉషా ఉతుప్, నాటునాటు సాంగ్‌ను తన వర్షన్‌లో పాడి ఆకట్టుకున్నారు. ఆమె పాటిన ఈ పాట యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతుంది. ఉషా పాటను విన్న వారు కూడా ఆమె చాలా బాగా పాడగలిగారని ప్రశంసిస్తున్నారు. అయితే RRR సినిమాలో ఎంఎం కీరవాణి స్వరపరచిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు.

    కార్ల లైట్లతో ‘నాటు నాటు’ షో; వీడియో వైరల్

    [వీడియో; ](url) ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ మోర్మోగుతోంది. తాజాగా అమెరికాలోని న్యూజెర్సీలో ‘నాటు నాటు’ పాటతో టెస్లా లైట్ షో జరిగింది. ఈ పాటకు లయబద్ధంగా కార్ల లైట్లు ఆన్ చేస్తూ.. ఆఫ్ చేస్తూ ఆకట్టుకున్నారు. పాటకు సింక్ అయ్యేవిధంగా లైట్లు వేస్తూ అదరహో అనిపించారు. అక్కడున్న వారు కూడా ఈ పాటకు స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘ఆర్ఆర్ఆర్’ టీం సోషల్ మీడియాలో షేర్ చేసింది. క్షణాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. https://www.instagram.com/reel/CqABrcaDUDQ/?utm_source=ig_web_copy_link

    ‘నాటు నాటు’కు స్టెప్పులేసిన అమెరికన్‌ పోలీసులు

    [VIDEO](url): ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని నాటు నాటు పాటకు అమెరికన్‌ పోలీసులు డ్యాన్స్‌ వేసిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వీడియోను నేనావత్ జగన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ చేసిన హుక్‌ స్టెప్‌ను పోలీసులు కూడా వేయడం వీడియోలో కనిపిస్తోంది. హోళీ వేడుకల సందర్భంగా ఓ ప్రవాస భారతీయుడితో కలిసి ఇద్దరు పోలీసులు డ్యాన్స్‌ చేశారు. టెక్సాస్‌ ప్రాంతంలో ఈ దృశ్యాలను చిత్రీకరించినట్లు జగన్ తన పోస్టులో పేర్కొన్నారు. #California cops are enjoying the the #NaatuNaatu song.???? … Read more

    ‘నాటు నాటు’ ప్రాక్టీస్‌ కష్టాలను రివీల్‌ చేసిన ఎన్టీఆర్‌!

    [VIDEO](url): ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు ఎన్టీఆర్‌ హాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్బంగా ‘నాటు నాటు’ పాటకు సంబంధించి ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ‘నాటు నాటు పాటకు డ్యాన్స్‌ చేయడం చాలా కష్టమైన పని. పాట షూటింగ్‌కు వారం ముందు చాలా సార్లు ప్రాక్టీస్‌ చేశాం. షూటింగ్‌ టైంలో ఎన్నోసార్లు రిహార్సల్స్‌ చేశాం. ఆ నొప్పి ఇప్పటికీ నా కాళ్లను ఇబ్బంది పెడుతోంది’ అని ఎన్టీఆర్ అన్నారు. ఉక్రెయిన్‌లో షూటింగ్.. ఉక్రెయిన్‌లో ‘నాటు నాటు’ పాటను చిత్రీకరించారు. కీవ్‌లోని అందమైన అధ్యక్ష … Read more

    ‘నాటు నాటు’ సాంగ్‌ స్టెప్పులతో అదరగొట్టిన పాక్ నటి

    [VIDEO:](url) RRR మూవీలోని నాటు నాటు సాంగ్ పాకిస్థాన్‌లోనూ ఉర్రూతలూగిస్తోంది. తాజాగా పాక్ నటి హనియా అమిర్ ఈ పాటకు వేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన బంధువుల పెళ్లి ఫంక్షన్‌లో ఓ కుర్రాడితో కలిసి హమియా స్టెప్పులతో అదరగొట్టింది. ఆమె డ్యాన్స్‌ చూసిన నెటిజన్లు సినిమాకు ప్రాతం, భాషతో సంబంధం లేదని కామెంట్లు పెడుతున్నారు. https://www.instagram.com/p/CpBDqw2jdJN/