[VIDEO](url): ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఆస్కార్ ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు ఎన్టీఆర్ హాలీవుడ్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్బంగా ‘నాటు నాటు’ పాటకు సంబంధించి ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ‘నాటు నాటు పాటకు డ్యాన్స్ చేయడం చాలా కష్టమైన పని. పాట షూటింగ్‌కు వారం ముందు చాలా సార్లు ప్రాక్టీస్ చేశాం. షూటింగ్ టైంలో ఎన్నోసార్లు రిహార్సల్స్ చేశాం. ఆ నొప్పి ఇప్పటికీ నా కాళ్లను ఇబ్బంది పెడుతోంది’ అని ఎన్టీఆర్ అన్నారు.
ఉక్రెయిన్‌లో షూటింగ్..
ఉక్రెయిన్‌లో ‘నాటు నాటు’ పాటను చిత్రీకరించారు. కీవ్‌లోని అందమైన అధ్యక్ష భవనం ఎదుట ఈ పాట షూట్ చేశారు. అయితే, ఈ పాటకు అనుమతి లభిస్తుందో? లేదో? అన్న విషయంపై డైరెక్టర్ రాజమౌలి తొలుత సందిగ్ధంలో ఉన్నారట. అధ్యక్ష భవనం కాబట్టి కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని భావించారట. కానీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సులువుగా సాంగ్ చిత్రీకరణకు అనుమతి ఇచ్చారు. గతంలో జెలె నటుడిగా చేశారు. దీంతో తమ పని సులువైందని డైరెక్టర్ రాజమౌలి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
17 టేక్‌లు..
‘నాటు నాటు’ సాంగ్‌లో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల డ్యాన్స్ చూడటానికి రెండు కళ్లు చాలవు. ఎక్కడా లోపం లేకుండా చేసిన డ్యాన్స్ ప్రేక్షకుల్లో నాటుకుపోయింది. అయితే, ఈ వినోదం వెనుక ఎంతో కష్టం ఉంది. ఇందులో చెర్రీ, రామ్‌చరణ్ కలిసి చేసే స్టెప్పు కోసం 17 టేక్‌లు తీశాడట డైరెక్టర్ రాజమౌలి. అత్యంత కచ్చితత్వంతో ఉండాలని భావించి రాజమౌలి ఇలా 17 సార్లు వారితో చేయించాడట. అయితే, ఇందులో రెండో టేక్‌ను చివరికి ఫైనలైజ్ చేసినట్లు చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
అవార్డులు..
‘నాటు నాటు’ పాటకు చరణ్, ఎన్టీఆర్ పడిన కష్టం ఊరికే పోలేదు. ఇందులో వీరి డ్యాన్స్‌కి ప్రశంసలు దక్కాయి. అవార్డులు క్యూ కడుతున్నాయి. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అకాడమీ అవార్డుకు కూడా ఈ సాంగ్ నామినేట్ అయింది. ఆస్కార్ అంతటి ప్రాధాన్యమున్న ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డును సైతం ‘నాటు నాటు’ గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అంతర్జాతీయ చిత్రాలతో పోటీ పడి పురస్కారం దక్కించుకుంది. ఇప్పుడు ఇదే విభాగంలో ఆస్కార్‌కు పోటీ పడుతోంది. ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు దక్కితే ఆస్కార్ వచ్చినట్లేనన్న ప్రచారం వాడుకలో ఉంది. దీంతో ఈ సారి ‘నాటు నాటు’కు ఆస్కార్ అవార్డు పక్కా అంటూ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
స్టేజిపై లైవ్ పర్ఫార్మెన్స్..
‘నాటు నాటు’ పాటను సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ ఆలపించారు. దీంతో ఆస్కార్ వేడుకపై ‘లైవ్ పర్ఫార్మెన్స్’ ఇవ్వాలని అకాడమీ నిర్వాహకులు ఆహ్వానం పంపించారు. మార్చి 12న లాస్‌ఏంజెలెస్‌లో జరిగే ఆస్కార్ వేదికపై 2.30 నిమిషాల పాటు స్టేజిపై లైవ్‌లో ఈ పాటను పాడనున్నారు. ఇందుకోసం సింగర్ రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ అమెరికా చేరుకున్నారు.