Tecno మొబైల్ కంపెనీ తమ బ్రాండ్ నుంచి కొత్త మెుబైల్ సిరీస్‌ను ప్రకటించింది. Tecno Camon 20 పేరుతో స్మార్ట్ ఫోన్స్‌ను భారత్‌లో లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించింది. గతంలో తీసుకొచ్చిన ‘Tecno Camon 19 series’ కు అనుసంధానంగా తాజా మోడల్‌ను పరిచయం చేశారు. Tecno Camon 20, Camon 20 Pro 5G, Camon 20 Premier 5G అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు ఏంటీ? ఇందులో ఎలాంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి? ఇప్పుడు పరిశీలిద్దాం.
ఫోన్ డిస్‌ప్లే
Tecno Camon 20 Series స్మార్ట్‌ఫోన్స్‌ను 6.67 అంగుళాల full-HD + AMOLED స్క్రీన్‌తో తీసుకొచ్చారు. ఇవి 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉన్నాయి. Tecno Camon 20 వేరియంట్ మోడల్ 12nm MediaTek Helio G85 ప్రొసెసర్‌ను కలిగి ఉంది. ప్రొ మోడల్స్‌లో మాత్రం 6nm MediaTek Dimensity 8050 చిప్‌సెట్‌తో పనిచేస్తాయి.
స్టోరేజ్ సామర్థ్యం
Tecno Camon 20, Tecno Camon 20 Pro 5G వేరియంట్స్‌ను 8GB RAM / 256GB స్టోరేజీ సామర్థ్యంతో తీసుకొచ్చారు. Camon 20 Premier 5G మోడల్ మాత్రం 8GB RAM / 512 స్టోరేజీతో అందుబాటులోకి తెచ్చారు.
బిగ్ బ్యాటరీ
Tecno Camon 20 సిరీస్ 5000mAh బ్యాటరీ కలిగి ఉంది. టెక్నో కెమాన్ 20, 20 Proకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుండగా.. 20 ప్రీమియర్‌కు అది 44వాట్గా ఉంది.
కెమెరా క్వాలిటీ
Tecno Camon 20 మోడల్‌లో 64MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌తో పాటు QVGA tertiary కెమెరాను అమర్చారు. 20 ప్రో 5జీ మోడల్‌లో 64MP ప్రైమరీ, 2MP సెకండరీతో పాటు బొకేహ్ కెమెరా లెన్స్ ఇచ్చారు. ప్రీమియం 5G వేరియంట్లో 50MP ప్రైమరీ, 108MP అల్ట్రా వైడ్, 2MP బొకేహ్ సెన్సార్లు ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ఈ మూడు గ్యాడ్జెట్స్‌కు 32MP కెమెరాను ఫిక్స్ చేశారు.
కలర్స్
Tecno Camon 20 సిరీస్‌ను మూడు రంగుల్లో విక్రయించనున్నారు. గ్లేసియర్ గ్లో, ప్రీడాన్ బ్లాక్ సెరినిటీ బ్లూ కలర్ ఆప్షన్స్‌గా ఉన్నాయి. నచ్చిన రంగులో మీ ఫేవరెట్ మోడల్‌ను కొనుగోలు చేయవచ్చు.
ధర ఎంతంటే?
Tecno Camon 20 మోడల్ ధర రూ. 14,999గా ఉంది. నేటి(May 29) నుంచి ఇది అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది. ఇక 20 ప్రో 5జీ ధరలు రూ. 19,999 – రూ. 21,999గా ఉన్నాయి. ఇవి జూన్ రెండో వారంలో అందుబాటులోకి వస్తాయి. 20 ప్రీమియర్ 5G ధరతో పాటు ఇతర వివరాలు జూన్ 3వ వారంలో ప్రకటించనున్నట్లు Tecno కంపెనీ ప్రకటించింది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!