తెలుగు సినిమాల్లో రొమాంటిక్ చిత్రాలది ప్రత్యేక స్థానం. యూత్ ఫోకస్ మొత్తం ఇలాంటి సినిమాలపైనే ఉంటుంది. దీంతో వీరిని ఆకర్షించడానికి మేకర్లు పనిగా రొమాంటిక్ సన్నివేశాలను పెడుతుంటారు. కొన్నిసార్లు ఈ జానరే కథాంశంగా తీసుకుని సినిమాలు తీస్తుంటారు. ఇలా ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే, గీత దాటే వరకు రొమాన్స్‌ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు. కానీ, ఒక్కోసారి కొన్ని సినిమాలు డోస్ పెంచుతున్నాయి. ఇలాంటి చిత్రాలను కుటుంబ సభ్యులతో కలిసి అస్సలు చూడలేం. ఒంటరిగా ఉన్నప్పుడు చూసేందుకు ఇష్టపడతాం. అలాంటి సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.
ఇద్దరు వ్యక్తులు తమలోని లైంగిక సామర్థ్యాలను నిరూపించుకునేందుకు ఏం చేశారనే అంశాన్ని ఇందులో చూపించారు. ఇందులో రొమాన్స్ డోస్ కాస్త ఎక్కువే. వీర్నాల రామకృష్ణా రావు నటించి డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమాను అస్సలు చూడలేం. అమెజాన్ ప్రైమ్ ప్లాట్‌ఫాంలో సినిమా అందుబాటులో ఉంది. 2021లో విడుదలైంది.
టెంప్ట్ రాజా
ఇప్పుడు కాక ఇంకెప్పుడు
సినిమా టైటిల్‌ని బట్టే విషయం అర్థమైపోతుంది. ఇందులో హీరో, హీరోయిన్ రొమాంటిక్ సన్నివేశాల్లో తెగ రెచ్చిపోతారు. చిన్నప్పటి నుంచి తమలో అణచివేయబడిన కోరికలను రొమాంటిక్ వేలో తీర్చుకుంటుంటారు. ఒక అమ్మాయి, అబ్బాయిని స్వేచ్ఛగా ఎదగనీయకుండా ఇంటికే పరిమితం చేస్తే ఇలా ఉండే ప్రమాదం ఉంటుందని చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ యుగంధర్. 2021లో విడుదలైన ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఏడు చేపల కథ
ఆడవారిని చూస్తేనే బలహీనతగా ఉండే వ్యక్తిని టెంప్ట్ చేస్తే ఏం జరుగుతుంది? అనే విషయం ఆధారంగా సినిమా తెరకెక్కింది. ఈ అడల్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ని సామ్ జె చైతన్య తెరకెక్కించాడు. అభిషేక్ రెడ్డి, భాను శ్రీ, ఆయేషా సింగ్, మేఘన చౌదరి తదితరులు కీలక పాత్ర పోషించారు. ఇందులో రొమాన్స్ ఘాటు ఎక్కువే. 2019లో ఈ సినిమా విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
డేంజరస్
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తీసిన చిత్రమిది. డేంజరస్ ‘మా ఇష్టం’ అనే టైటిల్‌తో ఇది విడుదలైంది. ఇద్దరు లెస్బియన్ల మధ్య లవ్ స్టోరీని ఇందులో చూపించాడు వర్మ. రొమాంటిక్ సన్నివేశాలు శృతి మించేలా ఉంటాయి. అందుకే ఫ్యామిలీతో ఈ సినిమాను చూడలేం. అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించారు. 2022లో విడుదలైంది.
చితక్కొటుడు2
ఇదొక అడల్ట్ కామెడీ ఎంటర్‌టైనర్. రెండు జంటలు బ్యాంకాక్‌కి వెళ్లి ఎంజాయ్ చేద్దామని అనుకుంటాయి. కానీ, అనూహ్యంగా వారికి ఓ కామిని దెయ్యం కనపడి ఇద్దరి మగవారితో శృంగారం చేయాలని డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు వేడిని పుట్టిస్తాయి. ఈ సినిమా 2020లో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
హై ఫయ్
కొరియోగ్రఫర్ అమ్మ రాజశేఖర్ డైరెక్ట్ చేశాడీ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్. మన్నారా చోప్రా, సుధీర్ ఛాయా తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలోని కొన్ని సీన్లు సెగలు రేపుతాయి. సెన్సార్ బోర్డు చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. 2022లో విడుదలైంది.
బాబు బాగా బిజీ
శ్రీనివాస్ అవసరాల, శ్రీముఖి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ని నవీన్ మేడారం తెరకెక్కించాడు. 2017లో ఈ సినిమా విడుదలైంది.
హనీ ట్రాప్
సినిమా కథ వేరే అయినప్పటికీ రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. పి.సునీల్ కుమార్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. హనీ ట్రాప్ కథాంశం ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. 2021లో సినిమా విడుదలైంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం