వీకెండ్ అంటే సినిమా ప్రియులకు పెద్ద పండగే అని చెప్పవచ్చు. ఓటీటీల్లో కొత్త సినిమాలు రిలీజై మంచి వినోదాన్ని పంచుతుంటాయి. అందుకే వారంతం కోసం మూవీ లవర్స్ వీక్ ప్రారంభం నుంచే తెగ ఎదురు చూస్తుంటారు. ఇక ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు కొత్త చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఎంచక్కా ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? వాటి ప్లాట్ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ది గోట్ (The Greatest Of All Time)
విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ది గోట్’ (The Greatest Of All Time). వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ మూవీ నేటి నుంచి ఓటీటీలోకి వచ్చింది. అక్టోబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ప్రసారం అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాను వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. ఓ మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లి కొడుకును పొగొట్టుకుంటాడు. దీంతో భార్య అను (స్నేహా) అతడ్ని దూరం పెడుతుంది. కొన్నేళ్ల తర్వాత మాస్కోకు వెళ్లిన గాంధీకి చనిపోయాడనుకుంటున్న కొడుకు జీవన్ (విజయ్) కనిపిస్తాడు. సంతోషంగా ఇంటికి తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీకి సంబంధించిన వారు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. ఈ హత్యలకు కారణం ఎవరు? చనిపోయిన జీవన్ ఎలా తిరిగొచ్చాడు?’ అన్నది స్టోరీ.
35 చిన్న కథ కాదు (35 Chinna katha kaadu)
ప్రముఖ నటి నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం ’35 చిన్న కథ కాదు’. ఎమోషనల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రానికి నందకిషోర్ ఇమాని దర్శకత్వం వహించాడు. ఇందులో ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ, గౌతమి కీలకపాత్రలు పోషించారు. సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదలైన మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అక్టోబర్ 2 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘ప్రసాద్ (విశ్వదేవ్), సరస్వతి (నివేదా థామస్) మధ్యతరగతి కుటుంబానికి చెందిన భార్య భర్తలు. పెద్ద కుమారుడు అరుణ్ స్కూల్లో ఆరో తరగతి చదువుతుంటాడు. మ్యాథ్స్‌లో చాలా వీక్. దాంతో లెక్కల మాస్టారు చాణక్య (ప్రియదర్శి) అరుణ్‌కి జీరో అని పేరు పెడతాడు. పరీక్షల్లో ఫెయిల్ కూడా చేస్తాడు. అరుణ్ స్కూల్‌లో ఉండాలంటే లెక్కల్లో కనీసం 35 మార్కులు సాధించాల్సిందేనని షరతు విధిస్తాడు. ఆ పరిస్థితుల్లో అరుణ్ ఏం చేశాడు? అతడికి తల్లి సరస్వతి ఎలా సాయం చేసింది?’ అన్నది స్టోరీ.
భలే ఉన్నాడే (Bhale Unnade)
రాజ్‌తరుణ్ (Raj tarun) కథానాయకుడిగా జె.శివసాయివర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భలే ఉన్నాడే’ (Bhale Unnade). మనీషా కంద్కూర్ కథానాయిక. సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు స్ట్రీమింగ్‌కు వచ్చింది. లుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో (ETV Win) అక్టోబరు 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్లాట్ ఏంటంటే ‘రాధ (రాజ్‌తరుణ్) చాలా సౌమ్యుడు. వైజాగ్‌లో శారీ డ్రాపర్‌గా పనిచేస్తూ తల్లికి హెల్ప్ చేస్తుంటాడు. తన తల్లితో పాటు బ్యాంక్‌లో పనిచేసే మనీషాకు లంచ్ బాక్స్ ద్వారా దగ్గరవుతాడు. ఈ క్రమంలో వారిద్దరు ఒకరినొకరు ఇష్టబడి నిశ్చితార్థం వరకూ వెళ్తారు. అయితే రాధ పెళ్లికి పనికొస్తాడా? లేదా? అన్న సందేహాం కృష్ణకు కలుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? రాధకు కృష్ణ పెట్టిన పరీక్ష ఏంటి?’ అన్నది స్టోరీ.
CTRL (కంట్రోల్ )
అనన్య పాండే (Ananya Panday) సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాత్రలో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా CTRL (కంట్రోల్ అని కూడా పిలవచ్చు). విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించిన ఈ సినిమాఅక్టోబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ, సోషల్ మీడియా అంశాలను కథాంశంగా చేసుకొని ఈ మూవీని రూపొందించారు.
కళింగ (Kalinga)
ధృువ వాయు హీరోగా నటించిన రీసెంట్ చిత్రం ‘కళింగ‘. అతడి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రగ్యా నయన్ హీరోయిన్‌గా చేసింది. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హారర్ ఎలిమెంట్స్‌కు ఫాంటసీ అంశాలను జోడించి దర్శకుడు ఈ మూవీని రూపొందించారు. సెప్టెంబర్ 13న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఆహా వేదికగా సెప్టెంబర్ 2 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘కళింగ ఊరు పొలిమేర దాటి అడవిలోకి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి రారు. ఆ అడవిలో కళింగ రాజు సంపద ఉందని, దానికి ఓ దుష్టశక్తి కాపలాకాస్తుందని ప్రజల నమ్మకం. తన ప్రేమను గెలిపించుకోవడం కోసం గ్రామానికి చెందిన లింగా (ధ్రువవాయు) ఫ్రెండ్స్‌తో కలిసి అడవిలోకి వెళ్తాడు. అక్కడ అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? కళింగ రాజు మిస్టరీ ఏంటి? లింగా ప్రాణాలతో బయటపడ్డాడా? లేదా?’ అన్నది స్టోరీ.
క్రేజీ రొమాన్స్ (Crazy Romance)
ఓటీటీల్లో కొరియన్ సినిమాలకు క్రేజ్ విపరీతంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ‘క్రేజీ రొమాన్స్’ మూవీ ఇప్పుడు ఇండియాలో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీకి కిమ్ హన్ గ్యుల్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో ఈ మూవీని వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘లీ జే హూన్‌కు లవ్ బ్రేకప్ అయినా ప్రేయసిని మర్చిపోలేక పోతుంటాడు. ఈ క్రమంలో అతడు పనిచేసే ఆఫీస్‍లో సన్ యంగ్ కొత్తగా జాయిన్ అవుతుంది. ఆమె కూడా బాయ్‍ఫ్రెండ్‍తో గొడవ పడి విడిపోయి ఉంటుంది. వీరిద్దరికి పరిచయం ఏర్పడి ప్రేమలో పడతారు. అయితే వారి మధ్య కూడా విభేదాలు వస్తాయి. ప్రేమలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటిని ఎలా పరిష్కరించుకున్నారు? అన్నది స్టోరీ.
వెన్ ఈవిల్ లర్క్స్ (When Evil Lurks)
ఓటీటీలో హారర్ సినిమా చూడాలని అనుకుంటున్న వారికి కొత్తగా ఓ మూవీ అందుబాటులోకి వచ్చేసింది. స్పానిష్ చిత్రం ‘వెన్ ఈవిల్ లర్క్స్’ తెలుగు డబ్బింగ్‍లో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ 1 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. స్టోరీ ఏంటంటే ‘పెడ్రో (రోడ్రిగ్స్), జైమ్ (సోలోమోన్) ఓ మారుమూల గ్రామంలో జీవిస్తుంటారు. అయితే ఓ రోజు దెయ్యం పుడుతోందని గుర్తిస్తారు. దీంతో దెయ్యం ఉద్భవిస్తున్న బాడీని నాశనం చేయాలని అనుకుంటారు. ఈ ప్రయత్నం చాలా సమస్యలకు దారి తీస్తుంది. ఆ సవాళ్ల నుంచి వారు ఎలా బయటపడ్డారు?’ అన్నది స్టోరీ.
బ్లింక్ (Blink)
‘దసర’ ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా చేసిన కన్నడ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘బ్లింక్‘. మేలో అమెజాన్ ప్రైమ్ వేదికగా కన్నడలో ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. తాజాగా తెలుగు వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఆహా వేదికగా సెప్టెంబర్ 30 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో డిఫరెంట్ నేరేషన్‍తో వచ్చిన ఈ మూవీ బాగా పాపులర్ అయ్యింది. ప్లాట్ ఏంటంటే ‘పీజీలో ఫెయిలైన అపూర్వ (దీక్షిత్ శెట్టి) పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంటాడు. స్వప్న(మందాత)తో ప్రేమలో పడతాడు. తండ్రి గురించి తెలిసిన ఓ సీక్రెట్ అపూర్వ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. కనురెప్పల్ని మూయడం ద్వారా అతడు టైమ్ ట్రావెల్‌లో ముందుకు, వెనక్కి వెళ్తుంటాడు. ఇలా జరగడానికి కారణం ఏంటి?’ అన్నది స్టోరీ.
డెడ్‌పూల్ అండ్ వుల్వరైన్ (Deadpool & Wolverine)
ఇటీవల విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ‘డెడ్‌పూల్ అండ్ వుల్వరైన్’ ఓటీటీలోకి వచ్చేసింది. అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో ర్యాన్ రేనాల్డ్స్, హ్యూ జాక్‌మన్ హీరోలుగా నటించారు. డెడ్‌పూల్, వుల్వరైన్ పాత్రలను వారు పోషించారు. ప్లాట్ ఏంటంటే ‘డెడ్‌పూల్ అలియాస్ వేడ్ విల్సన్ కార్ల సేల్స్ మ్యాన్‌గా పని చేస్తూ సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఓ రోజు అతడ్ని టైమ్ వేరియెన్స్ అథారిటీని నిర్వహించే పారాడాక్స్ మనుషులు ఎత్తుకెళ్తారు. ఎర్త్ 616కు తీసుకెళ్తారు. అక్కడకు వెళ్లిన డెడ్‌పూల్‌కు వాల్వెరైన్ సాయం అవసరం అవుతుంది. అసలు ఎర్త్ 616 అంటే ఏంటి? డెడ్‌పూల్‌ను ఎందుకు అక్కడికి తీసుకెళ్లారు? అక్కడ డెడ్‌పూల్ – వాల్వెరైన్ చేసిన సాహసాలు ఏంటి?’ అన్నది స్టోరీ.
సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram)
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇటీవల ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఎస్.జె.సూర్య విలన్‌గా ఆకట్టుకున్న ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ నటించారు. సాయికుమార్ అభిరామి, అదితి బాలన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్లాట్ ఏంటంటే ‘సూర్య (నాని) ఎల్‌ఐసీ ఎజెంట్‌గా పనిచేస్తుంటాడు. కళ్లెదుట అన్యాయం జరిగితే అసలు సహించలేడు. తన కోపాన్ని ప్రదర్శించడానికి శనివారాన్ని సూర్య ఎంచుకుంటాడు. మరోవైపు సోకులపాలెం ప్రాంతంలోని ప్రజలు కష్టాలు అనుభవిస్తుంటారు. అక్కడ అరాచకం చేస్తున్న పోలీసు అధికారిని సూర్య ఎలా ఎదిరించాడు? అక్కడి వారికి ఏ విధంగా అండగా నిలిచాడు?’ అన్నది స్టోరీ.
డిమోంటి కాలనీ 2 (Demonte Colony 2)
హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘డిమోంటి కాలనీ 2’ (Demonte Colony 2) ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అరుళ్ నిధి (Arulnithi), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తు ఈ సినిమాను తెరకెక్కించారు. ఆగస్టులో ప్రేక్షకులను థ్రిల్ చేసిన ఈ హారర్ థ్రిల్లర్ ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 27 నుంచి ‘జీ 5’లో తెలుగు, తమిళ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 2015లో వచ్చిన ‘డిమోంటి కాలనీ’కి సీక్వెల్‌గా ఇది రూపొందింది. ప్లాట్ ఏంటంటే ‘డెబీ (ప్రియా భవానీ శంకర్) భర్త శ్యామ్ అనుమానస్పదంగా సూసైడ్ చేసుకొని చనిపోతాడు. ఓ పుస్తకం చదవడం వల్లే అతడు చనిపోయినట్లు ఆమెకు తెలుస్తుంది. తన భర్తలాగే ఆ బుక్ చదివిన మరికొందరు కూడా సూసైడ్ చేసుకున్నట్లు గ్రహిస్తుంది. ఈ క్రమంలోనే శ్రీనివాస్ (అరుళ్ నిధి) అతడి కవల సోదరుడు కూడా బుక్ చదువుతారు. ఇది గ్రహించిన డెబీ వారిని ఎలా కాపాడింది? ఇంతకీ ఆ బుక్ వెనకున్న దుష్ట శక్తి ఏంటి?’ అన్నది స్టోరీ.
ప్రతినిధి 2 (Prathinidhi 2)
నారా రోహిత్ (Nara Rohit) హీరోగా రాజకీయం నేపథ్యంలో రూపొందిన సినిమా ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2). ఆయన గతంలో నటించిన ‘ప్రతినిధి’కి సీక్వెల్‌గా పాత్రికేయుడు మూర్తి దేవప్తపు తెరకెక్కించారు. మేలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ గతవారం ఓటీటీలోకి వచ్చింది. సెప్టెంబర్ 27 (Prathinidhi 2 OTT Release) నుంచి ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్లాట్ ఏంటంటే ‘చేతన్ (నారా రోహిత్) నిజాయతీ గల జర్నలిస్టు. NCC ఛానల్ సీఈవోగా ఉంటూ రాజకీయ నాయకుల అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తుంటాడు. ఈ క్రమంలో సీఎంపై హత్యాయత్నం జరుగుతుంది. దాని వెనక ఉంది ఎవరు? సీబీఐ పరిశోధనలో తేలిందేంటి? రాజకీయ వ్యవస్థలపై నారా రోహిత్ చేసిన పోరాటం ఏంటి?’ అన్నది స్టోరీ.
Celebrities Featured Articles Telugu Movies
Chiranjeevi: ‘టాలెంట్ ఒక్కటే సరిపోదు.. ప్రవర్తన ముఖ్యం’.. బన్నీకి చిరు ఇండైరెక్ట్ పంచ్!