ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. మే 29 నుంచి జూన్ 4వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అయితే ఈ వీక్ అన్నీ చిన్న సినిమాలు రిలీజ్ కావడం విశేషం. అవేంటో ఈ కథనంలో చూద్దాం.
థియేటర్స్‌లో రిలీజయ్యే చిత్రాలు
అహింస
ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు తనయుడు, రానా సోదరుడు అభిరామ్ హీరోగా ‘అహింస’ సినిమా తెరకెక్కింది. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా అభిరామ్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. ప్రేమ, యాక్షన్ అంశాల మేళవింపుతో ఈ సినిమా రూపొందింది. జూన్ 2న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఆర్పీ పట్నాయక్ స్వరాలు అందించిన ఈ సినిమాలో రజత్ బేడి, గీతిక, సదా, రవికాలే, మనోజ్ టైగర్ తదితరులు నటించారు.
ఐక్యూ
సాయిచరణ్, పల్లవి, ట్రాన్సీ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘ఐక్యూ’. పవర్ ఆఫ్ స్టూడెంట్ పేరుతో ఈ సినిమాను శ్రీనివాస్ జీఎల్‌బి తెరకెక్కించాడు. సుమన్, సత్య ప్రకాష్, బెనర్జీ వంటి దిగ్గజ నటులు సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కూడా జూన్ 2వ తేదీనే ప్రేక్షకులను పలకరించనుంది. ఇది మేధస్సుకు సంబంధించిన చిత్రమని, మంచి ఐక్యూ ఉన్న అమ్మాయిని హీరో ఎలా కాపాడాడన్నది సినిమా కథ అని చిత్ర బృందం చెబుతోంది.
నేను స్టూడెంట్ సార్!
బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నేను స్టూడెంట్ సార్!’. ఈ సినిమా కూడా ఈ వారమే రిలీజ్ కానుంది. జూన్ 2న ప్రేక్షకులను పలకరించనుంది. ఈ మూవీని రాఖీ ఉప్పలపాటి తెరకెక్కించారు. సతీష్ వర్మ నిర్మించారు. ఈ చిత్రాన్ని యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించిన్నట్లు ప్రచార చిత్రాలను బట్టి తెలుస్తోంది. నేను స్టూడెంట్ సార్! సినిమాకు మహతి స్వరసాగర్ స్వరాలు సమకూర్చారు.
పరేషాన్
తిరువీర్, పావని కరణం జంటగా నటించిన కామెడీ మూవీ ‘పరేషాన్’. ఈ సినిమాకు రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహించారు. జూన్ 2న సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సినిమా కొత్త రకమైన కామెడీని పరిచయం చేస్తుందని చిత్ర బృందం తెలిపింది.
చక్రవ్యూహం
విలక్షణ నటుడు అజయ్ పోలీసు ఆఫీసర్‌గా చెట్కూరి మధుసూదన్ దర్శకత్వంలో చక్రవ్యూహం సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కూడా జూన్ 2 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. మర్డర్ మిస్టరీతో కూడిన క్రైమ్ థ్రిల్లర్‌గా సినిమాను రూపొందించినట్లు చిత్ర బృందం చెప్పింది. కాగా ఈ సినిమాలో జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది, ఊర్వశి పరదేశి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు / వెబ్ సిరీస్‌లు
Title | Category | Language | Platform | Release Date |
Sulaikha Manzil | Movie | Malayalam | Disney+ Hotstar | May 30 |
Vishwak | Movie | Telugu | Zee5 | June 2 |
Asur season 2 | Series | Hindi | Jio Cinema | June 1 |
Fake Profile | Series | English | Netflix | May 31 |
A Beautiful Life | Movie | English | Netflix | June 1 |
New Amsterdam | Series | English | Netflix | June 1 |
Infinity Storm | Movie | English | Netflix | June 1 |
Scoop | Series | Hindi | Netflix | June 2 |
Manifest | Series | English | Netflix | June 2 |
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!