సీనియర్ హీరోయిన్ మీనా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు బాలివుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే క్రష్ ఉండేదని, అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని అమ్మతో చెప్పానని మీనా అన్నారు. హృతిక్ పెళ్లి రోజు తన గుండె పగిలిందని మీనా చెప్పుకొచ్చారు. అప్పటికి ఇంకా తనకు పెళ్లి కాలేదన్నారు.
తెలుగు, తమిళ్ భాషల్లో సూపర్ హిట్ చిత్రాలతో వెలుగు వెలిగిన మీనా బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి విద్యాసాగర్‌ను 2009లో వివాహం చేసుకున్నారు. ఊపరితిత్తుల సమస్యతో విద్యాసాగర్ గతేడాది జూన్‌లో మరణించారు. పోస్ట్ కోవిడ్ సమస్యల వల్లే చనిపోయాడనే వార్తలు వచ్చాయి.
మీనాకు ఓ కుమార్తె ఉంది. ఆమె పేరు నైనికా విద్యాసాగర్. ఈ చిన్నారి దళపతి విజయ్ నటించిన తేరి ( తెలుగులో పోలీసోడు) సినిమాలో నటించింది. అందులో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది.
మీనా సినిమాల్లోకి అడుగుపెట్టి 40 సంవత్సరాలు అయ్యింది. బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది ఈ హీరోయిన్. తన కెరీర్ 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చెన్నైలో మీనా 40 పేరుతో వేడుక నిర్వహించారు.
ఈ కార్యక్రంలో రజినీకాంత్, సుహాసిని, రోజా వంటి ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతూ మీనా పోస్ట్ పెట్టారు. తన జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాల్లో ఇదొకటన్నారు మీనా.
సీతారామ్యగారి మనువరాలు, చంటి, ముఠామేస్త్రి, అబ్బాయిగారు, అల్లరి అల్లుడు, సూర్యవంశం, దృశ్యం, దృశ్యం 2 వంటి చిత్రాలతో మీనాకు నటిగా మంచి గుర్తింపు వచ్చింది.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: నా భర్త కోపరేట్ చేయట్లేదు.. ఆనసూయ హాట్ కామెంట్స్ వైరల్