తన పట్ల లా విద్యార్థి ప్రవర్తించిన తీరు తనను బాధించిందని హీరోయిన్ అపర్ణా బాలమురళి ఆవేదన వ్యక్తం చేసింది.‘‘అతడి ప్రవర్తన అనుచితంగా ఉంది. న్యాయ విద్యార్థి అయ్యి ఉండి ఒక మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకడం నేరమని తెలియదా?. ఆ విద్యార్థిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. అంత సమయం కూడా నా దగ్గర లేదు. అతడి చర్యలను ఖండిస్తున్నా.’’ అంటూ వాపోయింది. కాగా అపర్ణా పట్ల ఓ లా విద్యార్థి [అనుచితం](url)గా ప్రవర్తించిన విషయం తెలిసిందే.