వ్యభిచారం నడుపుతోందనే ఆరోపణలపై నటి, క్యాస్టింగ్ డైరెక్టర్ ఆర్తి మిట్టల్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని ఓషివారాలో ఉన్న ఆరాధన అపార్ట్‌మెంట్లో ఆమె వ్యభిచారం నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందగా.. రెయిడ్ చేసి ఇద్దరు మోడల్స్‌ను రక్షించారు. ఆర్తిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా ఆర్తి సినిమా ఛాన్స్‌ల పేరుతో మోడళ్లను కలసి వారికి డబ్బు ఆశ చూపి వ్యభిచారంలోకి దింపుతోంది. ఆర్తికి ఇన్‌స్టాలో లక్ష మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం.
ఈ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేసేందుకు పోలీసులు పక్కా స్కెచ్ వేశారు. పోలీసు అధికారుల్లో ఇద్దరు కస్టమర్లుగా ఆర్తీని సంప్రదించారు. వారికి అమ్మాయిలు కావాలని అడగ్గా… ఫోటోలు పంపించింది. రూ. 60 వేలు డిమాండ్ చేసింది. ఇద్దరిని గోరేగావ్‌లోని హోటల్‌కు పంపిస్తానని చెప్పింది ఆర్తి. అనుకున్నట్లుగానేే మోడల్స్‌తో కలిసి హోటల్‌లో బుక్ చేసి రూమ్‌కు వచ్చారు. ఆర్తీ వారికి కండోమ్స్ కూడా ఇచ్చి పంపించింది. ఇవన్నీ రికార్డ్ చేసిన పోలీసులు… హోటల్‌కు వెళ్లగానే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
క్యాస్టింగ్ కౌచ్ డైరెక్టర్‌గా ఉన్న ఆర్తీ అవకాశాల పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. మోడల్స్‌కు నెలకి రూ. 15000 ఇస్తానని చెప్పి ముంబయి తీసుకువచ్చింది. ఇలా సినిమా ఛాన్స్‌ల పేరుతో తీసుకువచ్చి వ్యభిచారకూపంలోకి దింపుతోంది. ఆర్తి మిట్టల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 370తో పాటు మహిళల అక్రమ రవాణాకు సంబంధించిన ఇతర సెక్షన్లు పెట్టారు.
ఆర్తీ మిట్టల్ క్యాస్టింగ్ కౌచ్ పనులు చూస్తుండటంతో పాాటు సీరియల్స్‌లోనూ నటించింది. టెలివిజన్ షో అప్నాపన్‌లో రాజశ్రీ ఠాకూర్‌తో కలిసి పనిచేసింది. అరెస్ట్‌కు ముందు ఆమె హీరో మాధవన్‌తో కలిసి ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని తెలుస్తోంది.