ఈ వారం పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. జులై 24-30 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
బ్రో
అగ్ర కథానాయకుడు పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’ (BRO). సముద్రఖని దర్శకుడు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ మూవీకి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ‘బ్రో’ చిత్రం శుక్రవారం (జులై 28) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రలో పవన్ ఇందులో నటించారు. కాలదేవుడి అవతారంలో ఆయన కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కేతికశర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్, బ్రహ్మానందం, సముద్రఖని, రోహిణి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
స్లమ్ డాగ్ హస్బెండ్
నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌రావు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హస్బెండ్’(slumdog husband). ప్రణవి మానుకొండ కథానాయిక. ఇందులో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రలు పోషించారు. ఏ.ఆర్.శ్రీధర్ దర్శకత్వం వహించాడు. శనివారం (జులై 29) ఈ చిత్రం రిలీజ్ కానుంది. జాతకంలో దోషం ఉన్న ఓ యువకుడు కుక్కను పెళ్లి చేసుకోవడంతో అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఆ పెళ్లి వల్ల ఎలాంటి కష్టాలు పడ్డాడు? అనేది అసలు కథ. ఇందులో రాకీ అనే కుక్క ముఖ్య పాత్రలో నటించింది. దీనికి ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిషోర్ వాయిస్ ఓవర్ అందించారు.
రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ
బాలీవుడ్ కథానాయకుడు రణవీర్ సింగ్ (Ranveer Singh), అలియా భట్ (Alia Bhatt) జంటగా నటిస్తున్న చిత్రం ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ (Rocky Aur Rani Ki Prem Kahani). కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. రాకీ, రాణీల మధ్య ప్రేమకథను ఈ సినిమాలో చూపించున్నారు. జులై 28న ఈ సినిమా విడుదల కానుంది.
ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
నాయకుడు
ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) హీరోగా నటించిన లేటెస్ట్ కోలీవుడ్ హిట్ మూవీ ‘నాయకుడు’ ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. గురువారం (జూలై 27) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) స్ట్రీమింగ్ కానుంది. రాజకీయాల్లోని అసమానాతల్ని చర్చిస్తూ తెరకెక్కిన నాయకుడు సినిమాలో మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్(Fahadh Faasil) విలన్‌గా నటించాడు. సీనియర్ కమెడియన్ వడివేలు తన పంథాకు భిన్నంగా ఎమ్మెల్యేగా సీరియల్ రోల్‌లో కనిపించాడు. కీర్తిసురేష్ కథానాయికగా నటించింది.
Title | Category | Language | Platform | Release Date |
Dream | Movie | English | Netflix | July 25 |
Paradise | Movie | English | Netflix | July 27 |
Happiness for beginners | Movie | English | Netflix | July 27 |
How to become a cult leader | Series | English | Netflix | July 28 |
Aashiqana | Series | Hindi | Disney+Hotstar | July 24 |
Twisted metal | Series | English | SonyLIV | July 28 |
Kaalkoot | Movie | Hindi | JioCinema | July 23 |
Transformers: Rise of the Beasts | Movie | English | Book My Show | July 26 |
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం