• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • This Week OTT Releases Telugu: ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే!

    ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ (Pushpa 2) హవా నడుస్తోంది. గత వారం రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. అది ఈ వారం కూడా కొనసాగే ఛాన్స్ ఉంది. దీంతో పెద్ద హీరోల చిత్రాలు ఈ వారం బాక్సాఫీస్‌ బరిలో నిలిచేందుకు సాహసించడం లేదు. దీంతో చిన్న సినిమాలు ఈ వీక్ (OTT Releases Telugu) సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్దమవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 

    థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు

    మిస్‌ యు (Miss You)

    ప్రముఖ నటుడు సిద్ధార్థ్ (siddharth), కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ జంటగా నటించిన తాజాగా చిత్రం ‘మిస్‌ యు’ (Miss You). యు.ఎన్‌.రాజశేఖర్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని 7మైల్స్‌ పర్‌ సెకండ్‌ సంస్థ నిర్మించింది. డిసెంబర్‌ 13న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఒక యునిక్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు తమ చిత్రం తప్పక నచ్చుతుందని పేర్కొంది. 

    ప్రణయగోదారి (Pranaya Godari)

    సదన్‌ హీరోగా, ప్రియాంక ప్రసాద్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ప్రణయగోదారి’ (Pranaya Godari). ఈ చిత్రానికి పి.ఎల్‌.విఘ్నేష్‌ దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు సాయి కుమార్‌ కీలక పాత్ర పోషించారు. పారమళ్ల లింగయ్య నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం డిసెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గ్రామీణ నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రం ప్రతీ ఒక్కరికి తప్పక నచ్చుతుందని మూవీ టీమ్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. 

    ఫియర్‌ (Fear)

    ప్రముఖ నటి వేదిక (Vedika) లీడ్‌ రోల్‌లో నటించిన హారర్‌ చిత్రం ‘ఫియర్‌’ (Fear). డా. హరిత గోగినేని దర్శకత్వం వహించారు. A.R. అభి నిర్మాత. ఈ మూవీ డిసెంబర్‌ 14న విడుదల కాబోతోంది. ఇందులో అరవింద్‌ కృష్ణ, జయప్రకాశ్, పవిత్ర లోకేశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీలోని హారర్‌ ఎలిమెంట్స్‌ ప్రతీ ఒక్కరినీ థ్రిల్‌ (OTT Releases Telugu) చేస్తారని చిత్ర బృందం చెబుతోంది. 

    పా.. పా.. (Pa Pa)

    తమిళ బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘డా.. డా..’ను తెలుగులో ‘పా.. పా..’ పేరుతో రిలీజ్‌ చేయబోతున్నారు. డిసెంబర్‌ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కెవిన్‌, అపర్ణ దాస్ ప్రధాన పాత్రలు పోషించారు. గణేష్‌ కె. బాబు దర్శకత్వం వహించారు. తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను సైతం తప్పక అలరిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

    ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు

    హరికథ (Harikatha)

    పలు సూపర్‌ హిట్‌ చిత్రాలు నిర్మించిన ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పీపీల్‌ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఓ ఆసక్తికర వెబ్‌సిరీస్‌ను నిర్మించింది. ‘హరికథ: సంభవామి యుగే యుగే’ పేరుతో రూపొందిన ఈ సిరీస్‌ ఈ వారమే హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. డిసెంబర్‌ 13 నుంచి ఈ సిరీస్‌ను వీక్షించవచ్చు. ఇందులో రాజేంద్ర ప్రసాద్‌, శ్రీరామ్‌, దివి, అంబటి అర్జున్‌ కీలక పాత్రలు పోషించారు. మగ్గీ దర్శకత్వం వహించారు. 

    రోటి కపడా రొమాన్స్ (Roti Kapada Romance)

    హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్ పొనుగంటి, సుప్రజ్ రంగా హీరోలుగా నటించిన సినిమా ‘రోటి కపడా రొమాన్స్’. ఇందులో సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘ లేఖ, ఖుష్బూ చౌదరి హీరోయిన్లు. విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ రెస్పాన్స్ అందుకుంది. ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది. డిసెంబర్‌ 12 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఈ సినిమా ప్రసారం కానుంది. 

    TitleCategoryLanguagePlatformRelease Date
    One Hundred Years of SolitudeMovieEnglishNetflixDec 11
    The Auditors MovieEnglish/KoreanNetflixDec 11
    How To Make Millions Before Grandma DiesMovieEnglish/ThaiNetflixDec 11
    Dead list CaughtMovieEnglishNetflixDec 12
    Law PalmaMovieEnglishNetflixDec 12
    Miss MatchedMovieEnglishNetflixDec 13
    Carry on MovieEnglishNetflixDec 13
    1992MovieEnglishNetflixDec 14
    Inside out 2SeriesEnglishHotstarDec 12
    Jamay no.1MovieHindiZee 5Dec 09
    DispatchMovieHindiZee 5Dec 13
    BougainvilleaMovieTelugu/MalayalamSonyLIVDec 13
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv