తారక్ లేటెస్ట్ చిత్రం ‘దేవర’ రిలీజ్‌కు ఇంకో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. అందుకు తగ్గట్లే మూవీ టీమ్ కూడా వరుసగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై భారీగానే హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే దేవరకు సంబంధించిన రికార్డు స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరీర్లో ఎన్నడూ లేనివిధంగా థియేట్రికల్ బిజినెస్ నమోదైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ దేవర ప్రీరిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎన్ని కోట్లు? తెలుగులో ఇప్పటివరకూ అత్యధిక ప్రిరీలిజ్ బిజినెస్ చేసిన టాప్-10 చిత్రాలు ఏవి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
దేవర ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎంతంటే?
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర చిత్రానికి ఓ రేంజ్లో ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.185 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. రూ.115 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులు విక్రయించారని అంటున్నారు. నైజాం ఏరియాలో అత్యధికంగా రూ.45 కోట్లకు ‘దేవర’ అమ్ముడుపోయినట్లు పేర్కొన్నారు. అటు సీడెడ్‌లో రూ.22 కోట్ల బిజినెస్ చేసిందని టాక్. కర్ణాటకలో రూ. రూ.15 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ.50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. యూఎస్‌లో రూ.26 కోట్లు, హిందీ బెల్ట్‌లో రూ.15 కోట్లకు సేల్ అయ్యిందని సమాచారం. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ.185 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ లెక్కన రూ.200 కోట్ల షేర్ వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది.
ముఖ్య అతిథులుగా స్టార్ డైరెక్టర్స్!
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ వేదికగా ఈ నెల 22న ఈవెంట్ జరగనుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ వేడుకకు ముగ్గురు స్టార్ డైరెక్టర్లు హాజరుకానున్నట్లు సమాచారం. దర్శకధీరుడు రాజమౌళి, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ ఈవెంట్లో పాల్గొంటారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అదే విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈవెంట్‌కు హాజరయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే దేవర టీమ్ ప్రమోషన్స్ పరంగా నార్త్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్స్‌తోపాటు మహేష్‌ను గెస్ట్‌గా పిలవడం ద్వారా ఆ విమర్శల నుంచి బయటపడాలని దేవర టీమ్ భావిస్తున్నట్లు సమాచారం.
ప్రీరిలీజ్ బిజినెస్‌లో టాప్ మూవీస్ ఇవే
ఒకప్పుడు ప్రీరిలీజ్ బిజినెస్ అంటే బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలకు మాత్రమే సాధ్యమన్న ఆలోచనలో తెలుగు ఆడియన్స్ ఉండేవారు. దర్శకధీరుడు రాజమౌళి దీనిని పూర్తిగా మార్చివేశారు. ప్రీరిలీజ్ బిజినెస్ రికార్డులకు కేరాఫ్‌గా టాలీవుడ్‌ను మార్చారు. అలవోకగా 350 కోట్లకు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తూ తెలుగు చిత్రాలు సత్తా చాటాడు. తెలుగులో అత్యధిక ప్రిరీలిజ్ బిజినెస్ చేసిన టాప్ -10 చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఆర్ఆర్ఆర్ (RRR)
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ మూవీ అత్యధిక ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన తెలుగు చిత్రంగా టాప్‌లో నిలిచింది. డిజిటల్, శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ కలిపి ఆర్ఆర్ఆర్కు దాదాపు రూ.480 కోట్ల వ్యాపారం జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే రూ.191 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా. ఇప్పటి
కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)
మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సరికొత్త రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కింద రూ. 385 కోట్ల వ్యాపారం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.180 కోట్లు, ఓవర్సీస్లో 70 కోట్లు, హిందీలో రూ.85 కోట్ల వ్యాపారం జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రం రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం.
బాహుబలి 2 (Bahubali 2)
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, రానా కీలకపాత్రలు పోషించిన చిత్రం బాహుబలి 2. బాహుబలికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కింద రూ.350 కోట్ల వ్యాపారం చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్పాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాను రూ.190 కోట్లకు పైగా విక్రయించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.
సలార్ (Salaar)
కేజీఎఫ్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ప్రభాస్ హీరోగా ‘సలార్’ అనే చిత్రాన్ని తీశాడు. రిలీజ్‌కు ముందు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.345 కోట్ల వ్యాపారం చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రూ.120 కోట్ల బిజినెస్ చేసిందని అంచనా.
సాహో (Sahoo)
బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో సాహోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దుమ్మరేపింది. సాహోకు ప్రీ రిలీజ్ బిజినెస్ కింద రూ.280 కోట్ల వ్యాపారం జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నార్త్ ఇండియాలో ఏకంగా రూ.120 కోట్ల వ్యాపారం చేసి అప్పట్లో సాహో రికార్డ్ క్రియేట్ చేసింది
ఆదిపురుష్ (Adipurush)
ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన మూవీ ‘ఆదిపురుష్’. రామాయణాన్ని బేస్ చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమాలో కృతి సనన్ సీతమ్మ తల్లిగా నటించారు. మైథలాజికల్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా అందుకు తగినట్లుగానే బిజినెస్ జరిగింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కింద ఈ సినిమా రూ.240 కోట్లకు పైగా వ్యాపారం చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి
రాధేశ్యామ్ (RadheShyam)
ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ హీరో ప్రభాస్‌ను కంప్లీట్ డిఫరెంట్ లుక్‌లో చూపించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.202.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా తెలుగు రాష్ట్రాల్లోనే రూ.107 కోట్ల వ్యాపారం చేసి ప్రభాస్ స్టామినా ఏంటో నిరూపించింది.
సైరా నర్సింహారెడ్డి (Saira Narasimha Reddy)
చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ఏకంగా 187.25 కోట్లకు ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. మెగాస్టార్ కెరీర్ అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చిత్రంగా అవతరించింది. ఇక ఈ సినిమా తెలుగులో మాత్రమే బ్రేక్ ఈవెన్ దాటడం గమనార్హం.
దేవర (Devara)
కొరటాల శివ – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన దేవర పార్ట్ 1 రిలీజ్‌కు ముందు రూ.185 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసి ఈ జాబితాలో టాప్-9లో చోటు సంపాదించింది. ఇది ఎన్టీఆర్ కెరీర్లోనే (సోలో హీరోగా) హయ్యెస్ట్ అని చెప్పవచ్చు.
పుష్ప (Pushpa)
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషించిన ‘పుష్ప: ది రైజ్’ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఐదు భాషల్లోని థియేట్రికల్ రైట్స్, శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ రైట్స్ ఇలా అన్ని కలిపి దాదాపు రూ.160 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా.
Celebrities Featured Articles Telugu Movies
Chiranjeevi: ‘టాలెంట్ ఒక్కటే సరిపోదు.. ప్రవర్తన ముఖ్యం’.. బన్నీకి చిరు ఇండైరెక్ట్ పంచ్!