థ్రిల్లింగ్ మూవీస్ కి క్రేజ్ ఎప్పుడూ ఉంటుంది. రొమాంటిక్, ఫామిలీ, కామెడీ జానర్ సినిమాలు రిలీజ్ అయి హిట్ అవడం ఖాయం. థ్రిల్లర్ సినిమాలు హిట్ కాకపోయినప్పటికీ వాటిని చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు అనేకమంది ఉంటారు. థ్రిల్ లేనిదే మూవీ లవర్స్ కి కిక్ ఉండదు. ఒకప్పుడు హాలీవుడ్ లో మాత్రమే రిలీజ్ అయ్యే థ్రిల్ మూవీస్ ఇప్పుడు టాలీవుడ్ లోను విడుదలవుతున్నాయి. గత రెండు మూడు సంవత్సరాల్లో రిలీజ్ అయిన టాప్ థ్రిల్లింగ్ మూవీస్ లిస్ట్ మీకు అందుబాటులో ఉంచుతున్నాము.
1. Maestro
హీరో నితిన్, నభ నతేష్ తమన్నా కలిసి నటించిన మాస్ట్రో Block Buster Hit గా నిలిచింది. భారీ బడ్జెట్ మూవీ అయినప్పటికీ Disney Hotstar మంచి రేటు తో స్ట్రీమింగ్ రైట్స్ ని కొనుగోలు చేసి విడుదల చేసింది. బాలీవుడ్ మూవీ “Andhadhun ” నే రీమేక్ చేసి “మాస్ట్రో” గా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించారు. గుడ్డి వాడిగా నటిస్తూ ఒక మర్డర్ కేసు లో ఇరుక్కుపోయిన క్యారక్టర్ లో నితిన్ పెర్ఫార్మన్స్ అదుర్స్. ఇక నెగటివ్ రోల్ లో తమన్నా కొత్తగా కనిపించనుంచి. Hotstar లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి.
2. Netrikann
“Netrikann ” మూవీ కథ భిన్నమైంది. సౌత్ కొరియన్ మూవీ Blind (2011)కి రీమేక్ గా ఈ సినిమాను దర్శకుడు మిలింద్ రాజు తెరకెక్కించాడు. ఇందులో నయనతార మాజీ సిబిఐ ఆఫీసర్. ఒక ఆక్సిడెంట్ కారంగా తన తమ్ముడు చనిపోవడంతో పాటు ఆమె కళ్ళు కూడా పోతాయి. అయితే ఒక Psycho Rapist Kidnapper ను తాను తెలివిగా కళ్ళు లేకపోయినప్పటికీ ఎలా పట్టిస్తుందన్నదే ఇంటరెస్టింగ్ పాయింట్. Netrikann Hotstar లో స్ట్రీమ్ అవుతుంది.. ఆలస్యం చేయకుండా చూసేయండి.
3. Doctor
ఈ సినిమా, శివ కార్తికేయన్, ప్రియాంక మోహన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా చెప్పుకోవచ్చు. మిలిటరీ డాక్టర్ గా శివకార్తికేయన్ acting, ప్రియాంక మోహన్ innocent mannersims ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఇక కథ, కామెడీ, ట్విస్ట్స్ విషయంలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ అసలు చొంప్రొమిసె కాలేదని చెప్పుకోవచ్చు. డేంజరస్ హ్యూమన్ ట్రాఫికర్స్ నుంచి శివ కార్తికేయన్ ఎలా హీరోయిన్ మేన కోడలును కాపాడుతాడనే దాని చుట్టే కదా తిరుగుతుంది. Netflix లో Doctor Movie అందుబాటులో ఉంది, చూసి ఎంజాయ్ చేయండి.
4. Awe
విశ్వమే ఉందిలే నాలోన అంటూ సాగే టైటిల్ సాంగ్ అనేక మంది మనసులు దోచుకుంది. సినిమా మొత్తం ఈ పాటలోనే ఉందని చెప్పుకోవచ్చు. ఒక Mulitiple Personality Disorder తో బాధపడే క్యారక్టర్ లో కాజల్ కనిపిస్తుంది. ఈ సినిమాలో కాజల్ అందరి feelings ని తనలో ఫీల్ అవుతుంది. చివరికి తనను తాను ఎందుకు suicide చేసుకుంటుందో అనేది చాలా intersting గా చూపించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. “Awe” Movie Netflix లో available గా ఉంది వెంటనే చూసేయండి.
5. Evaru
రెజినా కాసాండ్రా, అడవి శేష్ కెరీర్ లో ఇది బెస్ట్ మూవీ గా చెప్పుకోవచ్చు. పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పాత్రలో అడవిశేష్, బిజినెస్ వుమెన్ పాత్రలో రెజినా మునిగి తేలారు. తనపై రేప్ చేయబోతున్న పోలీస్ ఆఫీసర్ ని చంపినా కేసు లో ఇరుక్కున్న రెజినా, ఆ కేసును అడవి శేష్ ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తాడు.
6. Hit
ఫలక్‌నుమా దాస్ తరువాత ఈ “హిట్” మూవీ ద్వారా విశ్వక్ సేన్ మరో భారీ హిట్ కొట్టాడు. ఈ సినిమాలో విశ్వక్ ఒక షార్ప్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. అయితే తన కాళ్ళ ముందే తన చెల్లి ప్రాణాలు పోతున్న కాపాడలేని భాధ తనని వెంటాడుతుంది. ఈ క్రమంలో క్రిమినల్స్ విశ్వక్సేన్ కి విసిరినా సవాళ్ళని ఎలా ఛేదిస్తాడనేది ఇంట్రెస్టింగ్గా, థ్రిల్లింగ్ గా ఉంటుంది. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రైమ్ వీడియో లో ఉంది చూసి థ్రిల్ అవ్వండి.
7. Penguin
కోవిడ్ ఫస్ట్ వేవ్ తీవ్రంగా ఉన్న టైం లో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ గా రిలీజ్ చేశారు. తన బిడ్డని ఒక Psycho killer నుంచి ఎలా కాపాడుకుంటుందనే దాని చుట్టూ కదా నడుస్తుంది. కార్తిక్ సుబ్బరాజు నిర్మాణంలో కార్తీక్ ఈశ్వర్ తెరకెక్కించిన ఈ సినిమాలో స్టోరీ, screenplay అద్భుతంగా ఉంటుంది. కీర్తి సురేష్ కెరీర్ లో ఇది బెస్ట్ థ్రిల్లర్ గా చెప్పుకోవచ్చు .
8. A (Ad Infinitum )
వయసు పెరుగుదలను ఆపేయడంలో success అవుతే ఎలా ఉంటుంది ? ఈ అంశాన్ని ఆధారం చేసుకొని డైరెక్టర్ Ugandhar Muni ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీ లో నితిన్ ప్రసన్న, ప్రీతీ అస్రాణి ప్రధాన పాత్రలో నటించారు. 1975 లోని యువకుడికి ఏజ్ పెరగడం ఆగిపోయి ఇప్పుడు మన మధ్య ఉంటె ఎలా ఉంటుందనేది ఇంటరెస్టింగ్ గా చూపించారు. A (Ad Infinitum ) Prime లో available గా ఉంది చూసి థ్రిల్ అవండి.
9. Nishabdham
నిశ్శబ్దం మూవీ సైలెంట్ గా Beautiful గా స్టార్ట్ అయి ఊహించని మలుపులతో viewers ను థ్రిల్ చేస్తుంది. మాధవన్ ఒక ఫేమస్ violin ప్లేయర్ గా, అనుష్క, మాటలు రాని ఆర్టిస్ట్ గా అద్భుతంగా నటించారు. మాధవన్ ను మూవీ స్టార్టింగ్ లోనే హత్య చేస్తారు. ఎందుకు ? ఎవరు ? అనే విషయాలను అనేక ట్విస్టులతో ఇంటరెస్టింగ్ గా డైరెక్టర్ హేమంత్ మధుకర్ తెర కెక్కించారు. ప్రైమ్ వీడియో లో ఈ సినిమా Available గా ఉంది చూసి ఎంజాయ్ చేయండి.
10. Play Back
టైం ట్రావెల్ మూవీస్ ను హాలీవుడ్ లోనే ఎక్కువగా చూస్తాం అలంటి కాన్సెప్ట్ తోనే విడుదలైంది ఈ Play Back Movie. ఇద్దరు వేరు వేరు టైం లైన్ లో ఒక చోట నుండి communicate చేసుకుంటే ఎలా ఉంటుందనేది దర్శకుడు జక్కా హరిప్రసాద్ అద్భుతంగా చూపించారు. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన అనన్య నాగళ్ళకి ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెట్టింది. Aha Video లో Play Back స్ట్రీమ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Drishyam 3: ట్రెండింగ్‌లో ‘దృశ్యం 3’ హ్యాష్‌ట్యాగ్.. కారణం ఇదే!