దక్షిణాదిలో వెండితెరకు సమానంగా బుల్లితెర ఎదుగుతోంది. ఎంతో మంది మహిళా యాంకర్లు, సీరియల్ నటీమణులు టెలివిజన్ ఆడియన్స్‌ను అలరిస్తున్నారు. అదే సమయంలో సినిమా ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, సక్సెస్ మీట్‌లకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. కొందరు సీనియర్ యాంకర్లు తమ మాటలతో మంచి గుర్తింపు సంపాదించగా.. ఇంకొందరు తమ బ్యూటీతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. చిట్టిపొట్టి డ్రెస్సులతో గ్లామర్ షో చేస్తున్నారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో బుల్లితెర ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. తద్వారా సినిమా అవకాశాలు దక్కించుకొని పై స్థాయికి ఎదుగుతున్నారు. ఇలా దక్షిణాదిలో అందరి దృష్టిని ఆకర్షించిన టాప్ యాంకర్లు, నటీమణులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
మంజూష (Manjusha)
హీరోయిన్ మెటీరియల్‌లా అనిపించే యాంకర్ మంజూష.. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉంది. తన గ్లామర్ షోతో కుర్రకారు మతులు పొగొట్టే ఈ భామ.. ఆడియో, సినిమా ఫంక్షన్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మిగిలిన యాంకర్లు టీవీ, రియాలిటీ షోలలో కనిపిస్తుంటారు కానీ.. మంజూష మాత్రం సినిమా ఈవెంట్లకు మాత్రమే పరిమితమవుతూ వస్తోంది.
వర్షిణి (Varshini)
అందాల ఆరబోతలో అనసూయ, రష్మీలకు ఈ మధ్య కాలంలో యాంకర్ వర్షిణీ గట్టి పోటీ ఇస్తోంది. పటాస్ షోతో అందరి దృష్టిని ఆకర్షించిన వర్షిణి.. పలు సినిమాల్లోనూ నటించింది. ‘చందమామ కథలు’, ‘లవర్స్’, ‘మళ్లీ మెుదలైంది’, రీసెంట్‌గా ‘భాగ్ సాలే’ చిత్రాల్లో వర్షిణి మెరిసింది.
విష్ణు ప్రియ (Vishnu Priya)
తెలుగులో డ్యాన్స్ అద్భుతంగా చేసే అతికొద్ది మంది యాంకర్లలో ‘విష్ణుప్రియ’ ఒకరు. ఈ భామ కూడా ఒంపుసొంపులను ఒలికించడంలో ఏ మాత్రం ఆలోచించడం లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా తన గ్లామర్ షోతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత కొంతకాలంగా యూట్యూబ్‌లో డ్యాన్సింగ్ ఆల్బమ్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది.
అషూ రెడ్డి (Ashu reddy)
ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్‌స్మాష్ వీడియోలు పోస్టు చేస్తూ కెరీర్‌ను ప్రారంభించిన అషూ రెడ్డి.. తన వీడియోలతో చాలా ఫేమస్ అయ్యింది. ‘ఛల్ మోహన్ రంగా’ వెండి తెరపై ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3లో కనిపించి అలరించింది. ప్రస్తుతం బుల్లితెరపై వచ్చే షోలలో కనిపిస్తూ అందాలు ఆరబోస్తోంది.
సౌమ్యరావు (Sowmya rao)
జబర్దస్త్ షో ద్వారా తెలుగులో ఫేమస్ అయిన కన్నడ భామ సౌమ్య రావు.. తన కెరీర్‌ను తమిళ టెలివిజన్ ఇండస్ట్రీలో ప్రారంభించింది. ‘రోజా’ అనే సీరియల్‌లో తొలిసారి నటించి మెప్పించింది. తెలుగులో శ్రీమంతుడు సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. ప్రస్తుతం బుల్లితెరపై గ్లామర్‌గా మెరిసిపోతూ కుర్రకారును ఆకట్టుకుంటోంది.
శ్యామల (Shyamala)
అసూయపడే అందం, అలరించే యాంకరింగ్‌తో శ్యామల.. సుదీర్ఘ కాలంగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘లయ’, ‘అభిషేకం’, ‘గోరింటాకు’ వంటి సీరియళ్లలో అదిరిపోయే నటన కనబరిచినా శ్యామలా.. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. ‘పట్టుకుంటే పట్టుచీర’ వంటి షోలు చేసింది. సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ శ్యామల దూసుకెళ్తోంది.
దీప్తి నల్లమోతు (Deepthi Nallamothu)
కెరీర్ ప్రారంభంలో ఓ న్యూస్ ఛానెల్‌లో పనిచేసిన దీప్తి నల్లమోతు.. ఔనా.. నిజమా? అన్న డైలాగ్‌తో చాలా ఫేమస్ అయ్యింది. అంతకుముందు రవితేజ ‘భద్ర’ సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2లో హౌస్‌మేట్‌గా అడుగుపెట్టి తనకంటూ మంచి పేరు సంపాదించింది.
అనసూయ (Anasuya)
యాంకర్ అనసూయ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ.. తన గ్లామర్‌తో షోకే అందాన్ని తీసుకొచ్చింది. ఆ షో సూపర్ హిట్ కావడంలో తన వంతు పాత్ర పోషించింది. జబర్దస్త్ క్రేజ్‌తో సినిమాల్లోకి వచ్చిన ఈ గ్లామర్ బ్యూటీ.. ‘రంగస్థలం’లో రంగమ్మత్త, ‘పుష్ప’లో దాక్షాయణి పాత్రల్లో మెప్పించి మరింత గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
రష్మి (Rashmi)
జబర్దస్త్ షో (Jabardasth) ద్వారానే మంచి క్రేజ్ సంపాదించుకున్న మరో యాంకర్ రష్మి. జబర్దస్త్ స్కిట్లతో పాటు రష్మి అందాలకు కూడా పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. చిరంజీవి రీసెంట్ మూవీ భోళా శంకర్‌లోనూ రష్మి నటించింది. అడపా దడపా సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ ప్రేక్షకులను ఈ చిన్నది అలరిస్తోంది.
శ్రీముఖి (Srimukhi)
యాంకర్ అనసూయ, రష్మిల తరువాత ఆ స్థాయిలో అందాలు ఆరబోసే బుల్లితెర యాంకర్ ‘శ్రీముఖి’. వినోదాన్ని పంచే విషయంలో వారిద్దరి కంటే శ్రీముఖి ఓ మెట్టు పైనే ఉంటుంది. ఈ భామ కూడా తన గ్లామర్‌తో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. జీ తెలుగు, స్టార్ మా వంటి ఛానెళ్లలో వచ్చే పలు షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ శ్రీముఖి దూసుకెళ్తోంది. మధ్య మధ్యలో సినిమా ఈవెంట్లలోనూ తళుక్కుమంటోంది.
వింధ్య (Vindhya)
తెలుగు యాంకర్లు అందరిదీ ఒక లెక్క అయితే.. వింధ్యది మరో లెక్క. తెలుగులో ఏకైక మహిళా స్పోర్ట్స్ యాంకర్ ఈమెనే. ఐపీఎల్ వచ్చినా, ప్రో కబడ్డీ లీగ్స్ జరిగినా వింధ్య తన యాంకరింగ్‌తో కనువిందు చేస్తుంటుంది. తన హాట్‌నెస్‌తో క్రీడాభిమానుల హృదయాలను కొల్లగొడుతోంది. చిట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి అందరి చూపును తనవైపు తిప్పుకుంటుంది.
రచిత (Rachitha)
ప్రముఖ సీరియల్ నటి రచిత మహాలక్ష్మీ.. తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించింది. బెంగళూరుకు చెందిన రచిత.. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సినిమాలు, సీరియళ్లలో నటించింది. తెలుగులో ‘స్వాతి చినుకులు’ సీరియల్ ద్వారా ఎనలేని ఖ్యాతిని సంపాదించింది. ఆ సీరియల్ ఏడేళ్ల పాటు సుదీర్ఘంగా నడిచిందంటే అందుకు కారణం రచిత అని చెప్పవచ్చు.
పల్లవి రామిశెట్టి (Pallavi Ramisetty)
బుల్లి తెరపై కనిపించే అందమైన సీరియల్ నటీమణుల్లో పల్లవి రామిశెట్టి ఒకరు. ‘ఆడదే ఆధారం’, ‘అత్తారింటికి దారేది’, ‘మాటే మంత్రం’, ‘పాపే మా జీవన జ్యోతి’ వంటి ప్రముఖ సీరియళ్లలో పల్లవి నటించింది. ‘అలీ 369’, ‘స్టార్ మహిళా’, ‘క్యాష్’ వంటి టెలివిజన్ షోలలోనూ ఈమె పాల్గొంది.
ప్రేమి విశ్వనాథ్ (Premi Viswanath)
‘కార్తిక దీపం’ సీరియల్‌తో ప్రేమి విశ్వనాథ్ చాలా పాపులర్ అయ్యారు. కేరళకు చెందిన ప్రేమి.. ‘కరుతముత్తు’ అనే మలయాళ సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టింది. తెలుగులో గోరింటాకు, చెల్లెలి కాపురం వంటి సీరియళ్లలో అతిథి పాత్రలు పోషించింది. ‘మా ఉగాది వేడుక’, ‘మా వరలక్ష్మీ వ్రతం’ వంటి స్పెషల్ షోలలోను కనిపించి సందడి చేసింది.
ప్రీతి అస్రాని (Preeti Asrani)
గుజరాత్‌కు చెందిన ప్రీతి అస్రాని.. ‘ఊ కొడతారా? ఉలిక్కి పడతారా?’ అనే సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘గుండెల్లో గోదారి’, ‘మళ్లీ రావా’ వంటి చిత్రాల్లో చేసింది. 2016లో ‘పక్కింటి అమ్మాయి’ సీరియల్ ద్వారా బుల్లితెరలోకి అడుపెట్టింది. ఇటీవల ‘9 అవర్స్’, ‘వ్యూహాం’ వంటి సిరీస్‌లలోనూ ప్రీతి మెరిసింది.
వరలక్ష్మీ శరత్‌కుమార్ (Varalakshmi Sarathkumar)
ప్రముఖ స్టార్ జంట రాధిక – శరత్‌కుమార్‌ల తనయ వరలక్ష్మీ.. పలు సందర్భాల్లో బుల్లితెరపై మెరిసింది. జయ టీవీలో వచ్చిన ‘ఉన్నాయ్ అరింధాల్’ షోకు హోస్ట్‌గా వ్యవహించింది. అలాగే కలర్స్ తమిళ్ ఛానెల్‌లో వచ్చిన ‘ఎంగ వీటు మపిల్లాయ్’ షోలోనూ మెరిసింది. రీసెంట్‌గా తెలుగు వచ్చిన ‘హనుమాన్’ (Hanuman Movie)లో కీలక పాత్ర పోషించి వరలక్ష్మీ అందరి దృష్టిని ఆకర్షించింది.
వైష్ణవి గౌడ (Vaishnavi Gowda)
కన్నడలో బాగా పాపులర్ అయిన అందమైన బుల్లితెర నటీమణుల్లో వైష్ణవి గౌడ ఒకరు. ‘అగ్నిసాక్షి’ సీరియల్‌లో సన్నిధి పాత్రను పోషించి మెప్పించింది. బిగ్‌బాస్ కన్నడ సీజన్ 8లో హౌస్‌మేట్‌గా వెళ్లి తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది.
దీపికా దాస్ (Deepika Das)
కర్ణాటకకు చెందిన దీపికా దాస్.. అక్కడ సీరియళ్లలో నటించి చాలా ఫేమస్ అయ్యింది. 2016లో వచ్చిన ‘నాగిని’ సీరియల్‌తో దీపిక బుల్లితెరపై అరంగేట్రం చేసింది. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. ఈ క్రమంలో 2017లో ‘డ్రీమ్ గర్ల్’ అనే కన్నడ సినిమాలో ఆమెకు ఛాన్స్ వచ్చింది.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..