UP ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. UPతో పాటుగా మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. అయినా కానీ అందరి దృష్టి పెద్ద రాష్ట్రమైన UP మీదే ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. UP పోరులో మనం చూడాల్సిన కొన్ని కీలక స్థానాలివే…
– **గోరఖ్‌పూర్, యోగి ఆదిత్యనాథ్ VS శుభవతి శుక్లా**
UP సీఎంగా ఉన్న యోగి ఆదిత్యనాథ్‌కు గోరఖ్‌పూర్‌లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన శుభవతి శుక్లా గట్టిపోటీనిస్తుంది. ఇన్నాళ్లూ సీఎంగా ఉన్నా కానీ MLA కానందున ఈ సారి వీరిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
– **కర్హల్, అఖిలేష్ యాదవ్ VS SP సింగ్ బఘేల్**
తొలిసారి పోటీలో ఉన్న అఖిలేష్ యాదవ్‌కు కర్హల్‌లో బీజేపీ అభ్యర్థి SP సింగ్ బఘేల్ నుంచి పోటీ తీవ్రంగా ఉంది. ఈ పోరులో ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.
– **ఫజిల్‌నగర్ స్వామిప్రసాద్ మౌర్య VS సురేందర్ సింగ్ కుశ్వాహ**
UP డిప్యూటీ సీఎంగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య ఎన్నికలకు కొద్ది రోజుల ముందు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఇక ఈ సారి పోరు హరాహోరీగా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు.
– **సిరతు, కేశవ్‌ప్రసాద్ మౌర్య VS డా. పల్లవి పటేల్**
–
– **గోసి, దారా సింగ్ చౌహాన్VS విజయ్ కుమార్**
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం