టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒకరు. ఎలాంటి ఫిల్మ్ నేపథ్యం లేకుండా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్ ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు. ‘పెళ్లిచూపులు’, ‘టాక్సీవాలా’, ‘గీత గోవిందం’ సక్సెస్‌తో తెలుగు ఇండస్ట్రీలో సుస్థిర స్థానం సంపాదించాడు. అటువంటి విజయ్‌కు గత కొంతకాలంగా ఇండస్ట్రీలో కలిసిరావడం లేదు. అతడు చేసిన గత మూడు చిత్రాలు ‘లైగర్’, ‘ఖుషీ’, ‘ఫ్యామిలీ స్టార్’ బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. దీంతో ప్రస్తుతం అతడు చేస్తున్న ‘VD12’ చిత్రంపై విజయ్‌తో పాటు అతడి ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం గురించి నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
రెండు భాగాలుగా..
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘VD 12’ అనే వర్కింగ్ టైటిల్‌తో మూవీని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి నిర్మాత నాగవంశీ మాట్లాడారు. దీన్ని రెండు పార్టులుగా అందించనున్నట్లు తెలిపారు. ‘విజయ్ దేవరకొండ సినిమా విషయంలో నేను రిస్క్ తీసుకోవడం లేదు. రెండు పార్టులకు సరిపోయే కంటెంట్ సిద్ధంగా ఉంది. మొదటి భాగం ఫలితం ఆధారంగా రెండో పార్ట్ తెరకెక్కిస్తాం. గౌతమ్ తిన్ననూరి కథను అద్భుతంగా తీర్చిదిద్దారు. సూపర్ హిట్ అవుతుందని మాకు పూర్తి నమ్మకం ఉంది’ అని తెలిపారు. అయితే విజయ్ కెరీర్‌లో ఇప్పటివరకూ ఏ సినిమా రెండు భాగాలుగా రాలేదు. విజయ్ చేసిన చిత్రాలన్నీ సింగిల్ పార్ట్‌గా వచ్చినవే. నాగవంశీ చెప్పినట్లు అన్ని అనుకున్నట్లు జరిగితే విజయ్ కెరీర్‌లోనూ సీక్వెల్స్ చూసే అవకాశం లభించనుంది. ఇప్పటికే ‘VD 12’పై భారీ అంచనాలు ఉండగా నాగ వంశీ కామెంట్స్‌తో ఫ్యాన్స్ ఎగిరిగంతేస్తున్నారు.
ఆకట్టుకున్న ఫస్ట్ లుక్!
‘VD12’ చిత్రానికి సంబంధించి ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ మాస్ లుక్‌లో కనిపించాడు. ‘విధి పిలిచింది.. రక్తపాతం ఎదురుచూస్తోంది.. కొత్త రాజు ఉద్భవిస్తాడు’ అని ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ఆసక్తికరమై క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాదు వచ్చే ఏడాది మార్చి 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు తమ టీమ్ ఎంతో కష్టపడుతోందని లీకైన కంటెంట్‌ను ఎవరూ షేర్ చేయవద్దని ఈ సందర్భంగా చిత్ర బృందం విజ్ఞప్తి చేసింది.
డ్యుయల్ రోల్‌లో..!
‘VD 12’ చిత్రంలో విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి అస్పష్టంగా ఉన్న ఖాకీ డ్రెస్ పోస్టర్‌ను సైతం గతంలో అధికారికంగా రిలీజ్ చేసింది. అయితే తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే విజయ్ దేవరకొండ ఊర మాస్ లుక్‌లో కనిపించాడు. ఒక లోకల్ గ్యాంగ్‌స్టర్‌ను తలపించాడు. దీన్ని బట్టి చూస్తే విజయ్ ఈ చిత్రంలో ద్విపాత్రిభినయం చేస్తున్నాడా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. లేదా ఒకే పాత్రను రెండు డైమన్షన్స్‌లో దర్శకుడు చూపించబోతున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. ఏది ఏమైనా విజయ్ లుక్ చూస్తే థియేటర్‌లో మాస్ జాతర కన్ఫార్మ్ అని స్పష్టమవుతోంది.
విజయ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్!
ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో ‘VD12’ కాకుండా మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘ఫ్యామిలీ స్టార్’ తర్వాత విజయ్‌తో దిల్‌రాజు మరో చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నారు. అలాగే డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ మరో ప్రాజెక్ట్ చేయనున్నాడు. పీరియాడికల్ జానర్‌లో రాయల సీమ బ్రాక్ డ్రాప్‌లో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న నటించే అవకాశముంది.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్