• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండ ఎమోషనల్‌ పోస్టు.. తండ్రిని గట్టిగా హగ్‌ చేసుకొని..! 

    టాలీవుడ్‌లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు ‘విజయ్‌ దేవరకొండ’ (Vijay Devarakonda). ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్‌.. తనకంటూ  ప్రత్యేకమైన స్టార్‌డమ్‌ను సృష్టించుకున్నాడు. ‘అర్జున్‌ రెడ్డి’, ‘పెళ్లి చూపులు’, ‘గీతా గోవిందం’, ‘ట్యాక్సీవాలా’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలతో స్టార్ హీరోల సరసన నిలిచాడు. కాగా, ఇటీవల విజయ్‌.. తన ఫ్యామిలీతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లాడు. అక్కడ కుటుంబ సభ్యులతో దిగిన ఎమోషనల్‌ ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

    ఎమోషనల్‌ పోస్టు

    రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ.. తల్లిదండ్రులు గోవర్ధన్‌ రావు, మాధవిలతో పాటు సోదరుడు ఆనంద్‌ దేవరకొండతో కలిసి ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లాడు. విజయ్‌ తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి. గత కొంత కాలంగా వరుస షూటింగ్‌ షెడ్యూల్స్‌తో బిజీ బిజీగా గడుపుతోన్న విజయ్‌.. విరామం కోసం అమెరికాకు వెళ్లి కొద్ది రోజులు ఫ్యామిలీతో సరదాగా గడిపారు. తాజాగా ఇండియాకు వచ్చిన విజయ్‌.. అక్కడ తన ఫ్యామిలీతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన అమ్మనాన్న, సోదరుడితో కలిసి అమెరికా వెకేషన్‌ను.. విజయ్‌ ఎంత బాగా ఆస్వాదించారో ఈ ఫొటోల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా తండ్రి గోవర్ధన్‌రావును విజయ్‌ గట్టిగా హగ్‌ చేసుకున్న ఫొటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. 

    https://www.instagram.com/p/C8W7M9Jys78/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

    అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా త్రివిక్రమ్‌ కుమారుడు!

    విజయ్‌ దేవరకొండ తీసిన గత మూడు చిత్రాలు (లైగర్‌, ఖుషి, ఫ్యామిలీ స్టార్‌) బాక్సాఫీస్‌ వద్ద ఫ్లాప్‌గా నిలిచాయి. దీంతో విజయ్‌ తన తర్వాతి చిత్రంపై ఫోకస్‌ పెట్టాడు. ‘VD12’ ప్రొడక్షన్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ పెద్ద కుమారుడు రిషి.. ఈ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతనిది హీరో ఫేస్ అని అభిమానులు అంటున్నా.. రిషి మాత్రం కెమెరా వెనుక నుంచి తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారట. ఇందుకు త్రివిక్రమ్‌ కూడా ఓకే చెప్పడంతో విజయ్‌ దేవరకొండ సినిమా ద్వారానే రిషి తన సినీ కెరీర్‌ను మెుదలుపెట్టినట్లు సమాచారం. 

    పోలీసు ఆఫీసర్‌గా విజయ్‌

    గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న VD12 చిత్రంలో విజయ్‌.. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా కనిపిస్తారని సమాచారం. ఇందులో సీరియస్‌ పోలీసు ఆఫీసర్‌గా విజయ్‌ కనిపించనున్నాడట. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree)ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. కాగా, ఈ సినిమాలో ప్రముఖ నటుడు సత్యదేవ్‌ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాలీవడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇటీవల అతడు నటించిన ‘కృష్ణమ్మ’ ఫ్లాప్‌ టాక్ తెచ్చుకోవడంతో సత్యదేవ్‌ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారట.

    సాయిపల్లవితో రొమాన్స్‌

    రౌడీ భాయ్‌ విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda).. దర్శకుడు రవికిరణ్‌ కోలా (Ravi Kiran Kola)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీకి దిల్‌ రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇది అందమైన, సరికొత్త ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించనున్నట్లు కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. చిత్ర యూనిట్‌ సాయిపల్లవిని కలిశారని, ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చినట్లు ఫిల్మ్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది నిజమైతే విజయ్‌ – సాయి పల్లవి జోడీ ఇండస్ట్రీలో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv