అనన్య నాగళ్ల (Ananya Nagalla), యువ చంద్ర (Yuva Chandra) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం పొట్టేల్ (Pottel Movie Review). ‘సవారి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సాహిత్ మోత్కురి ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల ఏ చిన్న సినిమాకు రాని పబ్లిసిటీ ‘పొట్టేల్’కు వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం (అక్టోబర్ 25) రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. చాలా నేచురల్‌గా, గతంలో జరిగిన వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా సినిమా ఉందంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆడియన్ ‘దేవర’తో ‘పొట్టేల్’ను పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘దేవర కన్నా చాలా బెటర్’
జూ.ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ చిత్రం ఇటీవలే విడుదలై కలెక్షన్ల సునామి సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూలు చేసి పలు రికార్డులను కొల్లగొట్టింది. అనిరుధ్ వంటి టాప్ నాచ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకు పనిచేశాడు. అటువంటి ‘దేవర’ను పొట్టేల్‌తో పోలుస్తూ ఓ ప్రేక్షకుడు చేసిన కామెంట్స్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. పొట్టేల్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ వద్దకు వెళ్లిన ఓ యూట్యూబర్, ప్రేక్షకుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో థియేటర్ నుంచి బయటకు వస్తోన్న ప్రేక్షకున్ని ఆపి సినిమా ఎలా ఉందని ప్రశ్నించాడు. తనకు దేవర కంటే పొట్టేల్ సినిమానే చాలా బాగా నచ్చిందని సదరు ప్రేక్షకుడు చెప్పడం వీడియోలో చూడవచ్చు. పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే బెటరా? అని యూట్యూబర్ అడుగుతున్న సందర్భంలో ‘దేవర కంటే ఇదే (పొట్టేల్) బాగా నచ్చిదంటూ పునరుద్ఘటించాడు. ప్రస్తుతం ఈ వీడియోను వైరల్ అవుతోంది.
కంటెంట్‌కే ప్రాధాన్యత
సినిమాలో కంటెంట్ ఉంటే పెద్దదా, చిన్నదా అన్న సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. పొట్టేల్ విషయంలో అదే జరుగుతోంది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మంచి స్టోరీతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఇటీవల వచ్చిన ‘ఆయ్’, ‘కమిటీ కుర్రోళ్లు’, ‘మత్తు వదలరా 2’ కూడా ఇదే విధంగా సక్సెస్ సాధించాయి. ఆ సినిమాల్లోనూ పెద్ద స్టార్ హీరోలు లేరు. అలాగని నిర్మాతలు పెద్ద మెుత్తంలో ఖర్చూ చేయలేదు. మంచి ఎంటర్‌టైనింగ్ ఉండటంతో తెలుగు ఆడియన్స్ ఆ సినిమాలకు భారీ విజయాన్ని అందించారు. అయితే దేవర సినిమాను కూడా తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. అయినప్పటికీ సదరు ప్రేక్షకుడు దేవర కంటే ‘పొట్టేల్’ బాగుందని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
పొట్టేల్ ఎలా ఉందంటే?
దర్శకుడు సాహిత్ మోత్కూరి 1980ల నాటి గ్రామీణ నేపథ్యాన్ని ‘పొట్టేల్’లో ఆవిష్కరిస్తూ ఆరంభంలోనే ప్రేక్షకుల్ని ఆ కాలంలోకి తీసుకెళ్లాడు. తొలి 20 నిమిషాల్లోనే గ్రామంలో లీనమయ్యేలా చేశాడు. పటేళ్ల కాలంలో బడుగు, బలహీన వర్గాలను ఎలా అణగదొక్కారు. ఎలాంటి దారుణానికి ఒడిగట్టేవారు అనే విషయాలను చక్కగా చూపించారు. కులం, మతం, చిన్న పెద్దా అనే అహంకారం అనే అంశాన్ని ప్రొజెక్ట్ చేసిన విధానం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పాత్రల పరిచయం, హీరో హీరోయిన్ మధ్య ప్రేమకథ తదితర సన్నివేశాలతో ప్రథమార్థాన్ని చక్కగా తీర్చిదిద్దాడు. సెకండ్ పార్ట్ విషయంలోనే దర్శకుడు కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. ప్రధాన పాత్రల్ని విలన్ ఎంత హింసిస్తే అంతగా భావోద్వేగాలు పండుతాయనే భావనతో సన్నివేశాల్ని మలిచినట్టు కనిపిస్తుంది. సన్నివేశాలు లాజిక్‌కి దూరంగా సాగుతుంటాయి. అయితే కథ వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ఆడియన్స్‌కు కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.
కథ ఇదే
మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని గుర్రంగట్టు గ్రామంలో కథ సాగుతుంది. గ్రామ దేవత బాలమ్మకు ఊరి ప్రజలు పుష్కరానికి ఒకసారి జాతర చేసి పొట్టేలును బలిస్తుంటారు. ఆ సమయంలో ఊరి పెద్ద పటేల్ (అజయ్) ఒంటిమీదకి అమ్మవారు పూనుతుందని గ్రామస్తుల నమ్మకం. అయితే పటేల్ ఊరి ప్రజలను ఎదగనివ్వడు. గ్రామస్తులు చదువుకోనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాడు. మరోవైపు పెద్ద గంగాధరీ (యువ చంద్ర) అమ్మవారికి బలిచ్చే పొట్టేల్‌కు కాపరిగా ఉంటాడు. ఎవరికీ తెలియకుండా కూతుర్ని చదవిస్తుంటాడు. ఈ విషయం తెలిసిన పటేల్, గంగాధరీ దగ్గర ఉన్న పొట్టేల్‌ను మాయం చేస్తాడు. జాతర సమయానికి పొట్టేల్ తీసుకురాకపోతే కూతుర్ని బలిస్తానని హెచ్చరిస్తాడు. కూతురి ప్రాణాల్ని దక్కించుకునేందుకు గంగాధరీ ఏం చేశాడు? తిరిగి తీసుకొచ్చాడా లేదా? ఇందులో బుజ్జమ్మ (అనన్య నాగళ్ల) కథేంటి? అన్నది స్టోరీ.
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి