• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కూతకు సిద్ధమైన ఆటగాళ్లు (Vivo Pro Kabaddi 2021 – Telugu Titans) ..ఏ టీమ్ బలమైందో తెలుసా?

    కబడ్డీ అభిమానులకు గుడ్ న్యూస్. గతంలో కరోనా కారణంగా వాయిదా పడ్డ ప్రో కబడ్డీ లీగ్ (PKL) ఈ ఏడాది కూతకు సిద్ధమైంది. ఎనిమిదో సీజన్ ప్రో కబడ్డీ లీగ్ 2021 ఇవాళ్టీ నుంచే మొదలుకానుంది. మొత్తం 12 జట్లు పాల్గొంటుండగా, ఫిబ్రవరి 26 వరకు ఈ సీజన్ కొనసాగనుంది. ఈ లీగ్‌లో మొదటి రోజు మూడు మ్యాచులు జరగనున్నాయి. ప్రతి మ్యాచ్ మొత్తం 40 నిమిషాల పాటు జరగనుంది.

    1. యూ ముంబా VS బెంగళూరు బుల్స్ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు

    2. తెలుగు టైటాన్స్ VS తమిళ్ తళైవాస్ మ్యాచ్ రాత్రి 8.30 గంటలకు

    3. యూపీ యోద్ధ VS బెంగాల్ వారియర్స్  మ్యాచ్  రాత్రి 9.30 గంటలకు

    PKL సీజన్ 8కి హైదరాబాద్‌లో ఉన్న మన తెలుగు టైటాన్స్ కబడ్డీ జట్టు, ఆటగాళ్ల గురించి  తెలుసుకుందాం. టైటాన్స్ తమ హోమ్ మ్యాచ్‌లను వైజాగ్‌లో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో, హైదరాబాద్‌లో ఉన్నప్పుడు G. M. C. బాలయోగి SATS ఇండోర్ స్టేడియంలో ఆడనుంది.

    PKL సీజన్ 8కి హైదరాబాద్‌లో ఉన్న మన తెలుగు టైటాన్స్ కబడ్డీ జట్టు, ఆటగాళ్ల గురించి  తెలుసుకుందాం. టైటాన్స్ తమ హోమ్ మ్యాచ్‌లను వైజాగ్‌లో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో, హైదరాబాద్‌లో ఉన్నప్పుడు G. M. C. బాలయోగి SATS ఇండోర్ స్టేడియంలో ఆడనుంది.

    తెలుగు టైటాన్స్ అనేది వయా గ్రూప్‌కు చెందిన శ్రీనివాస్ శ్రీరామనేని యాజమాన్యంలోని వీరా స్పోర్ట్స్ ఫ్రాంచైజీ. NED గ్రూప్‌కి చెందిన గౌతం రెడ్డి నేదురుమల్లి, గ్రీన్‌కో గ్రూప్‌కి చెందిన శ్రీ మహేష్ కొల్లి ఈ ఒప్పందంలో ఉన్నారు.

    గత సీజన్లలో నిరాశ పర్చిన తెలుగు టైటాన్స్ ఈ సారి ఎలాగైనా కప్పు గెలవాలనే కసితో ఉన్నారు. తెలుగు టైటాన్స్ ఇప్పటివరకు ఒక్క సారి కూడా టైటిల్ ను గెలవలేదు. రెండు సీజన్లలో మాత్రమే ప్లే ఆఫ్స్ కు చేరింది. ఈ నేపథ్యంలో మన ఆటగాళ్లు ఏ మేరకు రాణిస్తారో చుడాలి.

    కెప్టెన్-రోహిత్ కుమార్

    వైస్ కెప్టెన్- సిద్ధార్థ్ శిరీష్ దేశాయ్

    ప్రధాన కోచ్ – జగదీష్ కుంబ్లే

    రైడర్, కెప్టెన్ రోహిత్ కుమార్– ఇప్పటివరకు 91 మ్యాచులు ఆడగా, 711 పాయింట్లు, నాటౌట్ పర్సెంటేజ్ 78.98 శాతం

    వైస్ కెప్టెన్, రైడర్- సిద్ధార్థ్ దేశాయ్–   ఇప్పటివరకు 43 మ్యాచులు ఆడగా, 441 పాయింట్లు, నాటౌట్ పర్సెంటేజ్ 74.84 శాతం

    రైడర్-రజనీశ్ – ఇప్పటివరకు 15 మ్యాచులు ఆడగా, 56 పాయింట్లు, 

    నాటౌట్ పర్సెంటేజ్ 78.38 శాతం

    రైడర్ – రాకేశ్ గౌడ– ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడగా, 61 పాయింట్లు, నాటౌట్ పర్సెంటేజ్ 78.07 శాతం

    లెఫ్ట్ కార్నర్ డిఫెండర్- సీ.అరుణ్– ఇప్పటివరకు 91 మ్యాచులుఆడగా, 115 పాయింట్లు, నాటౌట్ పర్సెంటేజ్ 91.17 శాతం

    డిఫెండర్-సురేందర్ సింగ్ – ఇప్పటివరకు 68 మ్యాచులు ఆడగా, 178 పాయింట్లు, నాటౌట్ పర్సెంటేజ్ 84.61 శాతం

    డిఫెండర్-రుతురాజ్ కొరవి– ఇప్పటివరకు 40 మ్యాచులు ఆడగా, 64 పాయింట్లు, నాటౌట్ పర్సెంటేజ్ 100 శాతం

    లెఫ్ట్ కార్నర్ డిఫెండర్- ఆదర్శ్.టి– ఇప్పటివరకు 20 మ్యాచులు ఆడగా, 22 పాయింట్లు, నాటౌట్ పర్సెంటెంజ్ 100 శాతం

    లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ –సందీప్ కండోల–  ఇప్పటివరకు 16 మ్యాచులు ఆడగా, 70 పాయింట్లు, నాటౌట్ పర్సెంటెంజ్ 73.33 శాతం

    డిఫెండర్- ఆకాశ్ చౌదరి– ఇప్పటివరకు 5 మ్యాచులు ఆడగా, 8 పాయింట్లు

    డిఫెండర్- మనీష్– ఇప్పటివరకు 2 మ్యాచులు ఆడగా, 2 పాయింట్లు

    రైడర్- అంకిత్ బనివాల్

    రైడర్- గల్ల రాజు 

    రైడర్- హ్యున్సు పార్క్ (దక్షిణ కొరియా)

    డిఫెండర్ – అబే టెట్సురో (జపాన్)

    లెఫ్ట్ రైడర్- అమిత్ చౌహాన్

    డిఫెండర్ –ఆకాష్ అర్సుల్ 

    డిఫెండర్ –ప్రిన్స్.డి

    డిఫెండర్ – ముహమ్మద్ షిహాస్

    డిఫెండర్ – పల్లా రామకృష్ణ

    తెలుగు టైటాన్స్ గత సీజన్లలో సాధించిన స్థానాలు

    2014- సీజన్1- 42 పాయింట్లతో ఐదో స్థానం

    2015- సీజన్2- 50 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది

    2016- జనవరి సీజన్3- 38 పాయింట్లతో ఐదో స్థానం

    2016- జూన్ సీజన్4- 50 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది

    2017- సీజన్5- 52 పాయింట్లతో ఐదో స్థానం

    2018- సీజన్6- 51 పాయింట్లతో ఐదో స్థానం

    2019- జూలై సీజన్7- 51 పాయింట్లతో 11వ స్థానం

    ఈ లీగ్ లో పోటీ పడనున్న 12 జట్లు

    1. బెంగాల్ వారియర్స్

    2. బెంగళూరు బుల్స్

    3. దబాంగ్ ఢిల్లీ కె.సి.

    4. గుజరాత్ జెయింట్స్

    5. హర్యానా స్టీలర్స్

    6. జైపూర్ పింక్ పాంథర్స్

    7. పట్నా పైరేట్స్

    8. పుణెరి పల్టన్

    9. తమిళ్ తలైవాస్

    10. తెలుగు టైటాన్స్

    11. యు ముంబా

    12. యు.పి.యోద్ధ

    గత ఏడు సీజన్లలో విన్నర్లు

    2014లో జైపూర్ పింక్ పాంథర్స్ మొదటి సీజన్లో టైటిల్ గెల్చుకుంది. రన్నర్- యు ముంబా

    2015లో యు ముంబా రెండో సీజన్లో కప్పు సాధించింది. రన్నర్- బెంగళూరు బుల్స్ 

    పాట్నా పైరేట్స్ జట్టు PKL చరిత్రలో 7 టైటిళ్లలో 3, 4, 5 సీజన్లలో (2016లో రెండు సార్లు, 2017లో ఒకసారి) టైటిళ్లు గెల్చుకుంది. యు ముంబా, జైపూర్ పింక్ పాంథర్స్, గుజరాత్ జెయింట్స్

    2018లో బెంగళూరు బుల్స్  ఆరో  సీజన్లో టైటిల్ సాధించింది. రన్నర్-గుజరాత్ జెయింట్స్

    2019లో బెంగాల్ వారియర్స్ ఏడో  సీజన్లో కప్పు గెలిచింది. రన్నర్- దబాంగ్ ఢిల్లీ కె.సి.

    అన్ని సీజన్లలో టాప్-5 ఆటగాళ్లు

    1. పర్దీప్ నర్వాల్- 107 మ్యాచ్‌లు- 1169 పాయింట్లు

    2. రాహుల్ చౌదరి- 122 మ్యాచ్‌లు- 1014 పాయింట్లు

    3. దీపక్ నివాస్ హుడా- 123 మ్యాచ్‌లు- 943 పాయింట్లు

    4. అజయ్ ఠాకూర్ – 115- మ్యాచ్‌లు- 811 పాయింట్లు

    5. మణిందర్ సింగ్- 79 మ్యాచ్‌లు- 740 పాయింట్లు

    అన్ని సీజన్లలో టాప్-5 బెస్ట్ రైడర్స్ 

    1. పర్దీప్ నర్వాల్- పాట్నా పైరేట్స్- 107 మ్యాచ్‌లు- 1160 పాయింట్లు

    2. రాహుల్ చౌదరి-పుణేరి పల్టన్- 122 మ్యాచ్‌లు- 955 పాయింట్లు

    3. దీపక్ నివాస్ హుడా- జైపూర్ పింక్ పాంథర్స్- 123 మ్యాచ్‌లు- 856 పాయింట్లు

    4. అజయ్ ఠాకూర్- తమిళ్ తలైవాస్- 115 మ్యాచ్‌లు- 790 పాయింట్లు

    5. మణిందర్ సింగ్- బెంగాల్ వారియర్స్- 79 మ్యాచ్‌లు- 731 పాయింట్లు

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv