• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vyooham Movie Review: పవన్, చిరంజీవి మధ్య డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?

    నటీనటులు : అజ్మల్‌ అమీర్‌, మానస రాధాక్రిష్ణన్‌, రేఖా నిరోషా, సురభి పద్మావతి, ధనుంజయ్‌ ప్రభూనే, కోటా జయరామ్‌, ఎలెనా టుతేజా తదితరులు

    దర్శకుడు : రామ్‌గోపాల్‌ వర్మ

    సంగీతం : బాలాజీ

    సినిమాటోగ్రఫీ : సజీష్‌ రాజేంద్రన్‌

    ఎడిటింగ్‌ : మనీష్‌ థాకూర్‌

    నిర్మాత : దాసరి కిరణ్‌ కుమార్‌

    టాలీవుడ్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తెరకెక్కించిన వ్యూహం (Vyooham) సినిమా నేడు (మార్చి 2) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున థియేటర్లలోకి వచ్చేసింది. అజ్మల్, మానస ముఖ్య తారలుగా రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రామధూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్‌ దీనిని నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఇప్పుడు చూద్దాం. 

    కథ

    వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యే వరకు చోటుచేసుకున్న సంఘటనల సమాహారమే వ్యూహాం(Vyooham Movie Review in Telugu) కథ. జగన్‌ను అప్రతిష్టపాలు చేయడానికి సీబీఎన్‌ (ధనుంజయ్‌ ప్రభునే), పవన్‌ పాత్రలు చేసిన ప్రయత్నాలు ఏంటి? వారి కుయుక్తులను ఎదుర్కొని జగన్ ఎలా నిలబడ్డాడు? ప్రజల అండతో ఏపీ సీఎం పీఠాన్ని ఎలా అధిరోహించాడు? పవన్‌ మేలు కోసం చిరంజీవి ఇచ్చిన సలహాలు ఏంటి? ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న క్రియాశీలక మార్పులు ఏంటి? అన్నది స్టోరీ. 

    ఎవరెలా చేశారంటే

    వైఎస్‌ జగన్ పాత్రలో అజ్మల్ అమీర్‌ పరకాయ ప్రవేశం చేశాడు. తన నటన, హావభావాలతో జగన్‌ను దించేశాడు. ఈ సినిమా మెుత్తం అజ్మల్‌ చుట్టే తిరుగుతుంది. భావద్వేగ సన్నివేశాల్లో అజ్మల్‌ చాలా బాగా ప్రభావం చూపించాడు. ఇక జగన్‌ భార్య భారతి పాత్రలో మానస రాధాక్రిష్ణన్‌ మెప్పించింది. చంద్రబాబు పాత్రలో కనిపించిన ధనుంజయ్‌ ప్రభునే సినిమా మెుత్తం సీరియస్‌ లుక్‌లో కనిపించాడు. చిరంజీవి, పవన్‌ పాత్రలు చేసిన వారు, తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma).. ఈ సినిమా ద్వారా తెర వెనుక రాజకీయాలను తన దృష్టికోణంలో బహిర్గతం చేసే ప్రయత్నం చేశారు. జగన్‌ పాత్రకు పాత్రకు మైలేజ్‌ ఇస్తూ.. చంద్రబాబు, పవన్‌ నెగిటివ్‌గా చూపించారు. చిరంజీవి, పవన్‌ పాత్రల మధ్య వచ్చే సంభాషణలు నవ్వులు(Vyooham Movie Review in Telugu) పూయిస్తాయి. అయితే సినిమాను నడిపించడం కంటే విమర్శించడం పైనే ఆర్జీవీ దృష్టి పెట్టారు. కథ, కథనంపై కూడా శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది. ముఖ్యంగా సెకండాఫ్‌ను చాాలా డ్రాగ్‌ చేసినట్లు అనిపిస్తుంది. కమర్షియల్‌ హంగులు ఉన్న సినిమాను కోరుకునే వారికి వ్యూహాం అంతగా రుచించకపోవచ్చు. ఓ వర్గం వారిని మాత్రమే ఈ సినిమా మెప్పిస్తుంది.

    టెక్నికల్‌గా

    టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. బాలాజీ అందించిన నేపథ్యం సంగీతం ఆకట్టుకుంటుంది. సజీష్‌ రాజేంద్రన్‌ కెమెరా పని తనం మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు కూాడా సినిమాకు తగ్గట్లు బాగానే ఉన్నాయి. 

    ప్లస్ పాయింట్స్‌

    • అజ్మల్‌ అమీర్‌ నటన
    • నేపథ్య సంగీతం

    మైనస్‌ పాయింట్స్

    • కమర్షియల్‌ హంగులు లేకపోవడం
    • ద్వితీయార్థం
    • సాగదీత సీన్లు

    Telugu.yousay.tv Rating : 2.5/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv