• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏపీ రాజధానిపై జగన్ సర్కార్ తదుపరి కార్యచరణ ఏంటి..?

    ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేసి సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని భావించిన జగన్ సర్కార్‌కి హైకోర్టు తాజా తీర్పుతో చుక్కెదురైంది. ఏపీ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని 2014లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు సీఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ తదుపరి అధికారంలోని వచ్చిన జగన్ ప్రభుత్వం ఆ బిల్లును రద్దు చేస్తూ.. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. కానీ అమరావతి ఏర్పాటుకు భూమిలిచ్చిన రైతులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

          ప్రభుత్వం రాజధాని అభివృద్ధికి భూములిచ్చిన రైతులను ఆదుకోవాలని..తమకు సీఆర్డీఏ చట్టం ప్రకారం ఇచ్చిన హామీలను అమలు చేయాలని దాదాపు 70 పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఈ పిటిషన్లన్నింటినీ విచారించి అమరావతి రైతులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో రాజధాని అంశంపై తదుపరి ఎలాంటి కార్యచరణ చేపట్టాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం పడినట్లు తెలుస్తుంది.

         రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తాజా తీర్పుని అమలు చేస్తుందా..? ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తుందా..? మూడు రాజధానుల అంశాన్ని పక్కన పెడుతుందా..? అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదివేయండి.

    ప్రభుత్వం నెక్ట్స్ ప్లాన్స్ ఇవేనా..?

    సుప్రీంకోర్టును ఆశ్రయించడం

    సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలన్న హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఆరు నెలల్లో సీఆర్డీఏ చట్టంలోని హామీలన్నింటినీ అమలు చేయాలనే నిర్ణయం సాధ్యపడదంటూ స్టే ఆర్డర్ తెచ్చుకునే ఛాన్సులూ ఉన్నాయి. ముందుగా ఈ అంశాన్ని సీఎం జగన్ ఉన్నతాధికారులతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోవచ్చు.

    హైకోర్టు తీర్పును గౌరవించడం

    రాజధాని అభివృద్ధికి భూమిలిచ్చిన రైతులకు మూడు నెలల్లో ప్లాట్లు కేటాయించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం గౌరవించొచ్చు. అలాగే ఆరు నెలల్లో లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలతో ఇళ్లు నిర్మించి, ప్రభుత్వ భూములను రాజధాని డెవలప్‌మెంట్ కోసం మాత్రమే వినియోగించొచ్చు. లేదా ఆరు నెలల సమయంలో ఇదంతా సాధ్యంకాదని భావిస్తే గడువు కోరుతూ పిటిషన్ దాఖలు చేయొచ్చు.

    మూడు రాజధానుల నిర్ణయంలో మార్పు

    హైకోర్టు తీర్పు మూడు రాజధానుల నిర్ణయంపై పడే అవకాశం ఉంది. ప్రభుత్వం అమరావతి, వైజాగ్, కర్నూలు ప్రాంతాలను శాసన, కార్యనిర్వహక, న్యాయపరమైన రాజధానులుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే సీఆర్డీఏను రద్దు చేసింది. కాని హైకోర్టు మాత్రం సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాజధాని రైతులకు లబ్ధి చేకూర్చాలని చెప్పడంతో ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని వెనక్కి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆర్థిక లోటును దృష్టిలో ఉంచుకొని కేవలం ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం కూడా లేకపోలేదు. లేదా రాజధాని రైతుల హామీలు నెరవేర్చి, మూడు ప్రాంతాలను రాజధానిగా చేయొచ్చు. కానీ 3 రాజధానులను డెవలప్ చేయాలంటే చాలా నిధులు అవసరం అవుతాయి. ఆర్థిక లోటుతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం అన్ని నిధులను సమకూర్చుకోగలదా అనేది కూడా ఆలోచించాలి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv