• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • WTC FINAL: అరుదైన రికార్డులకు చేరువలో రోహిత్ శర్మ… ఆ ఘనత సాధించేనా?

    వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ముంగిట ఆటగాళ్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ముఖ్యంగా, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ ఫైనల్ మ్యాచ్ ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది. దీంతో పాటు అంతర్జాతీయ కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని చేరుకునేందుకు రోహిత్ సిద్ధంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో పోరు నేపథ్యంలో రోహిత్ శర్మ ఈ రికార్డులను చేరుకుంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది. 

    50వ మ్యాచ్..

    రోహిత్ శర్మ కెరీర్‌లో టెస్టు మ్యాచుల సంఖ్య చాలా తక్కువ. వన్డే, టీ20ల్లో ప్రాతినిథ్యం వహించినంతగా సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడలేకపోయాడు. 2007లోనే వన్డే, టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ, టెస్టు మ్యాచులో అరంగేట్రం చేయడానికి హిట్‌మ్యాన్‌కు మరో ఆరేళ్ల కాలం పట్టింది. ఎంతో కాలం నిరీక్షించిన తర్వాత 2013లో తొలి టెస్టు ఆడే ఛాన్స్ దక్కింది. వెస్టిండీస్‌పై రోహిత్ తన తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. అప్పటినుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసే వరకు రోహిత్ 49 టెస్ట్ మ్యాచులు ఆడాడు. ఇందులో 83 ఇన్నింగ్సులు ఆడి 3,379 పరుగులు చేశాడు. ఈ ఫైనల్ మ్యాచ్ హిట్‌మ్యాన్‌కి 50వ టెస్టు కావడంతో ప్రత్యేకత సంతరించుకుంది. 

    ఓపెనర్‌గా రికార్డుకు చేరువలో..

    కెరీర్ ఆరంభంలో రోహిత్ శర్మ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. అప్పటికే జట్టులో ఓపెనింగ్ స్థానంలో తీవ్ర పోటీ ఉండేది. కానీ, 2011 తర్వాత రోహిత్ శర్మ దశ తిరిగి పోయింది. రోహిత్‌లోని ఓపెనర్‌ను గుర్తించిన ధోనీ ఇన్నింగ్స్ ఆరంభించే పనిని అప్పగించాడు. దీంతో కెరీర్‌లో కుదురుకు పోయాడు. ఎన్నో రికార్డులు సాధించాడు. వన్డేల్లో ట్రిపుల్ డబుల్ సెంచరీలు చేశాడు. ఇలా ఓపెనర్‌గా రోహిత్ 12,973 పరుగులు రాబట్టాడు. మరో 27 పరుగులు చేస్తే 13 వేల పరుగులు చేసిన మూడో ఓపెనర్‌గా రోహిత్ రికార్డు నెలకొల్పుతాడు. సెహ్వాగ్(15,758), సచిన్ తెందుల్కర్(15,335) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 

    WTC సైకిల్‌లోనూ..

    వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లోనూ అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా రోహిత్ నిలిచాడు. 2019 నుంచి ఆడిన 36 ఇన్నింగ్సుల్లో 52.76 సగటుతో రోహిత్ 1,794 పరుగులు చేశాడు. ఈ ఏడాది భారత్‌లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడు రోహితే. 242 పరుగులు చేశాడు. నాగ్‌పూర్‌లో అద్భుత శతకం సాధించి టీమిండియాను గట్టెక్కించాడు.

    ఓవల్‌లోనే తొలి సెంచరీ..

    విదేశీ గడ్డపై రోహిత్ శర్మ తొలి సెంచరీని నమోదు చేసింది ఓవల్‌‌లోనే. ఇప్పుడు ఇదే మైదానంలో టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరుగుతోంది. మరో సెంచరీ నమోదు చేస్తాడేమో చూడాలి. అయితే, విదేశీ గడ్డపై టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేయడానికి అత్యధిక ఇన్నింగ్సులు ఆడిన ఏకైక భారత ప్లేయర్ కూడా రోహితే. 47 ఇన్నింగ్సులు ఆడాడు. ఇంగ్లాండ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కూడా రోహిత్‌ పేరిటే ఉంది. 9 శతకాలు బాదాడు హిట్‌మ్యాన్. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv