తన కస్టమర్లకు భారత తపాలా శాఖ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. పోస్టాఫీస్ ఆర్డీ అకౌంట్లో ప్రతి రోజూ రూ.333 లేదా ప్రతి నెలా రూ.10,000 పొదుపు చేస్తే రూ.16 లక్షల రాబడి పొందవచ్చు. పదేళ్లకు గానూ ఇన్వెస్టర్లు రూ.12 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పెట్టుబడిపై 5.8 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. ఈ మొత్తంపై రాబడి రూ.4.26 లక్షలుగా ఉంది. వడ్డీతో కలుపుకుని రూ.16.26 లక్షలకు చేరుతుంది. దీనిని బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు.
ఆర్థికపరమైన భద్రత కోసం చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు చేస్తుంటారు. పోస్టాఫీసు, బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు ఎఫ్డీ, ఆర్డీ సేవలను అందిస్తున్నాయి. దాదాపు బ్యాంకులు అందిస్తున్న అన్ని రకాల సేవింగ్ స్కీములను పోస్టాఫీసు అమలు చేస్తోంది. ఇందులో రికరింగ్ డిపాజిట్ ఒకటి.
పెట్టుబడి పెట్టాలని భావించే ఔత్సాహికులు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, డిపాజిట్స్, తదితర మార్గాలను ఎంచుకుంటారు. స్టాక్స్‌లో కొంచెం రిస్క్ ఎక్కువ. మ్యూచువల్ ఫండ్స్‌తో బెనెఫిట్ పొందాలంటే దీర్ఘకాలం వేచిఉండాలి. గ్యారంటీ రిటర్న్స్‌తో నష్టభయం లేని ఇన్వెస్ట్మెంట్ కోసం చూసేవాళ్లకు డిపాజిట్స్ ఉత్తమం.
10 ఏళ్లు నిండిన భారత పౌరులు పోస్టల్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. మైనర్ల తరఫున తల్లిదండ్రులు లేదా పోషకులు ఖాతాను తెరవాల్సి ఉంటుంది. 18ఏళ్లు నిండిన వారు స్వతహాగా చేసుకునే వీలుంది. నెలకు కనీసం రూ.10 నుంచి ఎంతైనా పొదుపు చేసుకునే వీలుంది.
ప్రస్తుతం ఆర్డీపై 5.8శాతం వడ్డీ రేటు కల్పిస్తోంది. ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రేట్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
పోస్టాఫీసు ఆర్డీ మెచ్యురిటీ గడువు 5 ఏళ్లు. ఒకవేళ ఆర్డీ గడువును పొడిగించాలని భావిస్తే మరో 5 ఏళ్ల పాటు తప్పక రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో మెచ్యురిటీ గడువు ముగిశాక అవసరం మేరకు రెన్యూవల్ చేసుకోవచ్చు.
డిపాజిటర్లు తమ డిపాజిట్ బ్యాలెన్స్‌లో 50 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. సంవత్సరానికి రూ.10వేల కన్నా ఎక్కువగా ఆర్డీ చేస్తే టీడీఎస్(TDS) కట్ అవుతుంది. ఈ ట్యాక్స్ డిడక్షన్ నుంచి తప్పించుకోవాలంటే Form 15G or Form 15H లను సమర్పించాల్సి ఉంటుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!