• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 5 Years Of Jersey : సినిమా సక్సెస్ కావడానికి అంతలా ఏముంది?

    నేచురల్ స్టార్‌ నాని (Nani) నటించిన జెర్సీ (Jersey) చిత్రం అతడి కెరీర్‌లోనే ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచింది. 2019లో ఏప్రిల్‌ 19న విడుదలైన ఈ చిత్రం.. టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో నాని నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇందులో నాని నటనకు ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. రిపీటెడ్‌ మోడ్‌లో ఈ సినిమాను చాలా ఏమోషనల్ అయ్యారు. నేటితో (ఏప్రిల్‌ 19) ఈ సినిమా విడుదలై ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ‘జెర్సీ’ సక్సెస్‌కు కారణమైన అంశాలేంటో ఓసారి గుర్తు చేసుకుందాం. 

    స్టోరీ అండ్ స్క్రీన్‌ ప్లే

    జెర్సీ సినిమా ఘన విజయం సాధించడానికి మూలకారణం ‘కథ’. చాలా యునిక్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్పోర్ట్స్‌ డ్రామాకు తండ్రి కొడుకుల ఎమోషనల్‌ టచ్ జోడించడం సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. డైరెక్టర్‌ గౌతమ్‌ తిన్ననూరి స్క్రీన్‌ప్లే ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. అర్జున్‌ జర్నీని హృదయానికి హత్తుకునేలా ఆయన చూపించారు. కథలో ఫ్యామిలీ, త్యాగం, ఏమోషనల్‌, స్పోర్ట్స్‌ను మిళితం చేసి చక్కటి విజయాన్ని అందుకున్నారు. 

    ప్రధాన తారాగణం నటన

    కథ ఎంత బాగున్నా దానికి తగ్గ తారాగణం లేకపోతే ఆశించిన ఫలితం రాదు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు. పాత్రలకు తగ్గట్లు నటీనటులను ఎంచుకొని ఆయన మంచి ఫలితాన్ని రాబట్టాడు. ముఖ్యంగా అర్జున్ పాత్రకు నాని ఎంచుకోవడం ద్వారానే ఆయన సంగం విజయం సాధించాడని చెప్పవచ్చు. తెరపై చూస్తున్నంత సేపు అర్జున్‌ పాత్ర తప్ప నాని ఎక్కడా కనిపించలేదు. హీరో భార్య సారా పాత్రలో శ్రద్దా శ్రీనాథ్‌ కూడా అద్భుత నటన కనబరిచింది. నాని, శ్రద్ధా కెమెస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. అర్జున్‌ కోచ్‌గా నటించిన సత్యరాజ్‌ కూడా సినిమాపై మంచి ప్రభావం చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో తన అసాధారణమైన నటనతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాడు.

    సంగీతం – సినిమాటోగ్రఫీ

    స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచందర్‌ అందించిన సంగీతం సినిమాను హైలెట్‌గా నిలిపింది. చాలా కాలం తర్వాత మంచి పాటలు విన్నామన్న ఫీలింగ్‌ అప్పట్లో ప్రేక్షకులకు కలిగించింది. ఇక  నేపథ్య సంగీతం కూడా సినిమాకు చాలా బాగా కుదిరింది. ఆడియన్స్‌ ఎమోషనల్‌గా సినిమాకు కనెక్ట్‌ అయ్యేందుకు BGM ఉపయోగపడింది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలకు అనిరుధ్‌ ఇచ్చిన BGM.. ఆ సీన్స్‌ తాలుకూ డెప్త్‌ను తెలియజేసింది. మరోవైపు సినిమాటోగ్రఫీ కూడా జెర్సీ చిత్రానికి ప్లస్‌గా మారింది. సినిమాటోగ్రాఫర్‌ సాను వర్గీస్‌.. చూపించిన విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయి. నటీనటుల ముఖాల్లోని భావోద్వేగాలను ఆయన చాలా బాగా క్యాప్చర్‌ చేశారు. అలాగే క్రికెట్‌ మ్యాచ్‌లను అతడు చాలా రియలస్టిక్‌గా చూపించాడు. 

    తండ్రి-కొడుకుల అనుబంధం

    టాలీవుడ్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు వచ్చినప్పటికీ కొన్ని మాత్రమే ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆ కోవకు చెందిన చిత్రమే ‘జెర్సీ’. ఈ సినిమాలోని అర్జున్‌ పాత్ర చాలా మంది తండ్రులకు కనెక్ట్‌ అవుతుంది. కుమారుడి సంతోషం కోసం ఏదైనా సాధించాలని తపన పడే ఆ పాత్ర మిడిల్‌క్లాస్‌ జీవితాలకు అద్దం పడుతుంది. కొడుకు పుట్టిన రోజున అడిగిన జెర్సీని కూడా బహుమతిగా కొనివ్వలేని తండ్రి.. తన బిడ్డకు హీరోలా కనిపించాలన్న సంకల్పంతో ఆపేసిన క్రికెట్‌ను మళ్లీ మెుదలు పెట్టడం ఆడియన్స్‌ను చాలా ఏమోషనల్‌ చేస్తుంది. 

    జెర్సీ  డైలాగ్స్‌

    జెర్సీ సినిమా గురించి చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం డైలాగ్స్‌. ఒక్కో డైలాగ్‌ ప్రతీ ఒక్కరికీ జీవిత పాఠాన్ని నేర్పేలా స్పూర్తివంతంగా ఉంటాయి. ఆణిముత్యాల్లాగా కనెక్ట్ అవుతాయి. సినిమాల్లోని హైలెట్‌ డైలాగ్స్‌ ఇప్పుడు చూద్దాం.

    • ‘ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు’_ అర్జున్‌
    • ‘నీ అంత టాలెంట్‌ ఉన్న వాళ్లని చాలా మందిని చూశాను. కానీ.. డిస్సిప్లైన్‌ లేకుండా ఎదిగిన వాళ్లని ఒక్కరిని కూడా చూడలేదు’_ సత్యరాజ్‌ పాత్ర 
    • కొడుకు: నాన్న నువ్వు మళ్లీ క్రికెట్‌ ఆడవా?

    అర్జున్‌ : నువ్వు చెప్పు ఆడనా వద్దా?

    కొడుకు: ఆడు నాన్న నువ్వు ఆడితే చాలా బాగుంటుంది.. హీరోలా అనిపిస్తావు?

    • ‘ఇంత పెద్ద ప్రపంచంలో ఈ రోజు దాకా నన్ను జడ్జ్‌ చేయంది.., నా కొడుకు ఒక్కడే. వాడికి వాళ్ల నాన్న ఉద్యోగం చేస్తున్నాడా? డబ్బులు సంపాదిస్తున్నాడా? సక్సెస్ఫుల్లా? ఫెయిల్యూరా? ఇవేమి సంబంధం లేదు.., వాడికి నేను నాన్న అంతే. వాడి దృష్టిలో నేను కొంచెం తగ్గిన తట్టుకోలేను సారా..’
    • లాస్‌ మూడు రోజులలో నాకు నేను దొరికాను సర్‌. నా 36 ఏళ్ల జీవితం కనిపించింది’
    • ‘అర్జున్‌ కథ, వందలో సక్సెస్‌ అయిన ఒకడిది కాదు, సక్సెస్‌ అవ్వకపోయిన ప్రయత్నిస్తూ మిగిలిపోయిన 99 మందిది’
    • ‘మా నాన్న సంకల్పం ఎంత గొప్పది కాకపోతే.. ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఈ జెర్సీ నాకు వస్తుంది’
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv