ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ సినిమా రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. మొదటి భాగం డిసెంబర్ 17న రిలీజ్ అవుతుంది. రష్మిక మంధాన హీరోయిన్. సినిమాలో ఆమె లుక్ కూడా చాలా కొత్తగా ఉంది. పుష్పను ప్రేమించే శ్రీవల్లి పాత్రలో ఒదిగిపోయినట్లు కనిపిస్తుంది. ఇక విలన్‌గా మళయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తుండటం ఆసక్తికరమైన అంశం. రీసెంట్గా రిలీజ్ చేసిన సునీల్, అనసూయ లుక్ కూడా వాళ్లని ఎప్పుడూ చూడనంత డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఇందులో సమంత ఒక స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. అల్లు అర్జున్‌తో కలిసి స్టెప్పులేయనుంది. ఈ సినిమా కోసం సమంత మొట్టమొదటిసారి స్పెషల్ సాంగ్‌లో కనిపించేందుకు ఒప్పుకుందంటే..దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటి వరకు వచ్చిన పాటలు దాక్కో దాక్కో మేక, శ్రీవల్లీ, సామిసామి పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక మూవీ నుంచి నాలుగో సింగిల్‌ను ఈనెల 19న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ సాంగ్ ప్రోమోను నిన్న రిలీజ్ చేశారు. అయితే దీనికి సంబంధించిన పోస్టర్ లుక్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. అల్లు అర్జున్ ఆ పోస్టర్లో ఒక ఖరీదైన చొక్కా ధరించి దర్జాగా కూర్చున్న ఫోటో వైరల్‌గా మారింది. ఈ చొక్కా ఖరీదు అక్షరాలా లక్షా మూడు వేలు. ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్‌గా నటిస్తున్న ఆయన ఇప్పటి వరకు రిలీజ్ చేసిన అన్ని పోస్టర్లు, పాటల్లో మాస్ లుక్‌లో డీగ్లామర్‌గా కనిపించారు. అయితే ఈ పోస్టర్లో మాత్రం డాన్‌లా కనిపిస్తున్నాడు.
షర్ట్‌కు వెనకాల పులి బొమ్మ ఉండటం విశేషం. దాక్కో దాక్కో మేక పులొచ్చి కొరుకుద్ది పీక అనే పాటకు కరెక్ట్‌గా సెట్ అవుతుంది. అయితే ధర ఎంత ఉన్నప్పటికీ కొంతమంది క్రేజీ అభిమానులు థ్రిల్ కోసం ఈ షర్ట్‌ను కొని వేసుకొని సినిమాకు వెళ్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తుంటారు. అలాంటి వారికోసం దీని వివరాలను అందిస్తున్నాం. ఇది ప్యూర్ సిల్క్ బొరాకో ప్రింట్‌తో ఇటలీ దేశం తయారు చేసిన ఈ లాంగ్ స్లీవ్ వర్సెస్(Versace) బ్రాండ్ చొక్కా . ఈ చొక్కా కొనుగోలు చేసేందుకు BUY అనే బటన్‌పై క్లిక్ చేయండి.
ఈ ఖరీదైన షర్ట్‌ను ధరించిన అల్లు అర్జున్ పోస్టర్లో చేతికి కడియాలు, వేలికి ఉంగరాలు, మెడలో బంగారం..పెద్ద బొట్టు, కళ్లజోడుతో అదరగొట్టాడు. ఇక్కడ పరిశీలించాల్సిన మరో అంశం ఏంటంటే పష్పలో ఎక్కడ చూసినా రింగుల జుట్టుతో ఉన్న ఆయన ఈ పోస్టర్లో హెయిర్ స్టైల్ మార్చి..స్ట్రైయిట్ హెయిర్‌తో కనిపిస్తున్నాడు.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి