• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • గిరిజన అభర్ధులకు శుభవార్త !

  TS: రాష్ట్రంలో ఉన్నత విద్యా కోర్సుల్లో STలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు విద్యాశాఖ కసరత్తులు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం STల రిజర్వేషన్‌ను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ నిర్మాణం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఉన్నత విద్యా కోర్సుల్లో వెలువడే నోటిఫికేషన్లకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఎంసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, పీఈసెట్ నోటిఫికేషన్లలో ఈ రిజర్వేషన్స్ అమలు కానున్నాయి.

  ప్రొఫెసర్‌పై విద్యార్థుల వ్యతిరేక తీర్మానం

  అమెరికాకు చెందిన, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రసిద్ధి పొందిన ప్రొఫెసర్ మైట్‌ల్యాండ్ జోన్స్‌కు విద్యార్థులు షాక్ ఇచ్చారు. తమకు తక్కువ మార్కులు వేస్తున్నారని, ఆయన భోధన సరిగా లేదని న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన 82 మంది విద్యార్థులు వ్యతిరేక తీర్మానం చేశారు. దీంతో యూనివర్సిటీ అధికారులు ఆ ప్రొఫెసర్‌ను యూనివర్సిటీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

  ఆ సినిమా కోసం భారీగా ఛార్జ్ చేస్తున్న రష్మిక ?

  ‘పుష్ప’ సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా గడిపేస్తుంది. అయితే ఇప్పటి వరకు ఒక్కో సినిమాకు రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకూ వసూలు చేసేది. కానీ టైగర్ ష్రాఫ్‌తో కలిసి నటిస్తున్న స్క్రూడీలా మూవీకి భారీ మొత్తంలో డిమాండ్ చేస్తుందట. ఈ సినిమాకు రష్మిక ఏకంగా రూ.5 కోట్ల పారితోషికం అందుకుంటుందని టాక్ వినిపిస్తోంది. మరి వార్తల్లో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.

  ల‌లిత్‌మోడీ-సుస్మితాసేన్‌ల బ్రేక‌ప్‌?

  ఐపీఎల్ ఫౌండ‌ర్ ల‌లిత్ మోడీ సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో ఉన్న‌ట్లు జులైలో ప్ర‌క‌టించాడు. త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకుంటామ‌ని తెలిపాడు. ఇద్ద‌రి మాల్దీవ్స్ ట్రిప్ ఫోటోలను కూడా షేర్ చేశాడు. అయితే ఇన్ని రోజులు సుస్మిత‌తో క‌లిసి ఉన్న ఫోటోను ట్వ‌ట్ట‌ర్‌ ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్న మోడీ తాజాగా మార్చేశాడు. బ‌యోలో కూడా సుస్మిత పేరును తొల‌గించాడు. దీంతో వీర‌ద్ద‌రి మ‌ధ్య బ్రేక‌ప్ జ‌రిగిందంటూ వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత‌వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే వాళ్లు క్లారిటీ ఇచ్చేవ‌ర‌కు ఆగాల్సిందే!

  ప్రాణాల మీదకు తెచ్చిన ఇన్‌స్టా సరదా

  ఇన్‌స్టాగ్రాం రీల్ సరదా ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. కాజీపేట సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు 17 ఏళ్ల యువకుడు ఇన్‌స్టా రీల్ చేసేందుకు ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లాడు. వెనుక రైలు వస్తుంటే అతను పట్టాలపై నడుచుకుంటు వస్తున్నాడు.స్నేహితులు వీడియో తీస్తున్నారు.వేగంగా వచ్చిన రైలు ఆ యువకున్ని గట్టిగా ఢీకొంది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ వైరల్ వీడియో కోసం WATCH ONపై క్లిక్ చేయండి. వీడియోలో ప్రమాద సన్నివేశం ఉంది.అది మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు. 17-year-old grievously injured while … Read more

  అందుకే పెళ్లి అంత ర‌హ‌స్యంగా చేసుకున్నాం: క‌త్రినా

  గ‌తేడాది బాలీవుడ్ న‌టులు క‌త్రినా కైఫ్‌-విక్కీ కౌశ‌ల్‌ల వివాహం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే వీరి పెళ్లికి చాలా త‌క్కువ‌మందిని ఆహ్వానించారు. ఫుల్ సెక్యూరిటీతో కెమెరాలు, ఫోన్‌లు లోప‌లికి రానివ్వ‌లేదు. ఇక పెళ్లికి వ‌చ్చేవారు క‌చ్చితంగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల‌నే నిబంధ‌న పెట్టారు. వీరి పెళ్లిపై అప్ప‌ట్లో చాలా మీమ్స్ కూడా వైర‌ల్ అయ్యాయి. అయితే తాజాగా క‌త్రినా దీని గురించి స్పందించింది. మేము పెళ్లి ప్రైవేట్‌గా చేసుకోవాల‌నుకోవ‌డం కంటే ఎక్కువ‌గా కోవిడ్ జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. మా కుటుంబ‌స‌భ్యులు క‌రోనా కార‌ణంగా ఇబ్బందిప‌డ్డారు. అందుకే … Read more

  దండయాత్ర చేస్తున్న చీమలు.. ఆందోళనలో ప్రజలు

  తమిళనాడులోని కరంతమలై రిజర్వ్ ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో ఎల్లో క్రేజీ చీమలు దండయాత్ర చేస్తున్నాయి. దండుగా వస్తున్న చీమలు కనిపిస్తున్న ప్రతీ వస్తువును తినేస్తుండడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వస్తువులతో పాటు పంట పొలాలను నాశనం చేయడం, ఎలుకలు, కుందేళ్లు, పిల్లులు, పాములను కూడా స్వాహా చేస్తుండడంతో అక్కడి ప్రజలు ఇళ్లను వదిలి వెళ్తున్నారు. 4-5మీ.మీ పొడువు ఉండే ఈ చీమలు ఆసియా, ఆస్ట్రేలియా, పశ్చిమ ఆఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తాయి. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర జాతుల్లో ఎల్లో క్రేజీ చీమల జాతి … Read more

  గాలిని అమ్ముతూ డ‌బ్బు సంపాదిస్తున్నాడు

  ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం కార‌ణంగా కొన్ని దేశాల్లో గాలి కూడా కొనుక్కొని పీల్చుకుంటున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో కొంత‌మంది ఈ విధానానికి అల‌వాటు ప‌డ్డారు. అయితే దీన్ని వ్యాపారంగా మార్చుకోవాల‌నుకున్న ఒక యువ వ్యాపార‌వేత్త గాలిని బాటిల్స్‌లో నింపి విక్ర‌యించ‌డం ద్వారా డ‌బ్బు సంపాదిస్తున్నాడు. కొలంబియాలోని మెడెలిన్ న‌గ‌ర వాతావ‌ర‌ణం చాలా ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది. అయితే జువాన్ కార్లోస్ అల్వ‌రాడో అనే ఒక స్థానిక‌ యువ‌కుడు అక్క‌డ ల‌భించే స్వ‌చ్ఛ‌మైన గాలిని సేక‌రించి ఇత‌ర దేశాల‌కు విక్ర‌యిస్తున్నాడు. దీనికి మంచి స్పంద‌న రావ‌డంతో పాటు అంద‌రి … Read more

  భార్య మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేని భ‌ర్త ఏం చేశాడో తెలుసా?

  భార్య‌పై అమిత‌మైన ప్రేమ‌తో ఆమె మ‌ర‌ణించాక ఇంట్లోనే పూడ్చిపెట్టుకున్నాడు ఒక వ్య‌క్తి. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఓంకార్ దాస్ అనే ఒక స్కూల్ టీచ‌ర్ భార్య ఇటీవ‌ల అనారోగ్యంతో మ‌ర‌ణించింది. వాళ్లకు పిల్ల‌లు లేన‌ప్ప‌టికీ భార్య‌భ‌ర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. దీంతో భార్య మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేని భ‌ర్త ఆమె త‌న‌తోనే ఉండాల‌ని ఇంట్లోనే గోతి తీసి పాతిపెట్టాడు. విష‌యం తెలుసుకున్న స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో ఆమె మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీసి న‌ర్మ‌దా ఒడ్డున పూడ్చిపెట్టారు.

  Viral Video: నీటి పంపునుంచి ఎగిసిప‌డుతున్న మంట‌లు

  మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కుచ్చర్ గ్రామం బక్స్‌హవాలో ఒక విచిత్ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఒక మంచి నీటి చేతిపంపు నుంచి ఒకేసారి నీటితో పాటు మంట‌లు ఎగిసిప‌డుతున్నాయి. ఇది చూసిన స్థానికులు షాక‌య్యారు. వెంట‌నే సంబంధిత‌ అధికారుల‌కు స‌మాచారం అందించారు. దీని వెన‌క కార‌ణం ఏంటో తెలుసుకునేందుకు ఒక బృందం అక్క‌డికి చేరుకుంది. ఈ మంట‌ల‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.