• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాలేజీ ప్రిన్సిపాల్‌ను చెంప‌పై కొట్టిన ఎమ్మెల్యే

    కాలేజీని సంద‌ర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌రైన స‌మాధానం చెప్ప‌క‌పోవ‌డంతో ప్రిన్సిపాల్‌ను చెంప‌పై కొట్టాడు. క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. క‌ర్ణాట‌క‌లో జ‌న‌తాద‌ళ్‌కు చెందిన ఎమ్మెల్యే ఎం శ్రీనివాస్.. నల్వాడి కృష్ణ రాజా వెడియార్ ఐటీఐ కళాశాలను సంద‌ర్శించాడు. అక్క‌డ కంప్యూట‌ర్ ల్యాబ్‌లో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల గురించి ప్రిన్సిపాల్‌ను ప్ర‌శ్నించాడు. అతడు చెప్పిన సమాధానాలు పొంత‌న లేక‌పోవ‌డంతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే అంద‌రిముందు ప్రిన్సిపాల్‌ను చెంప‌పై కొట్టాడు. దీంతో ఉద్యోగ సంఘాలు ఎమ్మెల్యేపై మండిపడుతున్నాయి. ఈ విష‌యాన్ని జిల్లా క‌మీష‌నర్‌ దృష్టికి తీసుకెళ్తామ‌ని వెల్ల‌డించాయి.

    https://youtube.com/watch?v=AWn9zCPH3IU
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv